S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

08/11/2016 - 05:10

అమరావతి రాజధానిగా స్వర్లోక రాజ్యాన్ని మహా వైభవంగా పరిపాలించసాగాడు. అపుడు ఇంద్రుడు కూడా అందుకు సమ్మతించి, రజి దగ్గరకు వెళ్లి నీవు ఇంద్ర పదవిననుభవించటం నాకు ఇష్టమే. నన్ను నీ పుత్రుణ్ణిగా చూసుకో. నేనున్నూ నీ పట్ల పితృభావంతో త్రైలోక్య రాజ్య నిర్వహణలో నీ సేవ చేస్తాను అని వినయంగా చెప్పాడు. అయితే దీనికి కొద్దికాలంలోనే ఒక వ్యత్యయం సంభవించింది.

08/09/2016 - 21:35

దేవతలకెవరికీ ఇటువంటి సుగుణ సంపద, ఉదాత్త సౌందర్య గాంభీర్య గరిమ ఎవరికీ లేదని అప్సరాగ్రగణ్యయైన ఊర్వశి పురూరవుణ్ణి మోహించి వచ్చి ఆయనను వరించింది. ఆయన కూడా కాదనకుండా ఊర్వశిని ఆదరించాడు. వాళ్ళు చాలా కాలం శృంగార రసాధిదేవతలై అన్యోన్యపు వలపు భోగాలు అనుభవించారు.

08/07/2016 - 21:35

శుక్రుడు అంగిరసుడి శిష్యుడు కాబట్టి బృహస్పతికి జరిగిన అన్యాయానికి గర్హించి దేవగురువు పక్షం వహించాడు. శుక్రుడి పట్ల తన కుండే మక్కువతో పరమశివుడు బృహస్పతి పక్షంలో చేరాడు. అప్పుడాయన అజగవమనే మహా ధనుస్సు ధరించి బృహస్పతి విరోధి వర్గాన్ని చీల్చి చెండాడాడు.

08/06/2016 - 21:12

అవి శే్వత కాంతితో ప్రకాశించే ఒక ముద్దలాగా రూపొందాయి. ఇది సోమ వంశాన్ని, లోకంలో నెలకొల్పబోతున్నదని పది దిక్కు లూ ఆ ప్రోవును తాము రక్షించటానికి స్వీకరించాయి. కాని ఆ దిక్కులు ఆ శే్వత రేతస్సును భరించలేకపోయినాయి. భూమిమీద ఆ శే్వత పిండాన్ని విడిచిపెట్టాయి.

08/05/2016 - 21:06

ఇంద్రుడు కూడా సకల దేవతా గణాలతో, అప్సరసలతో కృష్ణుడు ద్వారక చేరటానికి ముందే వచ్చి ద్వారకానగరాన్ని సకల సౌందర్య విరాజితంగా అమరావతికన్నా వైభవోపేతంగా అలంకరింపజేశాడు. భవుడూ, భవానీ, స్కందుడు కూడా ద్వారకా నగరం ఉపవనాలలో ఒకదానిలో విడిది చేశారు. సప్తర్షులు, సకల మునులు, దేవతలు, వసురుద్రాదిత్యులు అందరూ ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడి ఆగమన శోభన వైభవాన్ని దర్శించి ఆనందించటానికి కుతూహలులై వచ్చారు.

08/04/2016 - 21:12

అవి మీ సొమ్ము. మీరు తీసుకొని పోవాలి అని కుంభాండుకు చెప్పగా కృష్ణుడు ఉషానిరుద్ధులను మయూరంపై అధివసింపచేసి తానూ అగ్రజుడూ, కుమారుడూ గరుడారూఢులై పశ్చిమాంభోనిధి తీర ప్రాంతానికి చేరారు. అక్కడ వాళ్ళు అసంఖ్యాకమైన బహు చిత్ర చిత్ర వర్ణితమైన గోవులు అక్కడి వనాంతరాలలో ఉండటం చూశారు వారు.

08/04/2016 - 03:56

ద్వారకానగరమంతా చిన్నబోయి ఉంది. ఇప్పుడు వధూవరుల సహితంగా మనం ద్వారవతికి వెళితే ఆ నగరం ఎంతగానో శోభిస్తుంది. ఉప్పొంగిపోతుంది అని ఆయనతో సంతోష వార్తలు ముచ్చటించుకుంటూ అంతఃపురంలో ఉన్న అనిరుద్ధుణ్ణి చూడటానికి పోతుండగా ఇంతలో చిత్రరేఖ వారికి ఎదురువచ్చి సంతోష స్వాగతం చెప్పింది.

08/02/2016 - 21:12

పుత్రవతుగా స్వీకరించాను కదా! ఇంకా వరాలు ఎందుకనుకున్నాను ఇన్నాళ్ళూ! ఇపుడు నా00నీవేదైనా వరం కోరుకో! ఇస్తాను అని అనుగ్రహంతో పలికాడు. బాణుడు లోకంలో నేనెవ్వరి వల్లా విజితుణ్ణి కాకుండా అనుగ్రహించు అని వరం కోరుకున్నాడు. ‘సరే నీవు కోరిన వరం ఇస్తున్నాను. నీకు మృతి లేకుండా వరమిస్తాను. ఇంకొక వరం కూడా అడుగు ఇస్తాను’ అన్నాడు సాంబశివుడు. దీనికి బాణుడెంతో ప్రీతుడైనాడు.

07/31/2016 - 21:38

మాయను జయించండి. మాయ మిమ్మల్ని నిర్ణయాత్మక శక్తినుండి దూరం చేస్తుంది. కనుక మాయా మోహములకు దూరంగా ఉండండి అని ఆధ్యాత్మికవేత్తలు, మతగురువులు, సాధారణ ప్రజానీకమును హెచ్చరిస్తూ యుంటారు. మాయామోహములు ప్రలోభములకు మానవాళిని గురిచేస్తున్నాయి. మాయామోహములు లేనిదే జీవితం మృగ్యం నిరర్థకం అనే స్థాయికి ఇవి విస్తరించి ఉన్నాయి.

07/31/2016 - 21:36

అంబకతో అప్పుడు కృష్ణుడిట్లా చెప్పాడు. ఈ దనుజుడు తనకు వేయి బాహువులున్నాయని కండకావరంతో ఉన్నాడు. మత్తిల్లి ఉన్నాడు. ఎవరినీ లక్ష్యం చేయకుండా ఉన్నాడు. కాబట్టి నీవు జీవత్పుత్రవతివిగా ఉండాలనుకుంటే ఈ బాహువులు ఖండించి రెండు చేతులు మాత్రమే మిగిల్చి ఉంచుతాను వీడికి. ఇక అప్పుడు వీడికి అసుర భావం తొలగిపోతుంది. నీకు కూరిమి భక్తుడవుతాడు. ఇక ఎటువంటి ఆపదల పాలుకాడు. మదోద్రేకాలకు దూరంగా ఉంటాడు.

Pages