S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

01/18/2016 - 08:34

భగవంతుని దర్శించడానికి యుగయుగాలుగా మానవుడు తపన పడుతూనే వున్నాడు. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగము మరియు ద్వాపర యుగములలో యజ్ఞయాగాదులతోను ఆ పరాత్పరుని ప్రత్యక్షం చేసుకొన్నారు. యుగయుగాలకు భావనలో మార్పు వచ్చింది కాని భక్తి మాత్రం ఒక్కటే! ఈ చరాచర సృష్టికి మూలమైన పరమాత్మను శ్లాఘిస్తూ కల్పన చేసే మనోభావాలనే భక్తి అంటారు. ఇది కలియుగం.

01/17/2016 - 22:09

ఈ అనంత కోటి సృష్టికి మూలం భగవంతుడు. మనము ఆ భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని పంచభూతాలను వరంగా ప్రసాదించాడు. వాటిని మనం సక్రమంగా వినియోగించుకొంటే జీవితం ఆనందమయం అవుతుంది భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి సైతం భగవంతుని యందు భక్తి, ప్రకృతి అందు సంరక్షణ కలిగియుండాలి.

01/14/2016 - 00:11

హరిలో రంగ హరి అంటూ వచ్చే హరిదాసులు, జంగందేవరలు, సన్నాయ మేళంవారు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల వారు, పగటివేషగాండ్లు, తోలు బొమ్మలాటవారు, వీధిభాగోతం వారు, ఏకాపాత్రాభినయం అభినయంచేవారు ఇలా ఎన్నో సంప్రదాయ కళలను ఆవిష్కరించే రంగస్థలమే, కళావేదికనే పెద్దపండుగ. లోకులందరికీ అన్నం పెట్టే రైతన్న మహాదానందంతో తాను కష్టించి పండిన పంటను ఇంటికి తీసుకొచ్చే పండుగ సంక్రాంతి.

01/13/2016 - 05:29

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పెద్ద పండుగ ఆబాల గోపాలాన్ని అలరిస్తుందనడం అతిశయోక్తి కాదు. మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించినపుడు వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకుంటారు.

01/12/2016 - 04:27

కాలచక్రం పగలు రేయిల సమాహారం. జీవిత చక్రం కష్టసుఖాలు, జయాపజయాలు, కలిమిలేముల కలయిక. కష్టాలు, అపజయాలు జీవిత చక్రాన్ని ఎలా నడపాలో చెబుతాయి. జయం జీవన సాఫల్యం, జీవితంలో మరువరాని ఘటన. జయమే జీవితం కాదు. అది జీవితంలో ఒక భాగం మాత్రమే! జయం ఎప్పటికీ జీవిత గమ్యం కాదు. అది అలుపు సొలుపులెరుగని నిరంతర ప్రయాణం. థామస్ ఆల్వా ఎడిసన్ సెలవిచ్చినట్టు ‘‘విజయానికి కావాల్సింది పది శాతం ప్రేరణ, తొంభై శాతం కఠోర శ్రమ’’.

01/11/2016 - 08:21

జయం కలిగితే పొంగిపోవడం, అపజయం కలిగితే బాధతో కుంగిపోవడం సాధారణ మానవులకు సహజం. కొందరు ‘నా జాతకం బాగా లేదు. ఏది చేసినా కలసిరావడం లేదు’ అంటూ కనిపించని విధిమీద తోసేసి వాపోతుంటారు.

01/10/2016 - 00:20

పూర్వం శిబి అనే చక్రవర్తి భూలోకాన్ని ఏలే రోజుల్లో ఒక రోజు సింహాసనా రూఢుడై ఉండగా ఒక పావురం అతని ఒళ్ళో వాలింది. అది మనుష్య భాషలో ‘‘రాజా ఒక డేగ నన్ను వెంట తరుముతోంది. శరణార్థినై ఏతెంచాను. నీ మంచితనం గూర్చి ఎరుగుదును. నన్ను రక్షించు’’ అంది. శిబి పురోహితుడు శరణాగతులను రక్షించడమే రాజు కర్తవ్యం అని హితబోధ చేశారు. అపుడా రాజు పావురాన్ని నిమురుతూ నీకు భయం వలదు. నిన్ను రక్షిస్తాను అన్నాడు.

01/09/2016 - 02:08

సనాతన భారతీయ ధర్మం ‘మాతృదేవోభవ, పితృదేవోభవ. ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ’’ అని బోధిస్తుంది. ముందుగా తల్లిదండ్రులు తర్వాత గురువు. నాల్గవ పూజ్యనీయ స్థానం అతిథిదే. ‘అభ్యాగతిః స్వయం విష్ణు’ అని ఆర్యోక్తి.

01/06/2016 - 23:25

గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలు మానవుని, మనస్సును తనువును ప్రభావితం చేసి శాంతి, ఆనందం వ్యాప్తిచెంది, మంత్రోచ్చారణ వల్ల మనస్సు ఏకాగ్రత నొంది శరీరం స్థిరత్వాన్ని పొంది, ఇంద్రియాల శాంతపడి మనస్సు ఏకాగ్రత మవుతుంది. గాయత్రీ మంత్ర ఉపాసన వల్ల ఆత్మ బలం హెచ్చి సత్వగుణము దైవీ సంపద వృద్ధిచెంది మంత్ర జపసాధన వల్ల మానవుడిలో దాగివున్న దివ్య శక్తులన్నీ జాగృతమవుతాయి. మంత్రానికి ధ్యానం చాలా అవసరం.

01/06/2016 - 00:45

‘‘శ్రీ రాఘవం దశరధాత్మజ ............ నిశాక్షరకర వినాశకరం, నమామీ రామం’’-

Pages