S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

10/30/2017 - 01:57

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపఁ దలచి విష్ణుడవనఁగా
విశ్వముఁఱుపను హరుడవు
విశ్వాత్మక! నీవే యగుచు వెలయుదు కృష్ణా!

10/28/2017 - 19:41

కుక్షిని సకల జగంబుల
నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక! వట పత్రము పై
దక్షతఁ బవళించు నట్టి ధన్యుఁడ కృష్ణా!

10/27/2017 - 18:26

చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్
చొక్కపు నీ గుణజాలము
నక్కజనుగు లెక్క పెట్ట నజునకు కృష్ణా!

భావం: ఓ కృష్ణా! ఈ ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలను లెక్కపెట్టవచ్చు. భూమిలోని ఇసుక రేణువులను కూడా కాస్త కష్టపడి లెక్కింపగవచ్చు. ఆర్తులను దీనులను, కాపాడే నీ దయామృతాన్ని గ్రోలవచ్చు కాని నీలోని సుగుణాలను లెక్కపెట్టటానికి ఆ బ్రహ్మకైనను సాధ్యం కాదు.

10/26/2017 - 18:45

గిరులందు మేరువౌదువు
సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్
పరమాత్మ! చంద్రుడౌదువు
నరులందున నృపతి వౌదు నయముగ కృష్ణా!

10/25/2017 - 18:40

దుర్భర బాణము రాగా
గర్భములోనుండి అభయ! ఆవుమటన్నన్
నిర్భరకృప రక్షించితి
నర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా!

10/24/2017 - 17:50

దివిజేంద్ర సుతుని జంపియు
రవిసుతు రక్షించి నావు రఘురాముడవై
దివిజేంద్ర సుతుని గాచియు
రవిసుతుఁ బరి మార్చి తౌర రణమున కృష్ణా!

10/22/2017 - 21:34

శక్రసుత గాచు కొఱకై
చక్రము చేపట్టి భీష్ముఁ జంపగ జను నీ
విక్రమ మేమని పొగడుదు?
నక్రాగ్రహ ! సర్వలోకనాయక! కృష్ణా!

10/21/2017 - 18:40

దుర్జనులగు నృపసంఘము
నిర్జింపగఁదలచి నీవు నిఖిలాధారా!
దుర్జనులను వధియింపను
అర్జునునకు నీవు సాదివైతివి కృష్ణా!

10/20/2017 - 18:24

జయమును విజయున కియ్యవే
హయములు ములుకోలమోపి యదలించి మహా
రయమున రొప్పవె తేరును
భయమున రిపు సేన విణిగి పాఱగ కృష్ణా!

10/18/2017 - 18:11

శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకషమగుచు మ్రోవ నాహన భూమిన్
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగుల జేయు ఘనుడవు కృష్ణా!

భావం: నీవు రణరంగంలో పాంచజన్యం అనే శంఖం పూరించి నీ వైరులను భయభ్రాంతులను చేసినవాడివి. ఈ శంఖనాదంతో రాక్షస స్ర్తిల గర్భాలు బ్రద్దలు చేసే వీరుడవు నీవు కదా. రాక్షసులకు శ్రీకృష్ణుడంటే ఎంత భయమో సజ్జనులకు భక్తులకు శ్రీకృష్ణుడంటే అభయం ఇచ్చేవాడని అంత ప్రీతి.

Pages