S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

12/24/2015 - 08:11

మరణం తనకు రాకుండా ఉంటే బాగుండునని చాలామంది మరణ స్పృహ కలిగినప్పుడల్లా భయపడుతుంటాడు. మరణం తథ్యమనీ,, అనివార్యమని తెలిసి కూడా అతి విచిత్రంగా అది తెలియనట్టే మానవుడు ప్రయత్నిస్తుంటాడు. అయితే తర్క దృష్టి, సత్య శోధన స్వభావం కలవారు మాత్రం తమ జన్మ రహస్యం, జీవన రహస్యం మరియు మృత్యు రహస్యం గురించి ఆత్మవిమర్శ చేసుకుంటాడు.

12/22/2015 - 04:55

ఈ జగత్తును ఎవరు సృష్టించారు? ఈ జగత్తులో జరుగుతున్న సంఘటనలకు కారణం ఎవరు? ప్రతి జీవికి పుట్టుకకు ముందూ మరణం తరువాత మనుగడ ఎక్కడ? ఇలాంటి సందేహాలకు వెనువెంటనే సమాధానాలు దొరకనంత మాత్రాన కర్మ సాక్షి అయిన భగవంతుడనేవాడు లేడనీ అంతా యాదృచ్ఛికమనీ, కనిపించేదంతా మిథ్య అని అనుకోరారు.

12/21/2015 - 03:57

శ్రీకృష్ణుడు వెన్నంటి ఉన్న యుద్ధరంగంలో అర్జునుడంతటి ధీరుడికే మనోదౌర్భల్యం ఆవరించిందంటే ఇక లౌకిక జీవనంలో నిత్యం ఒత్తిళ్ళతో సతమతమయ్యే సామాన్యుల సంగతి చెప్పనక్కరలేదు. ఆపై కృష్ణుడు ప్రవచించిన ధర్మోపదేశమే అర్జునుణ్ణి కార్మోన్ముఖుణ్ణి చేసింది. అదే భగవద్గీతగా నేటికీ నిత్య నూతన జ్ఞాన కాంతుల్ని విరజిమ్ముతోంది. గీతతో జీవనగీతలను మార్చుకోవచ్చని అనేకమంది మహాపురుషులు నిరూపించి చూపారు.

12/20/2015 - 03:57

ధనుసంక్రమణంలో వచ్చిన తొలి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా చెబుతారు. ఆనాడు వైష్ణవాలయాలు సందడిగా ఉంటాయి. భగవంతుని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే మోక్షదాయకమని భక్తుల విశ్వాసం. ముక్కోటి దేవతలు కూడా భగవంతుని ఉత్తర ద్వారం నుండి దర్శిస్తారని, అందుకే ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతున్నదని అంటారు. మరొక విశేషమేమంటే మార్గశిర శుక్ల ఏకాదశిని ‘గీతా జయంతి’గా పరిగణిస్తారు.

12/18/2015 - 22:53

‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’- శ్రద్ధావంతుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ‘శ్రద్ధ’ అంటే ఆస్తికబుద్ధి అన్నాడు శంకరాచార్యులవారు. భగవద్గీతలో శ్రద్ధ అనే పదానికి మూడు అర్థాలు చెప్పబడుతున్నాయి. అవి విశ్వాసం, నమ్మకం, గౌరవం. ఈ మూడు ఒక్కటై ఎవని మనసులో ఉండునో అతడే శ్రద్ధావంతుడు. జ్ఞానాన్ని సంపాదించాలన్న జిజ్ఞాస గలవానిని కూడా శ్రద్ధాళువు అనవచ్చు.

12/17/2015 - 04:37

మార్గశిర శుద్ధ షష్ఠీ సుబ్రహ్మణ్యారాధనకు ప్రత్యేకమైంది. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణే కుమార స్వామి, స్కంధుడని, షణ్ముఖుడని, దండాయు ధుడని, అగ్నిసంభవుడని ఇలా అనేకానేక పేర్లతో పిలుస్తాం. పరమాత్మ ఒక్కడే అయనా ఎవరికి తోచిన విధంగా వారు పిలిస్తే పలికే అయన పరమాత్మ ఒక్కడే అయనా అనేకాలుగా మారి కోరుకున్నవారి ఇష్టానుసారంగా కనబ డుతుంటాడు. వాల్మీకి రచించిన రామాయణంలో సుబ్రహ్మణ్యుని జననం గురించి కథఉంది.

12/16/2015 - 04:03

అమృతం సాధించడం కోసం క్షీరసాగర మథనం జరిగిన తరువాత మోసపోయిన దానవులు దేవతలతో యుద్ధం చేసి ఓడిపోయారు. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి ఆ యుద్ధంలో పరాజయం పాలయ్యాడు. అనంతరం తమ కులగురువైన శుక్రాచార్యులను ఆశ్రయించాడు. అతని సేవలకు మెచ్చి అతన్ని అనుగ్రహింపదలచిన భార్గవుడు శిష్యుడైన బలిచేత విశ్వజిద్యాగం చేయించాడు. తత్ఫలితంగా యజ్ఞం పూర్తికాగానే అగ్నిదేవుడు అతనికి ఒక దివ్యరథం ఇచ్చాడు.

12/15/2015 - 02:04

మానవుని మనుగడకు మన మహాత్ములు కొన్ని సామాన్య ధర్మములు బోధించారు. అవి కచ్చితంగా మనం పాటించవల్సిందే. అవి అహింస, సత్యం, అశౌచం, అస్థేయం, ఇంద్రియ నిగ్రహం.

12/14/2015 - 04:49

భక్తి తొమ్మిది విధాలని భాగవతం చెబుతున్నది. భక్తిలోనిది మొదట శ్రవణం, సంకీర్తనం. రామనామం నిత్య పారాయణం చేసుకునేవానికి సాధు సత్సంగాలు దర్శించుకునేవారికి రామదర్శనం, రామనుగ్రహం కల్గుతుందని రామాయణంలోని సుందరాకాండ తెల్పుతున్నది. పాప పుణ్యాలు మనసులోనికి రాకుండా మనసును దైవమునందే నిల్పిన వానికి రామ మహిమ తెలుస్తుంది.

12/12/2015 - 21:08

మన దేశంలో పండుగలకున్న ప్రాశస్త్యం మరే దేశంలోను, ప్రాంతంలోను లేదని చెప్పాలి. ఎన్నో ఆచార వ్యవహారాలతో కూడిన సంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని పండుగల రూపంలో గుదిగుచ్చిన పుణ్యభూమి భారతదేశం.

Pages