S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 01:08

నీవు తిరిగిరావు
జ్ఞాపకాల దొంతరలు తప్ప
మిగిలిందేమి లేదు
నిరంతర ప్రవాహంలా
నీ దారి నీది.
వొడుదుడుకుల జీవితంలో
ఓటమి గెలుపుల సయ్యాట మాది
ఆశ నిరాశల ఉచ్చుల్లో
ఆత్మక్షోభ మాది.

01/22/2017 - 01:06

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ట్యాంక్‌బండ్‌పై తెలుగు జాతి గర్వించతగ్గ మహనీయుల విగ్రహాలు స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ స్థాపించి తన రాజకీయ గురుభక్తిని చాటుకోవచ్చు కదా!
ఎన్టీఆర్ తన గురువని కెసిఆర్ ఎప్పుడు చెప్పాడు?

01/22/2017 - 01:00

భగత్‌సింగ్
రచన : ఎం.వి.ఆర్.శాస్ర్తి
పుటలు: 280 - వెల: రు.200
దుర్గా పబ్లికేషన్స్
జి-1, సాయకృష్ణ మాన్షన్,
1-1-230/9, వివేక్‌నగర్, చిక్కడపల్లి,
హైదరాబాద్ - 500 020
ఫోన్ : 040-27632824
9441257962
www.supatha.in
**

01/22/2017 - 00:55

మాటకు ఎంత శక్తి ఉందో, శబ్దానికీ అంత శక్తీ ఉంటుంది. లేకపోతే నోరు లేని వాద్యాలకు చోటెక్కడ? సాహిత్యాన్ని అర్థం చేసుకుంటాం. సంగీతం ఆనందిస్తాం. సాహిత్యానికి అర్థం చెప్పగలిగినంత తేలికగా సంగీతాన్ని వివరించి చెప్పటం కష్టం. ఎవరి కంఠాల్లో స్వరాలు ఎటువంటి విన్యాసాలతో ఆనందాన్నిస్తాయో, ఎవరూ చెప్పలేరు.

01/22/2017 - 00:47

ఒక వివేకవంతుడు ఏదో పని మీద బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక ఎడారిని దాటాల్సి వచ్చింది. కొన్ని గంటలు ప్రయాణిస్తే అతను ఎడారిని దాటవచ్చు. మార్గమధ్యలో అవసరమయి సరంజామాని కూడా ముందు జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఎడారి మార్గంలో వెళుతున్నాడు.
ఆ ఎడారిలో అతనికి ఒక సన్యాసి ఎదురుపడ్డాడు. అతను ఆ సన్యాసిని చూసి ఆశ్చర్యపోయాడు. అంత నిర్జన ప్రదేశంలో ఒక గుడారం వేసుకుని ఆ సన్యాసి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

01/22/2017 - 00:44

కొన్ని వింటే నమ్మలేం. స్వయంగా చూసినా కొందరు నమ్మలేరు. అలాంటి సంఘటన ఒకటి లూయిస్ మేరిసన్ అనే ఇంగ్లీష్ టీచర్ జీవితంలో జరిగింది. ఆమె ఇంగ్లీష్ మాట్లాడని దేశాల నించి అమెరికా వచ్చిన వలసదారులకి ఇంగ్లీష్ నేర్పించే క్లాస్‌లని నిర్వహించేది. ఆమె విద్యార్థుల్లోని ఒకరు థామర్‌చెక్.

01/22/2017 - 00:36

యుద్ధాలు, అంతర్యుద్ధాలు, అస్థిరత, రాజకీయ వేధింపులు, ఆర్థిక మాంద్యం, ఉపాధి లేమి, పేదరికం - కారణాలు ఏమైతేనేం కొన్ని దేశాలు అస్థిరతకు చిరునామాగా మారిపోయాయి. సామాన్య ప్రజల సాధారణ జీవనాన్ని అసాధారణ రీతిలో ఛిద్రం చేసేశాయి. నిలువ నీడ లేక, స్వదేశంలో ఉండలేక పొట్ట చేతపట్టుకుని, కట్టుబట్టలతో పరాయి దేశం పంచన చేరాల్సిన పరిస్థితులూ తెచ్చిపెట్టాయి.

01/22/2017 - 00:05

అహంకారాన్ని, లోభితనాన్ని వదిలివేసినవారికి ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. మనిషిలో అజ్ఞానం ఉంటే వారిలో అహంకారం మొదలవుతుంది. తెలిసింది తక్కువైతే అదే అజ్ఞానానికి హేతువు అవుతుంది. అంతే కాక మానవునిలో లోభత్వం కూడా మనిషిని దుర్గుణాలవైపుకు ప్రయాణం చేసేలా చేస్తుంది.

01/21/2017 - 23:59

పుణ్యసాధ్వి అయిన వినత వెండి కొండ శిలల వంటి మూడు గ్రుడ్డులను ప్రసవించింది.
వినత ప్రసవించిన మొదటి అండంనుంచి సూర్యోదయ కాలంలో ముజ్జగాలు నిశే్చష్టమై నిలవగా గుడ్లగూబ పక్షి పుట్టింది. ఆ ఉలూక పక్షి పద్దెనిమిది ద్వీపాలకు, అఖిల పక్షి జాతికిన్ని రాజపట్టాన్ని నొసట ఆహ్లాదంతో వహించింది.

01/21/2017 - 23:58

జీవితాన్ని మనం సృష్టించాలి కాని జీవితం చేతిలో తోలుబొమ్మలుగా మాత్రమే మిగిలిపోతాం.’’
‘‘మేం ఆర్మీవాళ్ళం.. రాజకీయ నాయకుల చేతులలో కీలుబొమ్మలం. అయితే మీరు పెద్ద పెద్ద కంపెనీల చేతులలో అవుతారు. పెద్ద తేడా ఏమీ లేదు’’.

Pages