S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

09/15/2016 - 06:28

ఇకమీద మీకున్ను భయం అక్కరలేదు. మీరు ఏతెంచిన కార్యం నేను ఎరిగి వున్నాను. వింధ్యాచలం అవంధ్యమైన గర్వోదయంతో దేవగిరి అయిన మేరు భూధరంతో మత్సరం తాల్చి, తన శిఖరౌన్నత్యాల చేత సూర్య మార్గాన్ని అరోధించి, బుధజనులకి బాధ కలిగిస్తున్నది. అకాలంలో సంభవించిన ఈ ప్రళయానికి భీతి చెంది, ఆ ఆపత్తుని పరిహరించే నిమిత్తం మీరు నన్ను శరణు పొందారు. ఈ అరిష్ట పరిహారానికి ఉపాయం తెల్పుతాను.

09/13/2016 - 21:09

ధేనువుల ఖురాల్లోను, ఖురాగ్రాల్లోను సమస్త పుణ్య తీర్థ సంతతిని, నిఖిల పర్వత వితానము వసిస్తూ వుంటవి. గోశృంగముల నడిమి భాగాన అద్భుత చరిత్రుడైన శంకరుడు గౌరీ కుచచందన చర్చ అంటుకొని పునీతం అయిన వక్షస్స్థలం కలవాడయి విలసిల్లుతూ వుంటాడు. మానవుడు నిండు మనంతో గోదానం చేస్తే పితృదేవతాగణాలు కొనియాడుతాయి. ఋషులు ప్రశంసిస్తారు. దేవతలకు పట్టరానంత సంతోషం కలుగుతుంది.

09/11/2016 - 21:32

సదకత్తులకి అంతర్యామీ! నీ అభయహస్తాన్ని మాకు చూపు.

09/11/2016 - 05:17

కొన్ని దేశాలు ఎండచే మాడిపోయాయి. మరికొన్ని దేశాలు మంచు చేత కొంకర్లు పోసాగాయి. ఇంకొన్ని నాడులు చిమ్మచీకట్లచే గ్రుడ్డివి అయిపోయాయి. కొన్ని దేశాలు చలి చేత గుత్తులుగా ముడుచుకొనిపోయాయి.
వింధ్యగిరిపైన విచ్చిన ఎర్రగోరింట పువ్వుల పొదరిల్లు వడువున ఎర్రని కృత్తికా నక్షత్రం ఒక చోట కదలకుండా వుండిపోయింది. ఉపకార్య కొరటికి సాటి అయి రోహిణీ తార ఒక యెడ తగుల్కొని పోయింది.

09/10/2016 - 00:07

పద్మబంధువైన భాస్కరుడు పాండ్య నృపాలుర అంతఃపుర ప్రాసాదాలకు చేరువుగా వున్న స్వర్ణ పద్మాలు కల నడబావుల్లో తన ప్రతిబింబం ప్రకాశించగా తుండీర దేశపు నడిమి చక్కి ఆకాశ రాజు మార్గాల్లో నడచింది.
ఒక ద్వీపానికి ఏ అచలం ఉదయాద్రి అవుతున్నదో ఆ వెనుక దీవికి ఆ గిరియే అస్తంగిరి అవుతోంది. ఒక లంకలో ప్రాతస్సంధ్య తేజరిల్లుతూ వుంటే మరొక ద్వీపంలో సాయం సంధ్య ఉదయిస్తోంది.

09/11/2016 - 05:27

రాత్రి అనెడి అరణ్య లతకి కరసాన పట్టించి చికిలీ చేయించిన గండ్రగొడ్డలి, నల్లవారిన సాంద్రాంధకార పరంపర అనే యజ్ఞవాటిక అగ్నిదేవుడి జిహ్వ, తారకలు అనే తెల్ల కలువల అడవిని కోసివేయడం కోసం తూర్పు దిశ ఎత్తిపట్టిన పల్లవాగ్రము, మిన్నుకి మన్నుకి- నిగి నేలలకి- ఏకత్వ శంకని పరిహరింప పాల్పడ్డ అవధి, సృష్టికి కంటి రెప్ప విప్పు, తొలి సంజ నెచ్చెలికాడు, వినతా మహాదేవి ముద్దుకొడుకు కుద్ర, సూర్య రథసారథి, పిచ్చుకుంటు, కట్టె

09/08/2016 - 03:57

గురుచరణ సన్నిధిని శాస్త్రం అభ్యసించనివాడు- పవిత్రజ్ఞానాన్ని మతిలో నిల్పుకోనివాడు, తెగింపుతో ప్రతిన సాధించుకోలేనివాడూ, జ్ఞాతిని జయించనివాడూ అయిన మనిషి ఒక మనుష్యుడేనా?

09/07/2016 - 01:58

ధన్యుడిని అయాను. ఆ విషయం ఆ విధంగా వుండనీ. అయినా నా ఒక విన్నపాన్ని సావధానమతివై అవధరించు. నీకు సేవారూపంగా అంజలి ఘటిస్తున్నాను. నీ చరణారవింద సందర్శనంవల్ల ప్రభవించిన ఆనంద ప్రవాహము వెల్లివిరియడంవల్ల ఏ కొదువ వాటిల్లదు. ఏబది కోట్ల యోజనాలు విస్తరించిన ఈ మహివలయంలో నువ్వు చూడని మహీధరాలు లేనే లేవు. గిరులు లెక్కకి మీరినవి పెక్కులు వుండుగాక!

09/04/2016 - 21:04

ఆ మూల చూడడంగా పఠించి ఆకాశాన్ని అంటుతున్న మేడిచెట్లు నఖ శిఖ పర్యంతం బ్రహ్మాండ భాండమాలికల రూపమైన నగలను అవధరించిన వృషభ ధ్వజుడైన శివుణ్ణి అనుకరిస్తున్నవి. అరవిరిసిన వకుళముల, కురవకాల నెత్తావులలో ఆసక్తి కల అళికులాల పరిషత్తుల ఝంకార ధ్వని విరహులకి మన్మథ భావాన్ని ఉద్దీపింపజేస్తున్నది.

09/03/2016 - 21:11

ఇంకా గణేశ్వరీ ప్రేషణం, గణేశ్వర మాయా ప్రపంచం, డుంఠి ప్రాదుర్భావం, విష్ణుమాయా ప్రపంచం, దివోదాస సముచ్ఛాటనం, పంచనదోత్పత్తి, బిందుమాధవ సంభవం, వైష్ణవతీర్థ మహాత్మ్యం, మందరాచలం నుంచి ఇందువౌళి వారణాసీ పురానికేతెంచుట, జైగీషవ్యోపాఖ్యానం, కృత్తివాసస్సముత్పత్తి, దుర్గామహాత్మ్యం, ఓంకార మాహాత్మ్యం, త్రిలోచక సముద్భవం, కేదారేశ, ధర్మేశ మాహాత్మ్యాలు, పక్షి కథ విశ్వభుజాఖ్యానం, దుర్దమ కథ, విశే్వశ్వరాఖ్యానం, కామేశ్వ

Pages