S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/13/2018 - 21:59

కొంతమంది ఏ పని చేయాలన్నా కొంత నిరాసక్తంగా ఉంటారు. ఏదో నిరుత్సాహం కనిపిస్తూ ఉంటుంది. ఏంటో ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటుంటారు.
అబ్బా ఇప్పుడు చేయాలా అంటారు. ఇంట్లో ఉన్నవాళ్లు కాక మరో ఇద్దరు భోజనాలకు వస్తున్నారు అంటే ఎంతో బాధపడిపోతారు. అమ్మో ఇద్దరికి వంట చేయాలా అని ఎక్కడాలేని బాధ వ్యక్తం చేస్తుంటారు.

08/13/2018 - 21:51

వర్షం కురిసిన ఆ కాళరాత్రి
ముళ్లకంపల పొదల మాటున నిన్ను విసిరి
పారేసి చేతులు దులుపుకుని పోయి రెవ్వరో!
ఆ హృదయం ఎంత పాషాణ సదృశ్యమో!
ముద్దుల మూటగట్టుమోము
పసిమొగ్గవు నీవు!
ఓ పసిపాప ఒకవేళ నీవీ విశ్వంలో
జీవించియున్న నీ భవిష్యత్తు ఎంత ఉజ్వలమై
ఉండెడిదో కదా అట్టి నీ జీవితాన్నివారి
స్వార్థం కోసమో లేక దరిద్రం కోసమో మరి

08/12/2018 - 23:02

ఆలోచనల
రెక్కల తొడుక్కుని
మధుర భావ పక్షులు
అంతరంగమనే ఆకాశంలో
విహరిస్తూ
నన్ను కవ్విస్తుంటే
ఊహాలోకాల్లోకి జారిపోయా!
ఇంకేముంది
హృదయపు పూదోటలో
విచ్చుకున్న సృజన కుసుమాలు
రంగవల్లులను తలపించేలా..
హరివిల్లును మరిపించేలా
భావుకతా వర్ణాలను
ఒంటికి అద్దుకుని
అందాలను ఆరబోస్తూ
అలరింప
పదబంధాలతో

08/12/2018 - 23:01

ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేసిన స్టైల్ - పలాజో. నడుము దగ్గర నుంచి పొడవుతో పాటు వెడల్పు కూడా పెరుగుతూ పాదాల వరకు ఉండే పలాజో ప్యాంట్ స్టైల్ కొత్త హంగులతో మళ్లీ ఇపుడు తెరమీదకి వచ్చేసింది. సంప్రదాయ శ్రేణిగా భావించే ధోతీకి ఇపుడు మళ్లీ ఆదరణ లభిస్తోంది. దీనికి జతగా పొట్టి టాప్, కుర్తీలను ఎంచుకోవడం మామూలే.

08/10/2018 - 21:19

ఉద్యోగినులు అయిన మహిళలు అటు ఉద్యోగం, ఇటు ఇంట్లో పని చేయలేక సతమతమవుతుంటారు. అటువంటివారు స్వయం ఉపాధి మార్గంలోకి వెళ్లుతున్నారు. మనకిష్టమొచ్చిన టైములో పనిచేయవచ్చు. మనం చేసిన పనికి తగ్గ ఫలితాన్ని పొందవచ్చు అనుకొంటూ ఈ స్వయం ఉపాధిమార్గంలో వస్తున్నారు. ఇందులో కూడా కొత్త పొంతలు తొక్కుతూ తాము మాత్రమే ఉపాధి ఆదాయాన్ని పొందే వీలు నుంచి నలుగురికి ఉపాధి కలిగించ గలిగే స్థాయికి మారుతున్నవారూ ఉన్నారు.

08/09/2018 - 21:14

నేటికాలంలో వారాంతపు సెలవురోజులను ఎక్కడికైనా వెళ్లి గడిపే ఆలోచన్లు పిల్లలే కాదు పెద్దలూ చేస్తున్నారు. వారంతం రెండు రోజులు బయటకు వెళ్లాలంటే కొంతమంది ఏమేమి తీసుకెళ్లాలో అని చిరాకు పడుతుంటారు. చిరాకు పరాకులు లేకుండా హుషారుగా వారాంతపు సెలవుదినాలను హాయిగా గడపాలంటే కొన్నిచిట్కాలు పాటిస్తే చాలు. ముందుగా ఎక్కడివెళ్తున్నామన్నది డిసైడ్ చేసుకొన్నాక దాన్నిబట్టి ఏ డ్రస్సులు వేసుకోవాలో నిర్ణయించుకోవాలి.

08/09/2018 - 21:10

సృష్టికి మూలం అమ్మ!
సృష్టికి తొలి పలుకు అమ్మ!
ప్రేమకు ప్రతిరూపం అమ్మ!
అభిమానానికి మారుపేరు అమ్మ!
మానవత్వపు చిహ్నం అమ్మ!
నా జన్మకు తీపిగుర్తు అమ్మ!
దైవానికి సాటి మా అమ్మ!
నా ప్రాణానికి ఊపిరి మా అమ్మ!
శ్వాస నిశ్వాసల తోడు అమ్మ!
నా జీవితానికి పరమార్థం అమ్మ!
నా తొలి అడుగు అమ్మ!
నా కంటి తొలి చూపు అమ్మ!

08/08/2018 - 19:49

అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరే ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. అసలు టైమ్ లేదండీ తినడానికి పడుకోవడానికి అంటారు. మరికొందరు పని ఒత్తిడితో సతమతమై పోతున్నాం. ఇల్లు వాకిలి పట్టించుకోలేకపోతున్నాం అంటున్నారు. ఇట్లా ఇబ్బందులు పడేవాళ్లల్లో స్ర్తిలు ఎక్కువగా ఉన్నారు. అటువంటివారు కొన్ని నియమాలు పాటిస్తే అటు ఇంటిని ఇటు ఆఫీసును చక్కగా నిర్వర్తించగలగుతారు.

08/07/2018 - 19:03

ఎనె్నన్ని ఫేస్ క్రీములు, ఫేస్ వాష్‌లున్నా సరే ముఖ నిగారింపు యత్నం సాగుతూనే ఉంటుంది. పైగా ఈమధ్య వాయు, జల కాలుష్యాలు ఎక్కువ అయిపోయాయి. దానితో బయటకు వెళ్లి వచ్చేసరికి ముఖం అంతా నల్లని ధూళి దానివల్ల చిన్న కురుపులు, తలలో చుండ్రు, మెడ, చేతులు ఎండ వల్ల కమిలిపోయి చర్మం రంగు నలుపుకు మారుతుంటుంది.

08/07/2018 - 18:57

నాగరికత ఎంతగా మారినా!
నాగలి లేనిదే బతుకు గడవదు
రైతు లేనిదే పూట గడవదు
కోట్లాది ప్రజల ఆకలి బాధలు తీరాలంటే
వ్యవసాయ రంగం పచ్చగా ఉండాలి
దిగుబడులు పెరగాలి
అదే ఏరువాకకు తొలి సాధనం
- కృషి పున్నమి హలన్నమి
జ్యేష్ఠ నక్షత్రం రక్త వర్ణంతో
మూడు నక్షత్రాలతో నాగలి ఆకారం
ఏరువాక
- బ్రాహ్మణులకు మంత్రజపమే యజ్ఞం

Pages