S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

04/29/2019 - 18:58

ఈ గ్రంథ ప్రణాళికలో చిన్నయసూరిగారి తరువాత గూడా సాగిన విస్తతమయిన సాహిత్యం పరిచేయటం ఉండనే ఉన్నది. అదట్ల ఉంచితే, ప్రకాశకులు భావించినట్టు ఈ ప్రచురణ ఒకవిధంగా అనిదం పూర్వమే- అంటే, ఇంతకుముందు లేని తీరే.

04/28/2019 - 23:06

పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు వంటివారిలో ఈ వైవిధ్యాన్ని గమనించవచ్చు. అదట్లా ఉంచి; అసలు వివిధ ప్రక్రియల ఉద్యమ విధానం ఏమిటి? ప్రక్రియలు ఏ విధంగా ఎందుకు ఉంటాయి. వాటి ఉద్యమానికీ, వైవిధ్యానికీ కారణాలేమిటి? ఉదాహరణకు శతక ప్రక్రియ రూపొందటానికి మూలమేమిటి? సంస్కృతం నుంచి వచ్చింది అని చేతులు దులుపుకోవటమేనా? తెలుగులో సంస్కృతానికి భిన్నంగా నాల్గవ పాదాంతాన సంబోధనగా మకుటం ఎందుకు నిర్థారింపబడింది?

04/26/2019 - 20:00

ఈనాటి భాషలో చెపితే ఇట్లాంటివాటిని ‘తిరుగుబాటులు’ అనో, వేల్చేరు నారాయణరావుగారి మాటను ఉపయోగించుకొంటే, ‘విప్లవాలు’ అనో అనవచ్చు. అట్లాంటి తిరుగుబాటులు, విప్లవాలు ఎంతకాలం వాటి తొలి స్వరూప స్వభావాలతో నిలద్రొక్కుకొని మనగలుగుతాయి.

04/25/2019 - 22:23

ఈ నిరూపించుకొనే ధోరణిలో ఆరుద్రగారు- రాజకీయాలవల్ల వివిధ రంగాలలో పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. విభిన్న సంఘటనలే జరిగినా, అవి ఒక చారిత్రక క్రమంలోనే ఉంటాయి. రాజకీయ ప్రభావాలకు లోనుగాని యుగం ఉండదు’ అంటారు. దీన్నిబట్టి చూస్తే రాజకీయ పరిణామాలను బట్టి యుగ విభజన చేయవలసి వుంటుంది. కాని, ఆరుద్రగారు కొంచెం పూర్వుల మాదిరిగానే రాజు, రాజవంశాలపేరిట చాళుక్య యుగం ఇత్యాదిగా యుగ విభజన చేశారు.

04/24/2019 - 22:24

ఆ తరువాత సారళ్యం సాధించిన టెక్నిక్ ప్రయోగానికి సినీవాలి కావ్యం ఒక ఉదాహరణ. కాగా తెలుగు కవితా రంగంలో ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. గురజాడ ముత్యలసరానికి ధీటు అనిపించే తీరులో కూనలమ్మ పదాలు రచించారు. ఛందోలాక్షణికులు గుర్తించిన ఉదాహరణ కావ్య భేదాల్లో ఒకటయిన పద్ధతి రచించారు. తన శ్రీమతిని సంబోధిస్తూ ఆయన రచించిన మూడు వందల కందాలు కేరాత్రిశతి వచనకవితకు సాటిగా వాక్య కవితను ప్రయోగించారు.

04/23/2019 - 18:30

తెలుగులో సాహిత్య చరిత్ర రచనా విషయంగా సాగినా కృషి తక్కువేమీ కాదు. పంతొమ్మిదవ శతబ్దం నాలుగవ పాదం ఆరంభంలో అంటే, 1876 గురజాడ శ్రీరామమూర్తిగారు వెలువరించిన కవి జీవితములు అనే గ్రంథం సాహిత్య చరిత్ర రచనా కృషికి బహుశః ఒక శుభారంభం కావచ్చు.

04/22/2019 - 19:52

నేడు ఇహలోక సుఖం అభ్యుదయమని ప్రాచీన నవీనాంధ్ర కవులు వాడిన అభ్యుదయ శబ్దానికి విశిష్టంగా అర్థాన్ని విశదీకరించారు. ‘‘నా మేధ శంకర రామానుజులు. నా బోధ వివేకానంద మహాత్ములు, నా గాథ కాళిదాస రవీంద్రులు, నా బాధ హింస రిరంస. ఈ అవగాహన నా సప్త ధాతువులలోను జీర్ణించింది. నేను అంటే నా జాతి. ఈ భావన పాదుకొన్నపుడు నా జాతి హిమశిఖరంలా తలయెత్తుకుని తిరుగుతుంది. తాను తానుగా నిలబడుతుంది.

04/21/2019 - 22:20

అందుకనే భాగవత కవితలోని విశిష్టతతో పాటు గోపికలు కృష్ణుని దుడుకుచేష్టలు చెప్పడంలో ఆడవారి చేత అట్టి మగ పనులు చెప్పిండం అనుచితం అనక తప్పదు- ఈ సన్నివేశంలో ఎఱ్ఱన ఇతర చేష్టలను వర్ణించాడు గాని, బాలుని అనుచిత శృంగార చేష్టలను వర్ణించలేదు అని నిర్మొహమాటంగా లోపాన్ని వ్యక్తీకరించారు విశిష్టంగా.

04/19/2019 - 20:00

ప్ర సిద్ధులు, యుగకర్తలైన కవులతోపాటు పండితారాధ్యుడు, పాల్కురికి సోమన, కేతన, మారన, మంచన, గోన బుద్ధారెడ్డి, నాచన సోమన, గౌరన, జక్కన, నంది మల్లయ, ఘంట సింగయ, సంకుసాల నృసింహకవి, తెలగన, కందుకూరి రుద్రకవి, రంగాజమ్మ, శేషం వెంకటపతి, ముద్దుపళని- సుమారుగా 43 మంది ప్రాచీనాంధ్రకవుల- కవయిత్రుల కావ్య స్వరూపాలను కళ్ల ఎదుట నిలబెట్టారు విలక్షణగా.

04/17/2019 - 20:15

యువసాహితీ పాఠకులకు, ప్రాచీనాంధ్ర సాహిత్య పరిచయంలేనివారికి శాసనాల వీరాసనాలతో తలనొప్పి కలిగించక, కేవల కవితాభిరుచి కలిగేలా, ఆ కావ్యాలను చదవాలనే కోరిక కలిగేలా, ఒక ఉగాదినాడు చేసిన అయిదు ప్రసంగాల్లో, ఎవరి ప్రవేశికలూ- పీఠికలూ నడిపించని ధోరణిలో, వాగ్దేవి ముఖం చూసి ఏ మూలుగులూ, మొహమాటాలు లేని పద్ధతిలో గాఢానుభూతితో వ్యక్తీకరిస్తున్నట్టుగా కవితా సమీక్షల్ని రుూ గ్రంథాల్లో ఇంతకుపూర్వం ఎవరూ చేయలేదు- ఒక ఇంద్రగ

Pages