S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/10/2017 - 00:15

అంతరిక్షంలో మరోసారి తెలుగు వెలుగు కనిపించింది. భూమికి అనేక కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంతలోని ఓ గ్రహానికి సాహితి పింగళి అన్న పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న బెంగళూరుకు చెందిన తెలుగు బాలిక పింగళి సాహితి పేరే అది. ఇది మనకు ఎంతో గర్వకారణమైన పరిణామం.

09/08/2017 - 23:03

‘కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్త్భుం’ అనే శ్లోకం వినని వాళ్లుండరు. సంస్కృతంలో ‘తిలకమ్’ అని, తెలుగులో ‘బొట్టు’ అని అర్థం. మన నుదుటిలో జ్ఞాన నేత్రం ఉండేచోటు అంటే రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎఱ్ఱని కుంకుమ బొట్టు ప్రతినిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెబుతోంది. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులున్నాయి. ఇవి ప్రాణశక్తిని ప్రవహింపజేసే అదృశ్య నాళికలు.

09/07/2017 - 23:29

శబ్ద మాధుర్యం రానురాను దూరమవుతుంది. ఆధునిక జీవనశైలి వల్ల ఇక ఎప్పటికీ తిరిగిరానని వీడ్కోలిస్తుందేమో! ధ్వని కాలుష్యమే అందుకు కారణం. ఆధునిక మానవుడికి రాబోయే దశకాల్లో బాహ్య చెవులు అంతరించిపోయే ప్రమాదముంది. హెడ్‌ఫోన్‌లకు అలవాటుపడిన చెవులకు సాధారణ శబ్ద ధ్వని వినపడదు. ఇరువైపులా ఎలాగూ హెడ్ ఫోన్ పరికరం ఉంటుంది కదా, ఇక బాహ్య చెవులతో పనేం ఉంది. పిలిచినా మాటాడినా ఒకరికొకరికి వినపడదు.

09/06/2017 - 23:33

కేరళవాసులు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే ఓనం పండుగ వేడుకలు ముగిశాయి. బలి ఆగమనాన్ని పురస్కరించుకుని తమ సంస్కృతి సంప్రదాయాలకు వారసత్వంగా జరుపుకునే ఓనం నయన మనోహరంగా పదిరోజుల పాటు సాగుతుందంటే అతిశయోక్తి కాదు. కేరళవాసులు దేశంలో ఎక్కడ ఉన్నా జాతి, కుల, మత భేదాలకు అతీతంగా అందరూ సమిష్టిగా జరుపుకుంటారు. ముంగిట ముగ్గులు, ఆ ముగ్గులను పూలతో అలంకరించటం, నృత్యాలతో సాగే ఉత్సవాలు అలరారుతాయి.

09/05/2017 - 22:33

సాహసం ఆమె ఊపిరి. ధైర్యం ఆమె ఆయుధం.
అందుకే పోలీసు అధికారిణిగా సంచలనాలకు మారుపే
రుగా నిలిచింది. ఏ పదవి చేపట్టినా.. అక్కడ తిష్టవేసే
అవినీతి, అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నంగా
నిలిచే తమిళనాడు ఐపీఎస్ అధికారిణి రూప. ఆమె
జీవితం కూడా వెండితెర మీద మెరవనున్నది. కన్నడ
దర్శకుడు ఏఎంఆర్ రమేష్ ఇందుకు సన్నహాలు
చేసుకుంటున్నారు. ఎంతోమంది పోలీసు అధికారులు,

09/02/2017 - 00:17

ఆధునిక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రతి ఇంట్లోను సుగర్, బిపి పేషంట్లు ఉంటున్నారు. 50, 60 ఏళ్లకి
మోకాళ్ల నొప్పులు, కీళ్ల బాధలు తప్పట్లేదు. వారు జబ్బుల
జాబితాను చూపిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేల ప్రకారం నేటికీ కూడా 70 శాతం చిన్నచిన్న రుగ్మతలకు ఇంట్లో పెంచుకునే మొక్కలే
ఔషధాలుగా పనిచేస్తాయని వెల్లడైంది. ఆ వివరాలు తెలుసుకుని అమలు

08/31/2017 - 23:49

మంచి పని మంచి మనసును ప్రతిఫలిస్తుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన డాక్టర్‌కు వచ్చిన ఓ వినూత్న ఆలోచన పలువురి పేదల కనీస అవసరాలను తీర్చేదిగా నిలిచింది. డాక్టర్ ఆలోచన పిచ్చిదనికొంతమంది కొట్టిపారేసినా సేవా సంకల్పంతో ఆచరణలో పెట్టిపలువురితో భేష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీగోడ ఇప్పుడు పదిమందిలో హాట్ టాపిక్ అంటే అతిశయోక్తి కాదు.

08/30/2017 - 22:19

ఎంతటివారైనా సుఖజీవనానికి ఆరోగ్య సూత్రాల్ని పాటించాల్సిందే. వేసవి వేడికి తట్టుకోవాలంటే చల్లని పానీయాలు తాగాల్సిందే.
బత్తాయి రసంలో ఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి పొట్టకు మేలు చేస్తూ మేలు చేసే ఆమ్లాలువిడుదల చేయడంవలన జీర్ణాశయం శుభ్రపడి ఆరోగ్యాన్ని అందిస్తుంది. తద్వారా రోగాలు దూరవౌతాయి. ప్రతిరోజూ గ్లాసు బత్తాయిరసం తీసుకోవడంవల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
మధుమేహం

08/29/2017 - 22:46

మానవులకు దేవుడిచ్చిన అపురూపమైన గొప్పవరం నవ్వు. ఈ భాగ్యం మానవాళికి మాత్రమే దక్కింది. హాయిగా నవ్వడంవల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వితే ఆయువు పెరిగి శారీరక ఆరోగ్యం చేకూరి, చలాకీగా ఉండటంతో వత్తిళ్ళు దరిచేరవు. ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు నవ్వగలిగితే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ఆందోళనను మటుమాయం చేసి మనస్సును ప్రశాంతంగా వుం చుతుంది.

08/26/2017 - 22:38

అమ్మ అనే పదం పలకటంలోనే ఎంతో ఆత్మీయత, దగ్గరితనం కనిపిస్తుంది. అమ్మ అంటే అమ్మాయిలకు కొండంత అండ. అమ్మ ప్రేమ, అనురాగం వెన్నంటి ఉన్నంతవరకు ఎదురులేదు. ఇంటిపనులు, వంటపనులు నేర్చుకోవటానికే కాదు ఏ చిన్న కష్టం వచ్చినా, ఎటువంటి సమస్యనైనా అమ్మకు చెబితే చిటికెలో పరిష్కారం దొరుకుతుందని భరోసాతో ఉంటారు. అమ్మ మాటలు అమ్మాయిలో మనోబలాన్ని, ధైర్యాన్ని పెంచుతాయి.

Pages