S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

07/07/2016 - 21:14

అప్పుడు మన్మథారి ఆమె సిగలో కల్పతరు ప్రసూనమాలిక అలంకరించి ఆమెను గాఢంగా ఆశే్లషించాడు. ఆమె కూడా ఆయనను తన కోమల బాహులతికలతో గాఢంగా పరిష్వంగం చేసుకుంది. ఆయన భుజాల చుట్టూ తన చేతులు గట్టిగా వేసింది.

07/07/2016 - 04:49

ప్రహ్లాదుడి కులానికి ఏదో చేటు రాబోతున్నదని నాకు సూచనప్రాయంగా తోస్తున్నది. ధ్వజం విరగిపడటం అంటే ఏమిటి? నీకేదో కీడు రాబోతున్నదనే కదా! అది తెలుసుకోలేక నా బాహువుల తీట తీర్చుకోబోతున్నావని నీవు పొంగిపోతున్నావు? ఇది ఆపదకే సంకేతం కాని నీ బాహుబల సంపదకు ఎంత మాత్రం ఊతకాదు. నాకైతే అగమ్యగోచరంగా ఉంది అని బాణుడి దగ్గర తనకున్న చనువు కొద్దీ కుంభాండుడు మనవి చేశాడు. అయినా బాణుడు భయపడలేదు.

07/05/2016 - 21:39

నీపై ఎవరూ దండెత్తి రాలేరు. వస్తే మళ్లీ తిరిగిపోలేరు. నినె్నవరూ జయించలేరు అని వరమిచ్చాడు. ఇక శోణపురి రాజధానిగా బాణుడు సకల రాక్షస చక్రవర్తిగా మహావిభవంతో ఉంటూ వచ్చాడు. కుమారస్వామికి కూడా బాణుడిపై ప్రేమ కలిగి దివ్య మయూరాన్ని అతడికి వాహనంగానూ, అతడి ధ్వజ చిహ్నంగానూ ఉండేట్లు అనుగ్రహించాడు.

07/03/2016 - 21:18

కంసుడి మంత్రులలో ఒకడైన పృథుడనే రాక్షసుణ్ణి, అతడి కొడుకైన అసిరోముడితోసహా వధించాడు. నరరూప ధరుడైన విరూపాక్షుడైన రాక్షసుణ్ణి, వాడి మదపుటేనుగైన ఐరావణంతో సహా రూపుమాపాడు. హిమశైల వాసులై లోకోపకారానికి తలపెట్టిన మైంద, ద్వివిదులనే వానరులను శిక్షించాడు.

07/03/2016 - 01:14

దంష్ట్రాకరాళ దారుణ వక్త్రంతో అగ్నికీలలు వెలిగ్రక్కుతూ కృష్ణుడేడీ?! ఎక్కడ ఎక్కడ? అంటూ ఆకృత్య ద్వారాకానగరంలో ప్రవేశించి బీభత్సం సృష్టించింది. ద్వారకావాసులు ఎంతో సంక్షోభం పాలైనారు. కృష్ణ కృష్ణా! రక్షిం

07/01/2016 - 22:00

వెంటనే కాశీరాజు చతురంగ బలాలను తన దివ్యయుధాలతో నిష్క్రియాపరులను చేశాడు శౌరి. ఆయన సైన్యాలు ఒదిగి వొదిగి వెనుదరిగాయి. అప్పుడు పౌండ్రుడు స్వయంగా శ్రీకృష్ణుడితో పోరాటానికి సిద్ధమైనాడు. శ్రీకృష్ణుడు ఆ అహంకారిని గేలి చేస్తూ ‘ఓరీ! క్షత్రియాధమా! నా ఆయుధాలు ధరించాలని అవివేకంగా నీవు మోజుపడితే నన్నాశ్రయించి, పాదాక్రాంతుడివై, నీ చిహ్నాలు నాకు ఇవ్వాల్సిందని వేడుకుంటే నేను ఇచ్చేవాణ్ణి కదా!

06/30/2016 - 21:26

అప్పుడాయన శంకరుణ్ణి గూర్చి తపస్సు చేయటం, కైలాసాధీశుడు తనకు ప్రత్యక్షం కావటం గూర్చి పెద్దలకు చెప్పాడు. వాళ్ళు పౌండ్రుడు ద్వారకా నగరంపై దండెత్తి రావటం, ఆ చెనటిని పరాభవించి పంపటం ఆయనకు సంతోషంతో తెలియజేశారు. పౌండ్రుడి దుర్మార్గం విని స్వామికి ఆవేశం జనించింది. నేను లేకపోవటం చూసి వాడింతకు తెగించాడా? సరే! పనె్నండేళ్ళుగా నేను కడూ విరామం ననుభవిస్తున్నాను రాక్షస సంహారం చేయకుండా.

06/30/2016 - 04:38

ఇది ఇట్లా ఉండగా ఏకలవ్యుడు, బలరామదేవుల మధ్య పోరు మహాభీకరంగా కొనసాగింది. ఒకరి విల్లులు ఒకరు విరుచుకున్నారు. ఒకరి రథాశ్వాలను ఒకరు నేలకూల్చారు. శక్తిమంతమైన శస్త్రప్రయోగాలను ఒకరుఒకరు కాచుకున్నారు. గదాయుద్ధం చేసి గదలను శకల శకలాలుగా చేసుకున్నారు. ఇంతలో ఏకలవ్యుడి సేనలు వేల సంఖ్యలో బలరాముణ్ణి చుట్టుముట్టాయి.

06/28/2016 - 22:53

కరదీపికలు విసిరేసి వాళ్ళు పారిపోయినారు. ఇది చూసి పౌండ్రుడు అట్టహాసంగా తన విజయం ప్రకటించుకున్నాడు. తన పక్షం వారిని కోటమీదికి పాకి యాదవుల యుద్ధ యంత్రాలను, బురుజులను విధ్వంసం చేసి కూల్చివేయవలసిందిగా పురికొల్పాడు. ఎవరికి ఏది కనపడితే దానిని దోచుకొన్నారు. స్ర్తిలను చెరచవలసిందిగా ప్రోత్సాహ వాక్యాలు పలికాడు. ధన సంచయాలను, వెలయాండ్రను వదలిపెట్టవద్దన్నాడు.

06/27/2016 - 03:23

కాని ఏ కళనున్నాడో కాని నారదుడు ఈ తుచ్ఛ భూపతిని రెచ్చగొట్టలేదు. ‘‘ఓ పౌండ్రక వాసుదేవుడా! హరి ఎక్కడ? నీవెక్కడ? పరమాణువు, పర్వతం లాంటిది మీ ఇద్దరిమధ్య సాదృశ్యం. ఇప్పటివరకు ఎంతమంది దుష్టులను ఉన్మీలించాడో కంస, ముర, చాణూర భంజనుడు. ఆయన త్రైవిక్రముడు.

Pages