S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 01:48

అరకులోయ, జనవరి 21: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీని ఆదర్శనీయ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ -2 వెంకటరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి దత్తత పంచాయతీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ పరిధిలోని పలు గిరిజన గ్రామాల్లో విస్తృతంగా శనివారం పర్యటించారు.

01/22/2017 - 01:47

అనకాపల్లి, జనవరి 21: స్థానిక వేల్పుల వీధి గౌరీపరమేశ్వరుల జాతర మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయింది. తెల్లవారు ఐదు గంటల నుండే స్థానిక మెయిన్‌రోడ్డులోని గౌరీపరమేశ్వరుల అమ్మవార్లను అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు.

01/22/2017 - 01:46

గంట్యాడ, జనవరి 21: తాటిపూడి జలాశయం మెయిన్ గేటులో నాలుగవ నంబరు గేటు శనివారం ఉదయం 10 గంటల సమయంలో హఠాత్తుగా పైకిలేవడంతో జలాశయంలో నీరు గోస్తనీలోకి ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో జలాశయం దిగువన కాలువలో దుస్తులు ఉతుకుతున్న ఎస్‌కోట మండలం దొరలపాలెంనకు చెందిన ఇద్దరు మహిళలలో జమ్మిలి తాడెమ్మ (34) వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.

01/22/2017 - 01:45

గంట్యాడ, జనవరి 21: తాటిపూడి జలాశయం మెయిన్ గేట్లకు మరమ్మతు పనులు చేపట్టకుంటే పెనుప్రమాదం తప్పదని ఆయకట్టు రైతులు వ్యక్తం చేస్తూ వస్తున్న భయమే నిజమైంది. శనివారం జలాశయం 4వ నెంబరు గేటు హటాత్తుగా పైకిలేచి బయటకు వృధాగా పోయిన నీరు, సంభవించిన ప్రమాదం అందుకు నిదర్శనం.

01/22/2017 - 01:44

విజయనగరం, జనవరి 21: గంట్యాడ మండలంలోని గోస్తనీ నదిపై నిర్మించిన తాటిపూడి రిజర్వయర్ గేటులో ఒక గేటు పైకి లేచిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్టు కలెక్టర్ వివేక్‌యాదవ్ స్పష్టం చేశారు. శనివారం సంఘటన సమాచారం తెలుసుకున్న కలెక్టర్ అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ రిజర్వాయర్ గేటు మానవ తప్పిదం వల్లనే జరిగిందని అంచనా వేస్తున్నామన్నారు.

01/22/2017 - 01:44

విజయనగరం (్ఫర్టు), జనవరి 21: మున్సిపాలిటీలో ఎన్‌టిఆర్ భరోసా పథకం కింద అనర్హులకు పింఛన్లు మంజూరు చేస్తున్నారనే వచ్చిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ జారీ చేసిన ఆదేశాలను మున్సిపల్ అధికారులు బేఖాతర్ చేశారు. మూడునెలల క్రితం కలెక్టర్ ఉత్తర్వులు జారీచేసినప్పటికీ ఇంతవరకు అతీగతీ లేదు. దీనిపై సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.

01/22/2017 - 01:43

విజయనగరం (్ఫర్టు), జనవరి 21: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, ఘోషాసుపత్రులను ప్రైవేటీకరించడం లేదని పాలకులు ప్రకటించేవరకూ పోరాటం కొనసాగిస్తామని విజయనగరం జిల్లా అభివృద్ధి వేదిక కన్వీనర్ పి.రంజత్‌కుమార్ తెలిపారు. అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు.

01/22/2017 - 01:42

ఏలూరు, జనవరి 21 : ఈసారి రబీ సీజన్‌కు ముందు నుంచి వంతుల వారీ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఏడాది కొంత వరకు గోదావరి జలాల అందుబాటు ప్రస్తుతానికి సంతృప్తికరంగానే వున్నా గత రబీ సీజన్‌లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.

01/22/2017 - 01:41

తాడేపల్లిగూడెం, జనవరి 21: దేశాభ్యున్నతి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని బిజెపి మహిళా మోర్ఛ జాతీయ కమిటీ ఇన్‌ఛార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి పేర్కొన్నారు. పెంటపాడు మండలం రాచర్ల ధర్మ ఫంక్షన్ హాలులో బిజెపి జిల్లాస్థాయి శిక్షణా తరగతులు శనివారం రెండో రోజు జరిగాయి.

01/22/2017 - 01:41

ఏలూరు, జనవరి 21: జిల్లాలో రైతుల వద్ద నుండి ఎవరైనా ఒక్క రూపాయి లంచం తీసుకున్నా తనను అవమానించినట్లేనని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టుల ప్రగతి, భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలే తప్ప రైతుల నుండి ఒక్క రూపాయి లంచం ఎవరూ కూడా ఆశించవద్దని హితవు పలికారు.

Pages