S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/14/2017 - 21:28

కృష్ణ భగవానుడిపై మీరా భక్త్భివం అజరామరం. అలాంటి భక్తురాలిపై నృత్యనాటకం ప్రదర్శించటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని అంటారు ప్రఖ్యాత నృత్యకారిణి చిత్రా విశే్వశ్వరన్. మీరా భక్తితత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్న ఈ కళాకారిణిని మీరాభాయి పాత్ర చిన్ననాడే కదిలించిందని చెప్పవచ్చు.

06/13/2017 - 21:45

ప్రవల్లిక, మాధవ, నిఖిల్..హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురూ పర్యావరణ ప్రియులు. సినిమాలు, షికార్లు, చాటింగ్‌లతో కాలం వెళ్లబుచ్చకుండా విలువైన సమయాన్ని మొక్కల పెంపకానికి వెచ్చిస్తున్నారు. ‘లోకక్షేమం’ ఫౌండేషన్‌లో వలంటీర్లయిన ఈ ముగ్గురు చేస్తున్న చిరు ప్రయత్నానికి వేలాది మొక్కలు చిగురిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

06/10/2017 - 21:22

ఎత్తయిన కొండలు మధ్య బైక్ మీద ప్రయాణం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి హిమాలయ పర్వతాలను బైక్ మీద చుట్టేసింది మూడు పదుల సారాకశ్యప్. గూగుల్ కంపెనీలో ఉద్యోగానికి సైతం గుడ్‌బై చెప్పి సాహసమే ఊపిరిగా భావించే కశ్యప్ హిమాలయాలను బైక్‌పై అధిరోహించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.

06/09/2017 - 21:00

చుట్టూ మంచుకొండలు. రివ్వున వీచే చల్లటి గాలులు. కనుచూపు మేరలో మనిషి జాడ కనిపించదు. ధైర్యమే ఊపిరిగా ముందుకు సాగి ఎత్తయిన ఎవరెస్ట్‌ను ఐదుసార్లు విజయవంతంగా అధిరోహించింది. ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆమే అన్షు జామ్సెన్ప. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఈ ధ్రువతార ఇద్దరు టీనేజ్ పిల్లలకు తల్లి. 37 సంవత్సరాల అన్షుజామ్సెన్ప 29,029 అడుగుల ఎవరెస్ట్ శిఖరాన్ని ఐదు రోజుల్లో రెండు సార్లు అధిరోహించింది.

06/08/2017 - 22:31

నటి, జంతు ప్రేమికురాలు ఉత్తర ఉన్ని ‘‘పాదముద్రలు’’ పేరుతో లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తన జీవితమే కథ అని ఆమె అంటున్నారు. ఇంతకు ముందు ఉన్ని తీసిన ‘రాండమ్ వరవు, తొమ్మిదవ నెల’ లఘుచిత్రాలు హారర్ తరహాలో ఉండగా.. ఈసారి విభిన్నంగా ఉండాలని జంతువులపై తీస్తున్నారు. వాస్తవంగా ఉన్ని కుక్కలను ఎంతో ఇష్టపడతారు.

06/07/2017 - 21:01

పడుకున్న వెంటనే హాయిగా నిద్రపోయేవాళ్ళు అదృష్టవంతులు. అయితే ఆ అదృష్టం అందరికీ వుండదు. మారిన పరిస్థితుల దృష్ట్యా పిల్లలలో కూడా నిద్ర సమస్యగా మారటం ఆశ్చర్యంగానే వుంటుంది.
నిద్ర సరిగా పోనివారిలో ఊబకాయం సమస్య మొదలవుతుంది. కానె్వంటుల్లో, పాఠశాలల్లో భారీకాయాలతో వుండే పిల్లలు కనిపిస్తున్నారు. మితిమీరిన బరువువలన పిల్లలు అందం, ఆకర్షణ కోల్పోతున్నారు.

06/06/2017 - 23:05

‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అన్నాడో కవి. అవును. ఈ మాటలు ఆ ఆటో భవాని విషయంలో అక్షరాలా నిజమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళకు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు గుంటూరు నల్లచెరువుకు చెందిన కోలా భవాని. హెచ్‌ఐవితో భర్త మరణించినా, నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన కాళ్ళమీద తను నిలబడింది.

06/02/2017 - 20:52

హై బ్రిడైజేషన్ పుణ్యమా అని ప్రస్తుతం 150 రకాల మందారాలు అం దుబాటులో ఉంటున్నాయి. మందార వివిధ కొమ్మలు, రెమ్మలతో గుబురుగా పెరిగే మొక్క. దాదాపు ఆరడుగుల ఎత్తు పెరుగుతుంది. మామూలుగా ఎరుపు, మెజంటా రంగుల మందారాలు సహజ రూపం గలవి.

06/01/2017 - 20:52

పిల్లలకు కథలు చెప్పటం అనేది సీరియస్‌గా తీసుకుని చేయాలి. అపుడే వారి విద్యాభివృద్ధికి, భాషాభివృద్ధికి దోహదం చేస్తుందని అంటున్నారు దీపాకిరణ్. హైదరాబాద్ నగరానికి చెందిన ఈ దీపాకిరణ్ అనే ఆన్‌లైన కథకురాలికి జాతీయ స్థాయి అవార్డు (2015-16) సంవత్సరానికి దక్కింది. కన్సార్టియం ఆఫ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ సంస్థ కథకులకు ఏటా పోటీ నిర్వహిస్తుంటారు. ఈ పోటీకి దీపాకిరణ్ తన వీడియోను పంపారు.

05/31/2017 - 23:52

ఉత్తర ఢిల్లీ నగరంలో జిబిటి నగర్‌లో రవీంద్రకుమార్ తన ఆటో పెట్టుకుంటాడు (32). ఈ ఆటో డ్రైవర్ స్వచ్ఛ్భారత్ ప్రియుడు. అక్కడ, ఎవరయినా నెంబర్ వన్ కాని నెంబర్ టు కాని చేశారో- వాళ్ళని అడ్డుకుంటాడు, లెక్చర్ ఇస్తాడు- హితవాక్యాలు చెప్పి ‘‘అంతగా పైసలు లేకపోతే నేనే రెండు రూపాయలిస్తా- అదుగో.. పో అక్కడ ప్రజా పాయిఖానా- పబ్లిక్ టాయిలెట్స్ వున్నాయి- రుసుము చెల్లించు వాడుకో-’’ అని వారిస్తాడు.

Pages