S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

02/22/2019 - 20:31

పుత్రో యజ్జానం పిత్రో రధీయతి:- తానూ సంతానవంతుడను కావాలనే కోరకను తల్లిదండ్రుల ఎదుట పలుమార్లు ప్రస్తావించిన కుమారుని మాటలు తల్లిదండ్రులకు సంతోషాన్ని కల్గిస్తుందని బాహ్యార్థమే అయినా సంతానోత్పత్తి చేయగల వయస్సునకు చేరిన తరువాత గాని కుమారునకు వివాహం చేయరాదని వేదం అంతరార్థంగా ప్రకటిస్తూంది. అంటే బాల్యవివాహం చేయవద్దని పరోక్షంగా వేదం శాసించిందని భావించాలి.

02/21/2019 - 19:15

‘తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ’ (తై.ఉ.్భృగువల్లి 2) తపస్సు చేతనే బ్రహ్మను తెలుసుకో ఇత్యాది తపోవిధాయక వాక్యాలు కనబడతాయి. వేదంలో కూడ ‘తపా తపిష్ఠ తపసా తపస్వాన్’ (ఋ.6-5-4) ‘‘ఓ తపః కర్మిష్టా! తపస్సు చేత తపస్వినై తపమాచరించు’’మనే ఆదేశాలూ కనబడతాయి.

02/20/2019 - 19:22

విద్వాంసుడు అంతట పూజింపబడతాడు
సూరో న యస్య దృశతిరరేపా భీమా యదేతిశుచతస్తఆ ధీః
హేషస్వతః శురుధో నాయమక్తోః కుత్రా చిద్రణ్వో వసతిర్వేనేజాః
భావం:ఎవని జ్ఞానం సూర్యునివలె నిర్దోషమూ, సునిశితమూ అవుతున్నదో ఎవనికి పవిత్రమైన జ్ఞానం లభిస్తున్నదో అట్టి జ్ఞాన బల సంపన్నునకు భీకరంగా జంతు గర్జనలతో ప్రతిధ్వనించే రాత్రి సమయంలోని అరణ్యప్రదేశం కూడా రమణీయమై వెలిగిపోతుంది.

02/19/2019 - 20:01

అలా కీర్తిప్రతిష్ఠలకు గాక యజ్ఞం కోసమే యజ్ఞం చేసే, శాంత పద్ధతుల ద్వారా ప్రశాంతిని పొందే, సర్వశ్రేష్టుడైన జ్ఞానికి దానం చేసే వానికి లోకంలో కీర్తిప్రతిష్ఠలకు దారిద్య్రముండదు. అతడిని పాపం మరియు అహంకారాలంటవు.
వివరణ: ఈ మంత్రంలో పాపనాశనోపాయాలు కొన్ని వివరించబడ్డాయి.

02/18/2019 - 18:20

దేవతలే దానిని పానయోగ్యులై యున్నారని స్పష్టపడుతూంది. విశేషమేమంటే సోమరసాన్ని దేవతలే సిద్ధపరచినా వారు దానిని శ్రద్ధగా దంచి పిండి రసం తీసినప్పుడు మాత్రమే దానివలన శక్తి, పవిత్రత సిద్ధిస్తాయని అట్లు కాని రసం నిష్ప్రయోజనమని ‘న సోమ ఇంద్రమనసుతో మమాద’ ‘బాగా సిద్ధం చేయబడిన సోమరసం ఇంద్రుడికి ఆనందం కలిగించలేదు’’అని ఋగ్వేద మంత్రం స్పష్టపరచింది.

02/17/2019 - 22:00

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
వివరణ:- సోమరస పానం మిక్కిలి ఆనందప్రదమైనదని వేదాలు పలుచోట్ల అభివర్ణించాయి. ఆనందనాయిని అయిన సోమరసాన్ని స్తుతిస్తూ ఋగ్వేదం-

02/14/2019 - 19:36

ఆ విధంగా ఆ పరమాత్మ గురువులకే గురువు= పరమగురువు. రాజు శాసనం కేవలం శరీరంవరకు మాత్రమే పరిమితం. కాని గురువు శాసనం మాత్రం హృదయం. బుద్ధి ఇలా అన్నింటికీ పర్యాప్తమై ఉంటుంది. పరమ గురురూపమైన పరమాత్మ మహత్త్వానికిగల అనేక కారణాలలో ఇది ఒకటి. ఈ సమష్టి అర్థాన్నంత గర్భీకరింపచేసి వేదం-

02/11/2019 - 22:30

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512212
*

02/06/2019 - 20:03

దీని తరువాత మరో ముఖ్యమైన అంశం ‘వర్మ’ కవచాలు. వీనిని ‘సీ వ్యధ్వం బహులా పృథూని’ అనేకమైనవి నిర్మాణం చేయి అన్న మంత్రాదేశం. కవచమంటే కేవలం శరీరాన్ని రక్షించుకొనేందుకు యోధులు ధరించే లోహవస్తమ్రే కాదు. అది సమస్త యుద్ధసాధనాలకు చెప్పబడిన సంకేతం. ఆ అన్నింటిలో ఆ కవచం కూడ ఒకటి. వేదం సంకేతించిన యుద్ధసాధనాలు రెండు విధాలు.

02/05/2019 - 19:42

గుఱ్ఱాలను సంతోషంగా ఉంచి యుద్ధ విజేతవు కమ్ము
ప్రీణీతాశ్వాన్హితం జయాథ స్వస్తివాహం రథమిత్కృణుధ్వమ్‌
ద్రోణాహావమవతమశ్మచక్రమంసత్రకోశం సించతా నృపాణమ్‌॥

Pages