S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

09/02/2016 - 21:42

ఆదికాలంలో బ్రహ్మదేవుడు జగద్ధితం కోసం మనోమయ చక్రాన్ని కల్పించాడు. కల్పించిన ఆ చక్రాన్ని లేక బండికల్లుని సత్యలోకం నుంచి దొర్లించాడు. ఆ చక్రం దొర్లుకొంటూ వచ్చి లోకాలన్నీ దాటి భూలోకంలో వాలింది. అమిత వేగంగా వచ్చి వచ్చి నేల మిట్టపల్లాలలో ఆ చక్రం ‘నేమి’ (లేక)‘కమ్మి’ లేక ‘చట్రం’ విచ్చిపోయింది. ఆ విధంగా చక్రం కమ్మి శీర్ణం అయిన తావు నైమిశం అయింది. అది పడిన ఆ ప్రదేశం కూడా నైమిశమే అయింది.

09/01/2016 - 21:20

పద్మపురాణాదులు పదునెనిమిది- అవి 1.బ్రహ్మపురాణము 2.పద్మపురాణము 3.విష్ణుపురాణము 4.శివపురాణము 5.్భగవత పురాణము 6.్భవిష్య పురాణము 7.నారద పురాణము 8.మార్కండేయ పురాణము 9.అగ్నిపురాణము 10.బ్రహ్మవైవర్త పురాణము 11.లింగపురాణము 12.వారాహ పురాణము 13.స్కాంద పురాణము 14.వామన పురాణము 15.కూర్మ పురాణము 16.మత్స్యపురాణము 17.గరుడ పురాణము 18.బ్రహ్మాండ పురాణము- వీటికే అష్టాదశ పురాణాలు అని పేరు.

08/31/2016 - 23:26

ఇవాళ అడుగుతాడు, రేపు అడుగుతాడు నీరజాక్షుడు అని ఎదురుతెన్నులు చూస్తూనే ఉన్నాను. అడగకుండా ఇస్తే నీవు అన్యధా భావించువచ్చునని నా భయం. ఇది రహస్యంగా నా దగ్గర అట్టిపెట్టుకోవటం నాకు చాలా చాలా మనఃక్లేశం కలిగించింది. ప్రభూ! ఇప్పుడడిగావు కాబట్టి తీసుకో! ఇంకా నేను దీనిని నిభాయించనే లేను అని తన పట్టు ఉత్తరీయం ముడి విప్పి ఆ శ్యమంతకమణిని కృష్ణుడికి అందజేశాడు అక్రూరుడు.

08/30/2016 - 19:51

నీ దగ్గర ఉంటేనేమి నా దగ్గర ఉంటేనేమి? నీవు నా వాడివి కదా! నా దగ్గర ఉన్నట్లే అనుకున్నాను. ఎందుకంటే నీవు సజ్జనుడివి. సాధు సత్ప్రవర్తనం కలవాడివి. అయితే ఈమధ్య ఒక సమస్య వచ్చింది నాకు. బలరాముడికి నా మీద అనుమానం. నా పట్ల అవిశ్వాసం. రత్నం నా దగ్గర లేదంటే ఆయన ఒప్పుకోక నాతో మాట్లాడటం లేదు. కాబట్టి నా మనస్సులో కొంత అశాంతి. కలత కలుగుతున్నది.

08/28/2016 - 21:10

అపుడు తల్లి కడుపులో ఉన్న ఆ నిసుగు ఆయన వింటుండగా ఇట్లా పలికింది. తండ్రీ! నే చెప్పేది విను. రోజూ నీవు మూడు సంవత్సరాలపాటు పాత్రుడైన సద్బ్రాహ్మణుడికి గోదానం చెయ్యి. అపుడు నేను జన్మిస్తాను’ అని చెప్పింది. ‘తల్లీ! నీవు చెప్పినట్లే చేస్తాను’ అని ఆమె సూచించిన అనుష్టానాన్ని విధి యుక్తంగా నిర్వహించాడు కాశీరాజు. అన్నట్లుగానే ఆమె జన్మించింది.

08/27/2016 - 21:03

బలరాముణ్ణి ప్రేమాదర గౌరవ అభిమాన పురస్సరంగా మళ్లీ ద్వారకానగరానికి తీసుకొని వెళ్లారు.

08/26/2016 - 21:43

అపుడు కృష్ణుడు బలరాముడితో ‘అన్నా! మన గుర్రాలు కూడా బాగా అలసిపోయినాయి. వాణ్ణి తరిమి పట్టుకుంటే కాని చిక్కడు. నీవు రథాన్ని నెమ్మదిగా తోలుకుంటూ రావలసింది. నేను తరుముతూ వాడి వెంట పరుగు తీస్తాను అని బలదేవుణ్ణి అంగీకరింపజేసి కృష్ణుడు శతధన్వుణ్ణి తరముకుంటూ వెళ్ళాడు. వాడు మిథిలవైపు పరుగులు తీయటం చూశాడు కృష్ణుడు. శతధన్వుడు ప్రాణభయంతో పరుగు మరింత పెద్దది చేశాడు.

08/25/2016 - 21:19

అర్థరాత్రి గాఢ నిశి వేళ సత్రాజిత్తు గాఢ నిద్రలో వుండగా ఆయన ఇంటికి వెళ్ళి సత్రాజిత్తును హత్యచేశాడు శతధన్వుడు. అతడి దివ్యమానికాన్ని, అనర్ఘమైనదీ, సూర్యప్రసాద దత్తమైనదీ అయిన ఆ శ్యమంతక మణిని దోచుకొనిపోయినాడు.

08/24/2016 - 23:36

అపుడు జాంబవంతుడు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని అర్చించుకున్నాడు. శ్రీకృష్ణుడు జాంబవంతుడి శరీరాన్ని ప్రేమతో నిమిరి ఆతడి శరీర శ్రమ అంతా తీరిపోయింది. యుద్ధశ్రాంతి అణిగిపోయింది. ప్రాయశ్చిత్త పరిహారంగా జాంబవంతుడు తన తనయ జాంబవతిని తెచ్చి శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. కృష్ణుడు కూడా జాంబవంతుణ్ణి సంతోషపెట్టటానికి ఆమెను పరిగ్రహించాడు.

08/23/2016 - 21:26

మృత శరీరంపై సింహపు దెబ్బలు కన్పించాయి. పక్కనే చచ్చిపడి ఉన్న గుర్రం కనపడింది. దాని కళ్ళెం ప్రసేనుడి చేతిలోంచి జారిపోయిన విధం స్పష్టంగా కనపడింది. గద్దలు, రాబందులు చుట్టుప్రక్కల కనపడ్డాయి. అయితే అతడి శరీరంమీద శ్యమంతక రత్నం లేదు. కొంచెం దూరంలో ఒక సింహం చచ్చిపడి ఉంది. దాని పక్కన ఒక ఎలుగుబంటి పాదముద్రలు కన్పించాయి. మరి ఈ మణి ఏమైంది? దాని జాడ తెలుసుకోకుండా తాను మళ్లీ ద్వారకకు పోతే ఏం ప్రయోజనం?

Pages