S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/23/2018 - 19:31

కాలేయంలో ఎక్కువగా నిలువ ఉన్న కొవ్వు ద్వారా కాలేయానికిగానీ, శరీరానికిగానీ 80శాతం మందిలో ఎలాంటి ప్రమాదం ఉండదు. మిగిలిన 20శాతం మందిలో ఫ్యాట్ లివర్ వ్యాధికి కారణమవుతోంది. ఈ వ్యాధి రెండో దశకు చేరుకోవచ్చు. అది నాన్ అల్కహాలిక్ స్టాటో హైపటెటిస్ (ఎన్‌ఎఎస్‌హెచ్) దశలో దీనిని గుర్తించినట్లయితే, ఇది మూడో దశకు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది.

01/20/2018 - 19:45

డెబ్బయ ఎనిమిదేళ్ల ఏళ్ల ఉషా సోమన్ గురించి తెలియని వారుండరు. భారతదేశ ఐరన్‌మ్యాన్, మోడల్, నటుడు మిలింద్ సోమన్ తల్లి. కొడుకును పరుగుల రాకెట్‌గా తీర్చిదిద్దిన ఏడుపదులు దాటిన ఈ తల్లి ఈనాటికీ ఫిట్‌నెస్‌కు పర్యాయపదంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఓ మారథాన్‌లో కుమారుడితో పాటు పాల్గొని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. లక్షల్లో లైక్ చేశారంటే ఈ బామ్మకున్న క్రేజీ అంతా ఇంతా కాదు.

01/19/2018 - 20:23

ఇల్లు కళకళలాడుతోందంటే
పచ్చని ఆ పాదాలు
తిరుగటంవల్లే!

వంటల్లో కమ్మదనం ఊరిస్తే
గాజుల చేతుల్లో
అమ్మదనంవల్లే!

మోవిపై చిరునవ్వులు పూసాయంటే
కాటుక కళ్ళలో
వెనె్నల వల్లే!

ఆహ్లాదం ఎదనల్లుకుందంటే
గృహలక్ష్మి మనసు
పైరగాలై పలకరించటంవల్లే!

01/18/2018 - 23:38

‘కౌన్సిలింగ్’- ఆధునిక కాలంలో ఈ మాట విననివారు ఉండరు. కానె్వంట్ సీటు దగ్గర నుంచి ఆసుపత్రిలోని రోగుల వరకూ అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించటం పరిపాటైంది. విలాసవంతమైన జీవితాన్ని గడపటమే సంతోషానికి ఆనవాళ్లు అన్నట్లు ఎగిసిపడుతున్న ఈ కాలంలో పసిప్రాయం నుంచే స్వయం నియంత్రణ అలవర్చుకునేలా నేర్పించటం ఎంతో అవసరం. ఆకర్షణల మయమైన ఈ సమాజంలో ఉద్వేగాలు, ఉద్రేకాలు విశ్వరూపం దాలుస్తాయి.

01/18/2018 - 23:35

ఆకాశంలో ఎగిరే పక్షులు, సూర్యకాంతిలో తిరిగే తేనెటీగలూ, పచ్చని కొండపైన పూచే పువ్వుల అంతుచిక్కని మర్మాల గురించి పిల్లలు ఆలోచించేలా ప్రశాంత సమయాన్ని ఇవ్వండి. ప్రశాంతమైన నవ్వులోని రహస్యాన్ని నేర్పితే అసూయ నుంచి దూరం అవుతారు. ప్రేమగా చూడండి. కానీ ముద్దు చేయవద్దు. ఎందుకంటే వేడి కొలిమి మాత్రమే చక్కటి ఉక్కును తయారు చేయగలదు.

01/17/2018 - 21:21

సామెత మార్చేయ్యాలి- ఇల్లు కొత్త అయితే ఎలుకలు కొత్తా అని కాదు- ఎటిఎం కొత్తదైతేనేమ్? ఎలుకలకీ కొత్త కాదు. ఖజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో ఒక ఎటిఎం కౌంటర్‌లో కరెన్సీ నింపడానికి వెళ్లిన సిబ్బంది- పరీక్ష చేద్దామని కార్డు పెట్టి చూశారు. షాక్ తిన్నారు. కరెన్సీ నోట్ల బదులు నోట్ల ముక్కలు వచ్చాయి. తెరచి చూశారు. ఒక మూషిక రాజము తాపీగా కరెన్సీ నోట్లను ఆరగిస్తూ కనపడ్డది. గుండె ఝల్లుమంది..

01/17/2018 - 21:19

శరీరంలో పేరుకుపోతున్న చెడు కొవ్వును నివారించుకోవాలంటే ఆవు నెయ్యి వాడటం ఉత్తమమైన మార్గం అని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఆవు నెయ్యి కేవలం మన పూజకు, దీపాలకు మాత్రమే ఉపయోగిస్తుంటాం. కాని గేదె నెయ్యి కన్నా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆవు నెయ్యి అలవాటు చేయమని సలహా ఇస్తున్నారు. జలుబు, దగ్గు దరిచేరనీయకుండా కాపాడుతుంది. అంతేకాదు శరీరం మృదువుగా ఉండాలంటే కూడా ఆవు నెయ్యి తినమని చెబుతున్నారు.

01/16/2018 - 21:44

పూర్ణిమకు కొరాపుట్ ఎప్పుడొస్తుందాని వుంది. ఆమె కొరాపుట్ మీదుగా వెళ్లే హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నది. రైలు మామూలు వేగంతోనే వెళ్తున్నా, ఎందుకో నెమ్మదిగా వెళ్తున్నట్టుగా తోచిందామెకి. ప్రశాంత్ ఆమెకు రాయగడ స్టేషన్ రాగానే మేలుకో, అక్కడ నుంచి, బయట ప్రకృతి దృశ్యాలు బాగుంటాయి, నువ్వు తప్పక చూడాలి అని చెప్పాడు. దారి కొండలూ, అడవులతో వుంది రెండువైపులా, ఆకాశ పర్యంతం.

01/13/2018 - 19:00

శీతాకాలం చలి పిల్లగా మారి
భోగిమంటల వెచ్చదనంలో
సిగ్గుమొగ్గలేస్తూ కళ్ళు తెరుస్తున్నది
భానుడి కిరణాలు పొగల్లోంచి పొంచి చూసి
మెల్లగా దూసుకొస్తున్నాయి
సంక్రమణ వేళ క్రాంతి కాంత
మబ్బులోంచి మొగ్గలేస్తున్నది

01/11/2018 - 20:22

సమస్త మానవాళి నుద్దేశించి స్వామి వివేకానంద బోధించిన మాట. రాజసంతో, నిర్భయత్వంతో ఉట్టిపడే ఈ మృగరాజు గుణాలు అంటే స్వామి వివేకానందకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఇలా అంటారు.. ‘నేను ప్రతిరోజూ ధ్యానం చేసేటపుడు సింహాన్ని హృదయంలో తలచుకుని ధ్యానం చేస్తాను’. అడవికి రారాజైన ఈ మృగరాజులో దాగివున్న సహజ గుణం ఏమిటో తెలుసా? అది ఎపుడూ వర్తమానంలోనే జీవిస్తుంది. ఆకలి వేసినపుడే అలుపెరుగకుండా వేటాడుతుంది.

Pages