S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/15/2018 - 01:56

లాహోర్, జూలై 14: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పాకిస్తాన్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన కారణంగా ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (పీఎంల్‌ఎల్-ఎన్) నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం (ఏటీఏ)తోపాటు అక్కడి పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

07/15/2018 - 01:53

పెషావర్, జూలై 14: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సందర్భంగా జరిగిన మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో మృతుల సంఖ్య 130కి చేరుకుంది. మిలిటెంట్ల దాడులకు నిరసనగా ఆదివారం దేశవ్యాప్తంగా సంతాపదినం ప్రకటించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.

07/14/2018 - 03:28

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో క్వెట్టా ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 70 మంది మరణించారు. 120 మందికి తీవ్రంగాయాలయ్యాయి. ఎన్నికల ర్యాలీని లక్ష్యంగా చేసుకుని తాలిబాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25వ తేదీన పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది.

07/14/2018 - 03:28

లాహోర్: అవినీతి కేసులో జైలు శిక్ష పడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్ లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అబుదాబీ నుంచి విమానంలోనవాజ్ షరీఫ్, కుమార్తె మరియమ్ లాహోర్‌కు చేరుకున్నారు. ఇటీవల అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, కుమార్తె మరియమ్‌కు ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించిన విషయం విదితమే.

07/13/2018 - 02:11

ఐక్యరాజ్య సమితి, జూలై 12: భారత్‌లో 2030 నాటికి పట్టణ జనాభా శాతం 40 శాతానికి పెరుగుతుందన్న అంచనా ఉంద ని, దానిని అందుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక కొత్త చికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉందని కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి చెప్పారు.

07/12/2018 - 02:15

లాస్ ఏంజిల్స్, జూలై 11: పాప్ సంగీత ప్రపంచానికి రారాజుగా వెలిగిపోయిన మైఖేల్ జాక్సన్ అత్యంత దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. ప్రత్యేకించి కన్నతండ్రి జో చేతిలో చిత్ర హింసలు అనుభవించాడు. ఈ విషయాలను అతనికి వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అందించిన కన్‌రాడ్ ముర్రే తాజాగా విడుల చేసిన ‘ది బ్లాస్ట్’ వీడియోలో వెల్లడించాడు.

07/11/2018 - 22:32

టోక్యో, జూలై 11: రోగులకు సేవ చేసి ప్రాణాలు నిలపాల్సిన ఒక నర్సు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తున్న జపాన్‌కు చెందిన ఒక నర్సు ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం తాను నర్సు వృత్తిలో ఉండగా 20 మందికి అపాయకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీశారు. ఈ నర్సు పేరు ఆయూమీ కుబోకి. ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

07/11/2018 - 22:28

డెహ్రాడూన్, జూలై 11: భారీ వర్షాలు వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లో ఏడుగురు మృతిచెందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. డెహ్రాడూన్ జిల్లాలోని శాస్ర్తీనగర్‌లో కొండవాలును ఉన్న ఓ ఇంటిపై మట్టిపెళ్ళలు విరిగి పడడంతో అందులో నివసిస్తున్న వారిలో నలుగురు మృతిచెందారు. వారిలో ఒక మహిళ, బాలుడు ఉన్నారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్‌ఈఓసీ) తెలిసింది.

07/11/2018 - 22:27

సియోల్, జూలై 11: ఉత్తర కొరియా అణ్వస్త్రాల తయారీలో ముందంజలో ఉండి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కాని దేశంలోని బాలల్లో ఐదో వంతు మంది పౌష్టికాహార లేమితో సతమతమవుతున్నారు. ఈ వివరాలను ఐరాస మానవతా సహాయ విభాగం వెల్లడించింది. ఐరాస మానవత సహాయ విభాగం కార్యదర్శి మార్క్ లోకాక్ ఉత్తరకొరియాను ఇటీవల కాలంలో తొలిసారిగా సందర్శించారు. 2011 తర్వాత ఐరాస ప్రతినిధిగా ఆయన ఉత్తరకొరియాను సందర్శించడం ఇదే తొలిసారి.

07/11/2018 - 01:29

యునైటెడ్ నేషన్స్, జూలై 10: ప్రపంచంలో 535 మిలియన్ల మంది పిల్లలు ఘర్షణలు లేదా విపత్తుల సంభవిస్తున్న దేశాల్లోనే జీవిస్తున్నారని ఐరాస వెల్లడించింది. అంతే నాలుగింట ఒక వంతు బాల్యం అనిశ్చితి పరిస్థితుల మధ్యే గడుపుతున్నట్టు.

Pages