S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

08/21/2016 - 23:09

ఇది ఎవరి దగ్గర ఉంటుందో వారికి ఏ ఉపద్రవమూ కలగదు. ఏ భయమూ కలగదు. కృష్ణుడికీ విషయం తెలుసు. ఆయనకు ఇటువంటి అనర్ఘమణి ఉగ్రసేన మహారాజు దగ్గర ఉంటే రాజ్యానికంతా మేలు కలుగుతుంది. ధన ధాన్య సంపదలతో తరగని ఐశ్వర్యంతో ప్రజలు సుఖపడతారు అనే అభిలాష జనించి వారి దగ్గర వీరి దగ్గర ఈ ప్రస్తావన తెస్తూ వచ్చాడు.

08/20/2016 - 21:22

వీరివల్ల ఆయనకు సంతానం కలిగింది. ఈ సంతానమంతా అధిక సంఖ్యాకమైంది. శ్రీకృష్ణుడి కుమారులలో చారుదేష్ణుడు, సాంబుడు ప్రసిద్ధికి వచ్చారు.
వృష్ణి కడగొట్టు కుమారుడు అనమిత్రుడు. ఈయన కొడుకు శిని. సత్యకుడీయన పుత్రుడు. సత్యకి కుమారుడే సాత్యకి. ఈయనకు యుయుధానుడనే పేరు ప్రసిద్ధం. ఈ వంశాన్ని శైనేయులని వ్యవహరిస్తూ వచ్చింది లోకం.

08/19/2016 - 23:32

ఆహుకుడు మహాపరాక్రమవంతుడుగా ప్రసిద్ధికెక్కి విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన కాశీరాజు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి దేవకుడు, ఉగ్రసేనుడు అనే తనయులు కలిగారు. దేవకుడి పుత్రులు సుదేవుడు, ఉపదేవుడు. దేవరక్షితుడు, దీప్త్భుజుడు అనే కొడుకులు పుట్టారు. దేవకి, శాంతి అను దేవ మొదలైన తొమ్మిది మంది కూతుళ్ళు పుట్టారు. ఉగ్రసేనుడికి కంసుడు పెద్దకొడుకు. తరువాత ఇంకా ఎనిమిదిమంది కొడుకులు పుట్టారు.

08/18/2016 - 21:12

ఆమెకు రాజుపట్ల కోపం, ఆ యువతి పట్ల ఈర్ష్యాసూయలు, రాజు తనను వంచిస్తున్నాడన్న అసహనం, అవమానం ముమ్మరించాయి. ‘ఓహో! బలే విజయయాత్ర. ఇందుకే మీరు విజయం చేసినట్లున్నది కదూ’ అని ఆయనను దెప్పిపొడిచింది. అపుడు జ్యామదుడు తడబడి, భయపడి కాదు కాదు శైబ్యా! ఈ యువతిని నీ కోడలుగా చేసుకోవటానికి తెచ్చాను అని ఆమెను ప్రసన్నురాలిని చేసుకోవటానికి అనునయంగా ఆమెతో పలికాడు.

08/17/2016 - 23:05

దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మపరిపాలన దేశంలో ఈయనవల్ల ప్రవర్తించేట్లు కూడా దత్తాత్రేయుడు ఈయనకు వరమిచ్చాడు. సకల భూమండలం ఏలుకోగల శక్తినీయుకు ఇచ్చాడు. ఈయన ఏడు దీవులను తన వశంలో ఉంచుకున్నాడు. ఏడునూర్ల యజ్ఞాలు చేశాడు.

08/16/2016 - 21:27

ఈ మీ వంశంలో ఋక్షకుడు, పరీక్షిత్తు, జనమేజయుడు అనేవాళ్ళు ఇద్దరిద్దరుగా ఉన్నారు. భీమసేసనుడి పేరుతో ముగ్గురున్నారు మీ వంశంలో అని ఈపాటికే నీకు తెలిసి ఉంటుంది అని జనమేజుడికి వైశంపాయనుడు చెప్పాడు. ఇపుడు చెప్పిన భీమసేనుడికి ప్రదీప మహారాజు జన్మించాడు.

08/15/2016 - 04:27

ఈ జహ్ను మహర్షి (రాజర్షి) పుత్రుడే అజితుడు. ఇది ఎట్లా సంభవించిందంటే యువనాశ్వుడి పుత్రిక అయిన కావేరి తపస్సు చేసి అర్థశరీరంతో నదిగా ప్రవహించింది. తక్కిన అర్థశరీరంతో జహ్నుడికి భార్య అయింది. వీరికి అజితుడు జన్మించాడు. అజితుడికి బలాకాశ్వుడనే పుత్రుడు పుట్టాడు. ఈ బలకాశ్వుడి కుమారుడే కుశికుడు.

08/14/2016 - 03:51

ఈ వంశ మూల పురుషుడైన రౌద్రాశ్వుడి రెండో కొడుకు ఋచేక్షువు వంశంలో మతినారుడనే మహా కీర్తిమంతుడు జనించాడు. ఈయనకు పుట్టిన ముగ్గురు కొడుకులు వేర్వేరు వంశాలను విస్తరింపజేశారు. వీరి తోబుట్టువు దుష్యంతుడు.

08/12/2016 - 21:35

అగ్నిలో నెయ్యి కుమ్మరిస్తూ దానిని ఆర్పివేయగలమనుకోవటం వంటిదే ఇది. నెయ్యి పోసినకొద్దీ భగ్గుమని ఇంకా ఇంకా హుతాశన కీలలు ప్రజ్వలిస్తూనే వుంటాయి. అంతేకాని ఎప్పుడైనా అగ్గి ఆరిపోతుందా? అని తన కుమారులకు చెప్పి ఆయన తన పత్నితో వానప్రస్థుడైనాడు. అసదృశమైన తపస్సు చేశాడు. అప్పుడాయన సిద్ధ, సాధ్యులు, దేవతలు వినుతించారు.

08/11/2016 - 21:14

అపుడు ఆయన ప్రజలు ఆయనను పరిత్యజించారు. పౌరజానపదులు ఆయనకు రాజార్హత లేకుండా చేశారు. ఆయన అడవులలో సంచరిస్తూ శౌనకుడనే మహామునిని ఆశ్రయించాడు. ఆ మహర్షి జనమేజయుణ్ణి కనికరించి అశ్వమేథం చేయించాడు. దానితో ఆయన పాపం పరిహారమైంది. మళ్ళీ రాజ్యం స్వీకరించాడు.

Pages