S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/21/2018 - 20:38

మహిళలు ఒక్కరుగా కాక నలుగురితో కలసి టీంవర్క్‌లోకూడా ముందజ వేయాలంటే అందులోను నేటి స్పీడ్ యుగంలో ముందుకువెళ్లాలంటే వారిని వారు బాగా తెలుసుకోవాలి. స్వీయ విశే్లషణ ద్వారా తమ లోపాలను గుర్తించాలి. వాటిని అధిగమించేందుకు కృషి చేయాలి. లోతుగా అధ్యయనం చేయగలగాలి. వారిని వారు తెలుసుకొంటే ప్రపంచానే్న జయంచవచ్చు. నిన్ను నీవు తెలుసుకో అని మహర్షులు కూడా చెబుతుంటారు.

08/21/2018 - 20:39

కొత్తవాళ్లతో సర్దుకోవడం కాస్త ఇబ్బందికరమే. అందులోనూ కొత్త పెళ్లికూతురు అత్తవారింట్లోకి అడుగుపెడితే అక్కడి పరిస్థితులు, వాతావరణం తో సర్దుకుపోవడం మొదట్లో కష్టంగా అనిపిస్తుంది. కానీ మనసుంటే మార్గముంటుంది. మనుష్యులపై ప్రేమను పెంచుకుంటూ వెళ్లితే అందరూ మనకు కావాల్సిన వారే అవుతారు. పెద్ద పెద్ద కోరికలతో అడుగుపెట్టి అక్కడ అసలు కోరికలు తీరే అవకాశం లేకపోతే నిరాశ ఎదురవుతుంది.

08/20/2018 - 22:35

ఆరోగ్యకరమైన పోటీ మంచిదే. దాన్ని ఎవరూ కాదనరు. అసలు స్పర్థ నాణ్యమైన సరుకును ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తుంది. సరుకే కాదు పనిలోను అంతే. ఎదుటివారికి ఎక్కువ వచ్చేస్తోంది అన్న అసూయా ద్వేషాలతో కాకుండా వారి దగ్గర ఉన్న పనిలోని మెళుకువలను ప్రోత్సహిస్తూ మనకు రానివేమన్నా ఉంటే నేర్చుకుంటూ పనిని సాగిస్తే మంచిదే. ప్రతి మంచి పనికి పోటీ అవసరమే.పోటీ వల్ల అనుకొన్నదానికన్నా మెరుగైన ఫలితాలు వస్తాయి.

08/20/2018 - 07:15

మహిళలు నేడు అడుగు పెట్టని రంగం లేదు. షేర్ మార్కెటు పట్ల మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు కానీ డబ్బు పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు. కేవలం ఇందులో ముందుకు రావాలంటే కొన్ని మెళుకువలు నేర్చుకుంటే చాలు ఇక్కడ లాభాపేక్ష తప్పనిసరిగా ఉండాలి. నష్టపోతామని అనుకొంటే వెంటనే ఆ సంస్థనుంచి పెట్టుబడులు వెనక్కు తెచ్చుకోవాలి. లేదంటే అసలు వాటి జోలికి పోకూడదు.

08/20/2018 - 07:02

ఒకరి దూషణలు.. నిర్లక్ష్యాలు
నొసటి చిట్లింపులు.. హేళనలు
సుత్తిపోట్లు ..
ఉలి గాట్లు లాంటివి
హృదయాన్ని తూట్లు పొడుస్తాయి
అందుకే గుండెని రాయి చేసుకో!
అందమైన శిల్పం గా మారుతావు
గుడిలో విగ్రహంగా వెలుస్తావు
లేదా
అలమరాలో షోపీసు గా మెరుస్తావు

08/17/2018 - 19:45

చాలామంది మాకు చాలా చాలా పనులు చేయాలని ఉంది కానీ టైమ్ అసలు లేదు అంటుంటారు. కోటి రూపాయలు సంపాదించేవారికి, అర్థరూపాయి సంపాదించేవాడికి రోజుకు 24 గంటలే ఉంటాయి. దీనికి మించి ఎవరికి ఏ సమయం ఉండదు. ఎందుకు కొందరు టైము ఉందని, కొందరు లేదని అంటారు అంటేవారికి ఏ టైములో ఏది చేయాలో తెలియకపోవడమే. నిద్ర లేచింది మొదలుకొని అలసటగా, అలసత్వంతో ఉంటే ఏ పనీ చేయలేరు. అనుకొన్న పనులు అసలే పూర్తిచేయలేరు.

08/16/2018 - 20:20

ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్‌మెంట్స్ చిన్న చిన్న గదులు.. సామాన్లు గది అంతా పరుచుకున్నట్టు ఉంటూ అసలే చిన్న గదిని మరింత ఇరుకుగా ఉన్నట్టు చేస్తుంటాయి. అట్లాకాక చిన్న గదులే పెద్దవిగా కనిపించాలన్నా లేదా విశాలంగా ఉన్నట్టు అనిపించాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించాలి. ముందుగా గది గోడలకు వేసే రంగుల పైన దృష్టిని నిలపాలి.

08/15/2018 - 23:55

మొక్కలు పెంచుకోవడం అందరికీ ఇష్టమే. ఆ ఇష్టాన్ని వ్యక్తం చేయాలంటే మంచి జాగా ఉండాలి. మట్టి, ఎరువులు అన్నీ ఉండాలి, కనీసం పెద్ద పెద్ద కుండీలన్నా ఉండాలి అనుకొంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే గార్డన్ మీ ఇంట్లోనే చక్కగా ఆరేంజ్ చేసుకోవచ్చు.

08/14/2018 - 21:48

కాషాయం, తెలుపూ
ఆకుపచ్చ కలుపు
పతాకమై పైకెగసిన ప్రతీకలో
ప్రతిసారీ చూడాలొక గెలుపు
త్యాగాల రాగాలతో మార్మ్రోగిన ధరణి
సాహసాల సహవాసం
చెలరేగిన అవని
పోరాటపు ఉగ్గుపాలు
పొంగించిన పౌరుషం
ప్రాణాలే పణంగా
కొనసాగిన ఉద్యమం
ఒక వీరుడి తల..
చిరునవ్వులు రువ్వుతూ
ఉరికొయ్యకు ఊగిందట ఉయ్యాల
ఒక యోధుడి ఎద..
ఎదిరించే నినాదమై

08/14/2018 - 21:48

అప్పుడందరివీ చీకటి బతుకులే
సూర్యోదయమవుతున్నా..
బిక్కుబిక్కుమంటూ
కాలం గడుపుతున్న రోజుల్లో..
అందరి గుండెలకీ
ఆత్మస్థైర్యాన్ని నింపిన
యుగపురుషుల కాలమది!

పూరిగుడిసెల్లో
చీకటి పారద్రోలి చైతన్యం నింపే
కాగడాల వెలుతురుకి
నడకలొచ్చిన సమయమది!

Pages