S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

07/31/2016 - 00:40

కమలాక్షుడికి వాగ్దానం చేశాను. ప్రమథ గణాలను కూడా వాళ్ళు పరుగులు తీయించారు. కడసారి ప్రయత్నంగా నీవు మన సింహరథస్థుడివై వెళ్లి యుద్ధం చేసి మన బాణుణ్ణి రక్షించటానికి పూనుకో’ అని నందీశ్వరుడికి వివరించటంతో అతడిక ఎంతమాత్రం జాగు చేయకుండా తన సింహ రథంతో బాణుణ్ణి సమీపించాడు. తాను సారథి అయినాడు. మళ్లీ దనుజ వైరిపై దండెత్తటానికి సిద్ధమైనాడు బాణుడు.

07/29/2016 - 22:02

‘నీ చేతులనన్నిటినీ డుల్చి నిన్ను మోడు చేస్తాను’ అని హెచ్చరించాడు. బాణుడికి దీనితో పట్టరాని ఆగ్రహం కలిగింది. ఎడాపెడా అన్ని చేతులతోనూ వివిధ అస్త్రాలు, శస్త్రాలు కృష్ణుడిపై ప్రయోగించాడు. బాణుడు ప్రయోగించిన బాణాలతో ఆకాశం మూసుకుపోయింది. రాక్షసులంతా ఆకాశానికెత్తినంతగా ప్రశంసించారు బాణుణ్ణి. హిరణ్యకశిపుడితడి ప్రపితామహుడు. అతడి పరాక్రమం కూడా బాణుడి ముందు దిగదుడుపే అని కేరింతలుగా చెప్పుకున్నారు.

07/28/2016 - 21:05

భూమ్యాకాశాలను దద్దరిల్లజేస్తూ గణ గణ గంటలు మోగుతుండగా కళ్ళు మిరుమిట్లు గొలిపేట్లు జ్వాలాయమానంగా సకల సురాసురులు భయద చకిత వీక్షణులై ఉండగా అది హరిమీదకు వేగంగా వస్తుండగా శ్రీకృష్ణుడు ప్రతిశస్త్రాన్ని ఏమీ ప్రయోగించకుండా అశక్త్యాయుధం తనను సమీపిస్తుండగా ఒక్క హుంకారం చేశాడు యదుకులపతి. దానితో ఆ ప్రచండాస్త్రం నిస్తేజమై స్తంభించిపోయింది.

07/27/2016 - 22:58

శ్రీకృష్ణుడు కైలాసానికి వచ్చి తన అనుగ్రహం కోరి తపస్సు చేయటం, తాను ఆయనకు వరప్రదానం చేయటం, పూర్వం ద్వారావతీ నగరంలో తాను కృష్ణుడికి ప్రత్యక్షమై ఆయనకు మేలు చేయటం ఆయన మదిలో మెదిలాయి. అందువల్ల హరుడు యుద్ధ విముఖుడై నిర్లిప్తంగా ఉండిపోయినాడు. ఖండపరశుడిట్లా స్తబ్ధుడై ఉండిపోవటంతో గోవిందుడు పాంచజన్యం పూరించాడు.

07/26/2016 - 20:59

ఆ ప్రమథ గణాలు భయదసత్త్వులు, భీషణాకారులు, సింహ శార్దూల చర్మ వసనులు, త్రిశూలధారులు. భయంకర శస్త్రాస్తధ్రరులు. అనేక నేత్రులు, అనేకోదరులు, అతిరౌద్ర స్వభావులు. వీళ్ళ అండ చూసుకొని బాణాసుర సైన్యం కూడా మళ్లీ యుద్ధ రంగాన చెలరేగారు.

07/25/2016 - 00:16

అపుడు శ్రీకృష్ణుడు దానిని తలకిందులు చేసి రెండు కాళ్ళు దొరకబుచ్చుకుని గిరగిర తప్పి నేలమీద కొట్టి చంపివేయాలని అనుకొంటూ ఉండగా ఆ ఉగ్రజ్వరాధిదేవత కుయ్యో మొర్రో అని ఆక్రోశించింది. అపుడు కృష్ణ కృష్ణ! జ్వరాన్ని కడతేర్చవద్దు. కరుణించి బతకనివ్వు అని అశరీరవాణి కృష్ణుణ్ణి అర్థించింది. కృష్ణుడు కరుణించాడు.

07/23/2016 - 22:47

పెద్ద పెట్టున ఆయనపై ఉరవడించింది. ఈ ఉగ్రజ్వర మూర్తికి మూడు శీర్షాలు, మూడు మూడు కన్నులతో మొత్తం తొమ్మిది కన్నులు, మూడు కాళ్ళు, ఆరు చేతులు గల మహోగ్రమైన జ్వరాధిదేవత ప్రళయాగ్నిలాగా ఆయనను సమీపించింది. మేఘగర్జన వంటి స్వరంతో వాళ్ళను తూలనాడింది.

07/22/2016 - 21:37

అంతటితో తృప్తిపడకుండా పురద్వారం చేరి పాంచజన్యం పూరించాడు పద్మనాభుడు. అపుడు రుద్రుడి భూత పరివారమంతా, రుద్ర గణాలన్నీ, అగ్నాయుధాలు ధరించి అపారమైన సేనలను సృష్టించుకొని, బాణుడి అశేష పారావారమైన చతురంగ బలాలలకు బాసటగా యుద్ధరంగానికి విజృంభిస్తూ వచ్చాయి. బాణుడి సైన్యాలు శ్రీకృష్ణ, బలరామ, ప్రద్యుమ్నులపై ఎడతెగకుండా బాణవర్షం కురిపించాయి. బాణుడి సైన్యాలకు లయకాలాంతకుడైన శూలపాణి ప్రమథ గణాలు కూడా తోడైనాయి.

07/21/2016 - 22:51

ఇక త్రిపురారి కూడా మననేమీ చేయలేడు అని విదితమవుతున్నది మనకు అని బలరాముణ్ణీ, ప్రద్యుమ్నుణ్ణీ ఉత్సాహపరిచాడు కృష్ణుడు. గరుత్మంతుడు మరింత ఉత్తేజితుడై సూర్యుడే మినువీధినుంచి కిందికి దిగి వస్తున్నాడా? అన్నంత ఉజ్వల కాంతి పరివేషంతో ముందుకు సాగుతుండగా దృఢ సంకల్పంతో పరమ శివాజ్ఞను వర్తులైన ప్రచండాగ్నులు కొన్ని గరుడారూఢుణ్ణి నిలువరించడానికి ఎదురువచ్చాయి.

07/21/2016 - 04:11

హల, ముసల లాంఛనుడివి కూడా నీవే. ద్విధావిభక్తమైంది నీ తేజస్సు. నీ బల పరాక్రమ శౌర్యతా స్ఫూర్తి కృష్ణ బలరామ రూపం పొంది రాక్షస సంహార కీర్తి అయింది. గత యుగంలో రావణ సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తివి నీవే. బలిని నిర్జించిన త్రివిక్రముడివి కదా నీవు. భూమ్యాకాశాలు, దిశలు, కాలము, చంద్రసూర్య వాయువహ్నులు నీ స్వరూప రూపాలే కదా దేవాదిదేవా! సృష్టి స్థితిలయకారుడివి నీవే!

Pages