S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/23/2018 - 03:48

ఇస్లామాబాద్, జూలై 22: మరో రెండు రోజుల్లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్‌కు మాజీ క్రికెటర్లు, సినీ నటుల మద్దతు లభించింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్‌సాఫ్ (పీటీఐ) పార్టీని స్ధాపించిన విషయం విదితమే. తాను అధికారంలోకి వస్తే వంద రోజుల్లో పాకిస్తాన్‌లో సంస్కరణలు ప్రవేశపెడుతానని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు.

07/23/2018 - 03:20

ఇస్లామాబాద్, జూలై 22: తన పార్టీకి అధికారం ఇస్తే పాకిస్తాన్‌ను భారతదేశం కన్నా బలమైన శక్తిగా రూపొందిస్తానని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ ఛీప్ షాబాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. అలా చేయలేకపోతే తన పేరును మార్చుకుంటానని ఆయన స్పష్టం చేశారని ఓ పాకిస్తాన్ మీడియా వార్త పేర్కొంది.

07/22/2018 - 20:34

సింగపూర్: సింగపూర్ ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థపై అతి పెద్ద సైబర్ దాడి జరిగింది. ఈ దాడి వెనక ప్రభుత్వంలోని కొంత మంది వ్యక్తులే కారణమై ఉండవచ్చని సింగపూర్ ప్రభుత్వం అనుమానిస్తోంది. సింగపూర్ ఆరోగ్య శాఖలో సాంకేతిక విభాగ వ్యవస్థపై జరిగిన సైబర్ దాడిలో 1.5 మిలియన్ల సింగపూర్ ప్రజల ఆరోగ్య సమాచారం తస్కరణకు గురైనట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన డాటాపై కూడా సైబర్ దాడి జరిగింది.

07/22/2018 - 02:16

ఇస్లామాబాద్, జూలై 21: పాకిస్తాన్‌లో ఈనెల 25న జరిగే సాధారణ ఎన్నికల్లో లష్కరే తోయిబా అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తులు దాడులకు దిగే అవకాశం ఉందని, ముందుజాగ్రత్త చర్యగా దేశమంతటా భద్రతాపరంగా సురక్షిత చర్యలు చేపట్టాలని అమెరికా హెచ్చరించింది. పాక్ ఎన్నికల్లో లష్కరే తోయిబా అనుబంధ సంస్థల వ్యక్తులు పాలుపంచుకునే అవకాశం ఉందని తాము ఇంతకుముందు ఎన్నోసార్లు పాక్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపింది.

07/21/2018 - 02:33

వాషింగ్టన్, జూలై 20: మిస్సోరిలో ఒక సరస్సులో ఆకస్మికంగా వచ్చిన గాలి తుపాను వల్ల ఒక నావ మునిగి 17 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదం సంభవించిన సమయంలో నావలో 31 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ నావ ఆంఫీబియస్ టెక్నాలజీతో తయారు చేశారు. భూమి మీద మోటారులాగా డ్రైవ్ చేయవచ్చు. నీటిలో తేలుతూ వెళుతుంది. మరణించిన వారిలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఏడుగురిని ఆస్పత్రిలో చేర్పించారు.

07/20/2018 - 22:23

ఐరాస, జూలై 29: హెచ్‌ఐవి వ్యాప్తికి భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఎయిడ్స్, హెచ్‌ఐవి కేసులు గణనీయంగా తగ్గాయని ఐరాస నివేదికలో వెల్లడించింది. 2010 నుంచి 2017 మధ్య గణాంక వివరాలను విశే్లషిస్తే 2010లో 1.20 లక్షల హెచ్‌ఐవి కేసులు నమోదైతే, 2017కు 88వేలకు తగ్గాయి.

07/20/2018 - 05:41

ఇస్లామాబాద్, జూలై 19: ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నప్పుడు లేదా ఇంటర్వ్యూలు, విలేఖరుల సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించే బాషపై జాగ్రత్తలు తీసుకోవాలని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను హెచ్చరించింది. ప్రతిపక్ష పార్టీలనుగానీ, నాయకులనుగానీ అనుచిత భాషలో విమర్శించడం తగదని హితవు పలికింది.

07/20/2018 - 05:39

వాషింగ్టన్, జూలై 19: ఇప్పటిదాకా, అమెరికా ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యం చేసుకుందని విమర్శలు గుప్పించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాదేశ అధ్యక్షుడి తప్పేమీ లేదని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా ఇంటిలిజెన్సీ వర్గాలు గత రెండు రోజులుగా చేసిన విమర్శలతో జరిగిన నష్టంపై ట్రంప్ నివారణ చర్యలు చేపట్టారు.

07/19/2018 - 02:19

లాహోర్, జూలై 18: పాకిస్తాన్‌లో రాబోయే ఎన్నికల్లో ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే, నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్‌కే ప్రధాన మంత్రి పదవి దక్కుతుందని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సీనియర్ నేత, మాజీ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ స్పష్టం చేశారు. అయితే, తుది నిర్ణయం పార్టీలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని అన్నారు.

07/19/2018 - 02:02

నోయిడా, జూలై 18: గ్రేటర్ నోయిడా బిస్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాబేరి గ్రామంలో నిర్మాణంలో వున్న ఒక భవనం కుప్పకూలడంతో ఐదుగురు మృతి చెందారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. ఆరు అంతస్థుల ఈ భవనం పక్కనే ఉన్న మరో భవనంపై పడిందని ఆయన అన్నారు. దీనితో రెండో భవనం కూడా పక్షికంగా దెబ్బతిన్నదని చెప్పారు.

Pages