S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/23/2016 - 07:38

వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష పదవికి తీవ్రస్థాయిలో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (69) భారత్‌తోపాటు చైనాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. అమెరికానుంచి భారత్, చైనా వంటి దేశాలు ఉద్యోగాలను తన్నుకుపోతున్నాయని ఆయన ఆరోపిస్తూ, వాటిని అమెరికాకు తిరిగి తీసుకొస్తానని శపథం చేశాడు.

02/22/2016 - 04:59

కలామజూ, ఫిబ్రవరి 21: అమెరికాలోని పశ్చిమ మిచిగాన్ నగరంలో ఓ ఆగంతకుడు విచ్చలివిడిగా కాల్పులు జరిపి ఏడుగురిని చంపేశాడు. మృతుల్లో 14ఏళ్ల బాలిక ఉందని అధికారులు తెలిపారు. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని రెస్టారెంట్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

02/20/2016 - 01:57

వాషింగ్టన్, ఫిబ్రవరి 19: అమెరికా అధ్యక్ష రేసులో డిమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న హిల్లరీ క్లింటన్ సమీప అభ్యర్థి బెర్ని శాండర్స్ కన్నా కొద్దిగా వెనకబడి ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫునే బరిలో ఉన్న 74 శాండర్స్‌కు జాతీయ పోల్ సర్వేలో ప్రాథమింగా 47 శాతం ఓట్లు సాధించారు. 44 శాతం ఓట్లతో హిల్లరీ క్లింటన్ రెండో స్థానంలో నిలిచారు.

02/20/2016 - 01:31

లాహోర్/ఇస్లామాబాద్, ఫిబ్రవరి 19: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్ దర్యాప్తు ప్రారంభించింది. ఈఘటనకు సంబంధించి పలువురు వ్యక్తులపై పాక్ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పాక్ స్వదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎయుతాజ్ ఉద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దాడి వెనక జైషే ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ హస్తముందని భారత్ మొదటి నుంచీ ఆరోపిస్తోంది.

02/19/2016 - 07:32

లండన్: మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహంగా భావిస్తున్న జూపిటర్ తరహాలో మరో ఐదు కొత్త గ్రహాలను శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. వీటన్నింటికీ కూడా అనేక విధాలుగా జూపిటర్ గ్రహంతో సారూప్యత ఉందని కీలీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ ఐదు కొత్త గ్రహాలు కూడా తమ మాతృ నక్షత్రాలు అతి సమీపంగా పరిభ్రమించడం వల్ల జూపిటర్ (బృహస్పతి) తరహాలో ఇవన్నీకూడా అగ్ని గుండాలుగానే ఉన్నాయని వెల్లడించారు.

02/17/2016 - 08:22

వాషింగ్టన్: అమెరికా సుప్రీంకోర్టు జడ్జి ఆంటోనిన్ స్కాలియా ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానంలో జడ్జీగా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేయాలని అనుకుంటున్న వారిలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు అమెరికన్లు ఉన్నట్లు తెలుస్తోంది. టెక్సాస్‌లో స్కాలియా మృతిచెందిన కొద్ది గంటలకే ఆ ఖాళీలో నియమించబోయే వారి పేర్లలో చండీగఢ్‌లో జన్మించిన శ్రీ శ్రీనివాసన్ పేరు ప్రముఖంగా వినిపించింది.

02/15/2016 - 00:35

వాషింగ్టన్, ఫిబ్రవరి 14: అమెరికా సుప్రీం కోర్టు ధర్మాసనంలో నియమితుడైన తొలి ఇండో-అమెరికన్ న్యాయమూర్తిగా శ్రీ శ్రీనివాసన్ చరిత్రకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

02/14/2016 - 08:15

ఐక్యరాజ్య సమితి: ప్రపంచానికే ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఐరాస వ్యవస్థ సరిపోదని, దానికి ప్రపంచ దేశాలన్నిటినుంచి మరింత సహకారం అవసరమని భారత్ అభిప్రాయపడింది.

02/14/2016 - 08:14

ఐక్యరాజ్య సమితి: లైబీరియాలో భారత్‌కు చెందిన మహిళా శాంతి పరిరక్షక దళం అందరికీ స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ ప్రశంసిస్తూ, మహిళలపై లైంగిక దాడులు, వారి అక్రమ రవాణా, వేధింపులులాంటి వాటిని అరికట్టడానికి సమితి చేస్తున్న కృషికి మహిళలు ఎలా తమ వంతు సేవలందించగలరో చెప్పడానికి వారి ప్రవర్తన ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

02/13/2016 - 01:44

వాషింగ్టన్, ఫిబ్రవరి 12: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్, బెర్నీ శాండర్స్‌లు ఇప్పుడు లాటినో, ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అంతేకాదు డెమోక్రటిక్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక చర్చాగోష్ఠిలో ఈ ఇద్దరూ జాతి వివక్ష, ఇమిగ్రేషన్‌కు సంబంధించి తమ రికార్డులు లాంటి అంశాలపై పరస్పరం వాదించుకున్నారు.

Pages