S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/29/2018 - 02:31

శుక్రవారం రాత్రి ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేసిన సంపూర్ణ చంద్ర గ్రహణం స్పానిష్ ఐలాండ్‌లోని లా ప్యుంట్ పట్టణలో ఈ విధింగా కనిపించింది.

07/28/2018 - 02:17

జోహెన్స్‌బర్గ్, జూలై 27: డిజిటల్ టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను స్వీకరించి అభివృద్ధికి వినియోగించుకోవాలని ప్రధానామంత్రి నరేంద్రమోదీ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. డిజిటల్ టెక్నాలజీ కోసం ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా, అనలిటిక్స్ విభాగాల పటిష్టతకు దృష్టిని సారించాలన్నారు. వీటి వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.

07/28/2018 - 02:06

కరాచీ, జూలై 27: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరిగినా సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకాలు అంతంత మాత్రమే. దేశ వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది సీనియర్లు ఓటమి పాలయ్యారు.

07/28/2018 - 02:04

టోక్యో, జూలై 27: జపాన్‌లోని పశ్చిమ ప్రాంతానికి తీవ్రమైన తుపాను తాకే ప్రమాదముందని ఆ దేశ అధికారులు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. 200 కిలోమీటర్ల గాలుల వేగంతో ఈ తుపాను రేపటి రాత్రికి జపాన్ ప్రధాన ద్వీపాన్ని తాకే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా జపాన్‌లో తుపానులు ఈశాన్య దిశగా పయనిస్తాయని, ఇప్పుడు వచ్చే తుపాను వాయువ్యదిశగా వస్తోందని అధికారులు చెప్పారు.

07/28/2018 - 01:52

జోహెనె్నస్‌బర్గ్‌లో శుక్రవారం జరిగిన బ్రిక్స్ సమావేశం అనంతరం వివిధ దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ

07/28/2018 - 01:27

జోహానె్నస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశానికి హాజరైన రష్యా అధ్యక్ష డు పుతిన్‌తో
సమావేశమైన భారత ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు చర్చించారు.

07/28/2018 - 01:36

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 114 సీట్లు లభించినా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరో 59 మంది మద్దతు అవసరం. దీంతో ఇండిపెండెంట్లు,చిన్న, చితకా పార్టీల నుంచి గెలిచిన వారి వేటలో మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ బిజీబిజీగా ఉన్నారు. నామినేటెడ్ సీట్ల ద్వారా కొంత బలం పెరిగినా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 172 మంది మద్దతు ఉండాలి.

07/27/2018 - 02:35

వాషింగ్టన్, జూలై 26: ఇటీవల చైనాతో ఏర్పడిన డోక్లామ్ వివాదం సమసిపోయిందని అనుకుంటున్న సమయంలో, చైనా తన బుద్ధి మార్చుకోలేదని, అప్రమత్తంగా ఉండాలని భారత్‌ను అమెరికా హెచ్చరిస్తోంది. డోక్లామ్ ప్రాంతంలో చైనా దేశం తిరిగి తన సైనిక కార్యకలాపాలను ప్రారంభించిందని, దీని ని అటు భారత్ కాని, ఇటు భూటాన్ కాని అడ్డుకోవడం లేదని అమెరికా ఉన్నత అధికారి ఒకరు పేర్కొన్నారు.

07/27/2018 - 02:25

ఇస్లామాబాద్, జూలై 26: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ఉద్ధండులకు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రజా తీర్పుకు దిగ్గజ నాయకులు బిత్తరపోయారు. మాజీ ప్రధానులు, ప్రధాని అభ్యర్థులూ ఘోరపరాజయం పొందారు. మాజీ ప్రధాని షాహిద్ ఖఖాన్ అబ్బాసీ, ఆయన పార్టీ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, జమాత్ ఇ ఇస్లామీ చీఫ్ సిరాజుల్ హక్ సహా అనేకమంది ప్రముఖులు ఇంటిదారి పట్టారు.

07/27/2018 - 02:21

ఇస్లామాబాద్, జూలై 26: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఉగ్రవాద సంస్థలు, నిషేధిత గ్రూపులకు ఓటర్లు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. ముంబయిపై ఉగ్రదాడిలో సూత్రధారి హఫీజ్ సరుూద్ అల్లాహో అక్బర్ తెహ్రీక్ బ్యానర్‌పై నిలబడి మట్టికరిచాడు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేసినా ఓటర్లు ఉగ్రవాద సంస్థలను దక్కరకు రానీయలేదు.

Pages