S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 01:32

విజయవాడ (క్రైం), జనవరి 21: ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరు తారక రామారావు అని సమాచార పౌర సంబంధాలు, ఐటి, మైనార్టీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆయన శనివారం మంత్రులు కొల్లు రవీంద్ర, పరిటాల సునీతతో కలిసి ఉదయం సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ సైన్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియంను సందర్శించారు.

01/22/2017 - 01:31

విజయవాడ (కల్చరల్), జనవరి 21: శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో పిడబ్ల్యుడి గ్రౌండ్స్ (స్వరాజ్ మైదానం)లో వారం రోజులపాటు అతి వైభవంగా జరగే శ్రీ లక్ష్మీ పౌండరీక మహాయజ్ఞం, శ్రీవారి నిత్యోత్సవాలు ఈ నెల 22న ఆదివారం నుంచి 28 శనివారం వరకు జరుగుతాయని పాలకవర్గ అధ్యక్షుడు దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు.

01/22/2017 - 01:29

బంగ్లాదేశ్‌లోని తురగ్ నదీ తీరంలో లక్షలాది మంది ముస్లింలు జనవరిలో కలసి పండుగ (జాతర) జరుపుకోవడం ఆనవాయితీ. ప్రపంచంలోనే ఇది ఒక జాతి, మతం వారు జరుపుకునే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి జనం ఎలా వస్తారంటే రైళ్లు కిక్కిరిసిపోయి లోపలా, పైనా ప్రయాణికులతో నిండిపోయేలా తరలివస్తారు. అలా వచ్చిన రైళ్లు ఇవి. చోటుకోసం ఈ ప్రయాణికుడిలా ఇలా ఒక రైలు మీంచి మరో రైలుపైకి గెంతడం అక్కడ సర్వసాధారణం.

01/22/2017 - 01:28

ఎడారి ఓడ అని పిలిచే ఒంటెలు సాధారణంగా ఎడారి ప్రాంతంలో కదా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మంచుబాగా కురుస్తూండటంతో ఐస్‌తో ఇలా ఒంటె రూపాన్ని తయారు చేశారు. మంటుటెండల్లో ఉండాల్సిన ఒంటె ఇలా మంచుతోనూ కనిపించడం విశేషమే. పాకిస్తాన్‌లో ఓ కళాకారుల బృందం ఇలా మంచుతో ఒంటె కళాకృతిని తయారుచేసి సందర్శకులను అలరించారు.

01/22/2017 - 01:26

పసిపిల్లలకు పాలుపట్టడం మురిపమే. తల్లిలేని ఓ పందికూనకు ఇలా సీసాతో పాలుపడుతూ మురిసిపోతోంది ఓ అమ్మడు. చైనాలోని జిన్‌జింగ్ ప్రాంతంలో ఈ దృశ్యం కంటపడింది.

01/22/2017 - 01:24

మాయలు మంత్రాలు వున్న కథలని చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. ఆ కథల్లో మమేకం అవుతారు. మాయలు మంత్రాలు వున్న సినిమాలని ఇంకా ఇష్టపడతారు. వాటిల్లో ప్రధాన పాత్ర మంచితనంతో నిండి ఉంటుంది. ఎన్నో కష్టాలు పడుతుంది. కానీ చివరికి విజయం సాధిస్తుంది. అది రాజుల సినిమా కావొచ్చు. మామూలు వ్యక్తుల సినిమా కావొచ్చు.

01/22/2017 - 01:22

వర్షం లేకుండా సృష్టి లేదు. కానీ ఎప్పుడూ వర్షం ఉంటే జీవితం పరమ బోర్‌గా అన్పిస్తుంది.
చెట్లూ, చేమలు వర్షం లేకుండా మనజాలవు. అదే విధంగా మనుషులు బ్రతకలేరు.
వర్షం లాంటివే- బాధలు, కష్టాలు, వేదనలు. అవి అన్నీ జీవితంలోని ముఖ్యమైన విషయాలు. ఇవి లేకుండా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి లేడు.

01/22/2017 - 01:14

ప్రకృతిని సందర్శిస్తూ ఉంటే మనసు పరవశిస్తోంది
రంగురంగుల సీతాకోకచిలుకలా
పూవుపూవునా వాలి అందాన్ని చూడాలని వుంది
ఆకాశంలో ఎగురుతూ పండు పండునా వాలుతూ
రామచిలకలా దోరపళ్ళ రుచులు చూడాలని వుంది
కొమ్మకొమ్మకి ఎగబాకుతూ ఎగురుతూ
కుచ్చుతోక ఆడిస్తూ ముచ్చటైన మూడు గీతలతో
ముద్దుగొలిపే రామానుగ్రహం పొందిన ఉడుతలా
కొమ్మకొమ్మకి ఎగిరి పళ్ళు కాయలు రుచి చూడాలని వుంది

01/22/2017 - 01:13

మొలక చంద్రుని కనురెప్పల మీద
వాలు చూపులు సారిస్తూ
నగ్న పాదాలతో నీవు నడవడం
నేను చూచాను
పరచుకున్న నీ నల్లని కురులలో
దిగంబరంగా నీవు
నిద్ర కాని నిద్రలో
నిద్రాముద్రిత అపురూప నిర్నిద్రలో
ఇక ఏ కవిత్వమూ సరిపోదు
ఈ రేయకి!

01/22/2017 - 01:11

ఊరంటే... కొన్ని వీధులూ
యంకొన్ని యళ్ల సముదాయాలే కాదు,
కాసిన్ని ప్రేమలూ, పాశాలూ
ఆశలూ, ఆత్మీయతలూ కూడా!
అప్పటి వూరు... గంపెడు సంసారాల్ని
గుట్టుగా కడుపున దాచుకునే కోళ్లగంప!
పూరిళ్లూ మిద్దెలే గానీ, అవి ప్రేమ పందిళ్లు!
చెదిరిపోని అనుబంధాల చలువ పందిళ్లు!
గర్భగుడిలా - యళ్లు,
కాసింత యరుకుగానే ఉన్నా...

Pages