S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/11/2018 - 18:54

దైవం సృష్టించిన మానవులకు కర్మానుసారం అన్నీ లభించినా తృప్తి అనే అలౌకికభావం అందదు. ఇంకా ఏదో కావాలనే తపనతో, అందు నిమిత్తం ఎలాంటి అకృత్యాలకైనా వెనుదీయని మనిషి, ఇతరులను సాధిస్తూ, బాధిస్తూ, స్వార్థపూరిత వ్యవహారాలతో సతమతమవుతూ ఉంటాడు. కృత్రిమ భక్తితో, ఆడంబరాలతో, ఆయనను మెప్పించాలని రకరకాల పూజా పునస్కారాలు, తీర్థయాత్రలు, వరాలకోసం చేస్తూ ఉంటూ తీరా అవి లభించకపోతే నిరాశతో కృంగిపోతూ ఉంటారు.

09/10/2018 - 20:17

జగత్తుకు విపత్తు వాటిల్లినప్పుడు, ధర్మగ్లాని సంభవించినప్పుడు, దుష్టజన శిక్షణకు, సాధుజన రక్షణకు యుగయుగాల్లో అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నాడు. ఈ విషయం సర్వులకు విదితమే!

09/09/2018 - 22:56

సుందరకాండ పారాయణవల్ల సకల దోషాలు తొలగిపోతాయి. శని, రాహు, కుజ, కేతు దోషాలవల్ల మనుషులు ఎన్నో కష్టనష్టాలకు గురవుతూ వున్నారు. అటువంటి బాధల నుంచి విముక్తి పొందేందుకు సుందరకాండ పారాయణను చేయడం అత్యంత శ్రేష్టమని సాక్షాత్ ఆ పరమశివుడు పార్వతిదేవితో ఓ సందర్భంలో అంటాడు. ‘‘ఓ పార్వతీ!

09/02/2018 - 22:18

ఈ ప్రపంచమంతా ఒకే ఒక మూల పదార్థంలోనుంచి ఆవిర్భవిస్తోందని భారతీయ వేదాంత భావన చెబుతోంది. ఉదాహరణకు, ముండకోపనిషత్తులో శిష్యుడు గురువును యిలా ప్రశ్నిస్తాడు. ‘కస్మిన్ ను భగవన్ విజ్ఞాతే- సర్వం ఇదం విజ్ఞాతం భవతి’’అని. అంటే ‘‘ఓ గురుదేవా! ఏ ఒక్కదాన్ని తెలుసుకొంటే సమస్తమూ తెలుసుకోబడుతుందో, దానిని నాకు తెలుపవలసింది’’-అని భావం. ఆ ఉపనిషత్తులో చాలా చర్చ జరుగుతుంది. చివరకు గురువు యిలా చెపుతాడు.

08/31/2018 - 19:46

వేదాంత భావన

08/28/2018 - 19:38

కన్యకామణిని చూసిన పురంజనునికి చాలా సంతోషం కలిగింది. నేను గొప్ప అందగాణ్ణి కనుక నన్ను తప్పక వరిస్తుంది. నేనే వెళ్లి మాట కలుపుతాను. అపుడు ఆమె నా గొప్పతనాన్ని తెలుసుకొంటుంది. నాకోర్కె నెరవేరుతుంది అనుకొన్నాడు. వెంటనే ఆమె చెంతకు వెళ్లాడు.

08/28/2018 - 19:22

గ్రీకులో ‘ఎస్క్రులిన్’ అనే దేవత వున్నాడు. ఆయన చేతిలో పాము చుట్టబడిన కర్ర ఒకటి ఉంటుంది. ‘దాహూమా’లో స్వర్ణదేవతకు ‘దాంతిగ్లోయ్’ అని పేరు. బుద్ధ విగ్రహాల వెనుక పాము పడగ పట్టినట్లు చెక్కిన శిల్పాలు కొన్ని వున్నాయి.

08/26/2018 - 21:24

షోడశోపచార పూజ:
ఉత్సవాలు ఎన్నిచేసినా అన్నిటికీ పునాది వంటిది షోడశోపచార పూజ. ఇది అన్ని పూజలకు సమానంగా వుండే పునాది. మిగిలిన ఉత్సవాలు చేతనైనా కాకపోయినా ప్రతివారూ ఈ షోడశోపచార పూజా విధానం నేర్చుకోవాలి.
షోడశ అంటే 16; 16 రకాల సేవలు మనం దేవతలకు అర్పిస్తున్నాం గనుక, దీని పేరు షోడశోపచార పూజ. దేవత మన ఎదురుగుండా ప్రత్యక్షంగా వుండదు. మరి మనం ఉపచారాలు ఎలా చేస్తాము?

08/19/2018 - 23:13

ఏ పనికైనా నియమాలు నిష్ఠలు తప్పనిసరి. అది ఆధ్యాత్మికమైనా, లౌకికమైనా ఒక ప్రణాళికతో పనిచేస్తే ఆ పని సులువుగా జరిగిపోతుంది. ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇంతకుముందు మనం చేయాలనుకొన్న పనిని చేసినవారు కొన్ని నియమాలు ఏర్పాటు చేసి ఉంటారు. వాటిని తరువాతి భక్తులు అనుసరిస్తుంటారు. పెద్దవాళ్లు చేసారు. నేను అట్లానే చేస్తున్నాను అని చెబుతుంటారు. అట్లానే ఏ దేవాలయానికైనా వెళ్లితే అక్కడ కొన్ని నియమాలు ఏర్పాటు చేస్తారు.

08/17/2018 - 19:39

ఓసారి బలరామ కృష్ణులు ఆవులు మేపడానికి వెళ్లారు. పచ్చిక కోసం చాలా దూరం తిరిగారు. లేత పచ్చిక ఉన్న చోట ఆవులను వదిలి వారు అక్కడున్న చిన్న చిన్న చెలమల దగ్గర కూర్చున్నారు. వేసవి ఎండ వేడిమి చాలా తీవ్రంగా ఉంది. దానికి తట్టుకోలేక బలరామకృష్ణులు ఓ వట వృక్షం నీడన మేను వాల్చారు. గోపబాలకులందరినకీ బడలికతో ఆకలి వేసింది. వారంతా బలరామకృష్ణులకు వారి ఆకలిని చెప్పారు.

Pages