S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 22:55

కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్ళై తెరకెక్కిస్తున్న చిత్రం ‘శివలింగ’. రితిక హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన కన్నడ సూపర్‌హిట్ మూవీ శివలింగ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. జనవరి 23న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నారు.

01/21/2017 - 22:53

ఎం.వి.వి. సినిమా పతాకంపై రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం లక్కున్నోడు. మంచు విష్ణు, హన్సిక జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఫిబ్రవరి 3న సినిమా విడుదలకు ముస్తాబైంది.

01/21/2017 - 22:47

దక్షిణ అమెరికాలోని అతికొద్ది దేశాల్లో మాత్రమే కనిపించే ఈ ఎలుగుంట్ల పేరు వాటి కళ్ల ఆధారంగా వచ్చింది. వీటిని ‘స్పెక్టకల్డ్ బేర్స్’ అని పిలుస్తారు. వాటి కళ్లవద్ద ఉంటే మచ్చలు కళ్లద్దాల్లా కన్పించడం వల్ల ఆ పేరు వచ్చింది. ప్రతి ఎలుగుబంటికి ఈ మచ్చలు చూడటానికి ఒకేలా ఉన్నా భిన్నాంగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచి ఈ మచ్చలు వాటికి వస్తాయి. మన వేలిముద్రల్లా.

01/21/2017 - 22:45

జపాన్‌లోని మూడు దీవుల్లో మాత్రమే కనిపించే అరుదైన కోతులు ఇవి. ఇవి తెలివైన జీవులు. ఆహార సేకరణ, అనుకరణ, కొత్త విషయాలు నేర్చుకోవడంలో చురుకుగా, తెలివిగా వ్యవహరిస్తాయి. 35 అంగుళాల ఎత్తువరకు పెరిగే ఈ కోతులు మంచులోనూ జీవిస్తాయి. ఒతె్తైన బొచ్చు వీటి ప్రత్యేకత. శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోకుండా సమూహంగా, ఒకదానిని ఒకటి పట్టుకుని దగ్గరగా ఉంటాయి. వీటి ముఖం ఎర్రగా మారితే అవి యుక్తవయస్సుకు వచ్చినట్లు లెక్క.

01/21/2017 - 22:45

రిచా పనయ్, ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజి ప్రధాన తారాగణంగా సుఖీభవ మూవీస్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో గురురాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రక్షక భటుడు’. ఈ చిత్రానికి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, మంచి కథాంశంతో క్రేజీగా రూపొందిస్తున్న ఈ సినిమా తన గత చిత్రాలకు భిన్నంగా వుంటుందని తెలిపారు.

01/21/2017 - 22:44

జతకట్టేందుకు ఆడపక్షి ముందు లయబద్ధంగా నృత్యం చేసే ఈ సముద్ర పక్షుల పేరు ‘బ్లూ ఫుట్ బూబీ’. అందమైన నీలిరంగు పాదాలతో కనిపించే ఈ పక్షులు ‘కోర్ట్‌షిప్’ డ్యాన్స్‌కు పెట్టిందిపేరు. అయితే వాటి కాళ్ల రంగు వెనుక అతి ముఖ్యమైన రహస్యం ఉంది. అవి తినే ఆహారాన్ని బట్టి నీలిరంగు వస్తుంది. కరోటినాయిడ్స్‌తో కూడిన పిగ్మెంటేషన్ వల్ల ఆ రంగు వస్తుంది. రోగనిరోధక శక్తిని ఈ రంగు కలిగిస్తుంది.

01/21/2017 - 22:43

నంద, ఉమ, వౌనిక, వాణి ప్రధాన తారాగణంగా తమిళంలో రూపొందిన చిత్రం ‘సెల్వమ్’. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై లక్ష్మీపుత్రుడు పేరుతో ఎ.రమేష్‌బాబు తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి సంయుక్తంగా ఆడియో విడుదల చేశారు.

01/21/2017 - 22:42

తమిళ హీరో సూర్య ‘పెటా’ (జంతు హక్కుల సంస్థ)కు శనివారం నోటీసులు ఇచ్చారు. తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సినీనటులు మద్దతు ప్రకటించడంపై ‘పెటా’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టును నిషేధించాలని ‘పెటా’ డిమాండ్ చేయడం పట్ల సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలకు, వ్యక్తిగత ప్రచారం కోసమే నటీనటులు జల్లికట్టుకు మద్దతు ఇవ్వడం సరికాదని ‘పెటా’ అంటోంది.

01/21/2017 - 22:42

క్రీ.శ. వెయ్యి సంవత్సరంలోనే వస్తువులు స్పష్టంగా చూసే ఓ పరికరాన్ని కనిపెట్టారు. కళ్లద్దాలు కాదుగానీ ఒ తరహా రాయితో దీనిని తయారు చేశారు. రోమ్, చైనాల్లో 1200 సంవత్సరం నాటికి కళ్లద్దాల వాడకం మొదలైంది. నిజానికి పెద్దలకోసమే వాటిని కనిపెట్టారు. ఇప్పటికీ చాలా ఆఫ్రికా దేశాల్లో కళ్లజోడు కొనడం ఖరీదైన వ్యవహారమే. కొన్నిచోట్ల కళ్లజోడు ఖరీదు వారి మూడునెలల వేతనానికి సమానం.

01/21/2017 - 22:40

టాలీవుడ్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’లో ఒకడైన హీరో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పుట్టినరోజు సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయంపై స్పందించిన ప్రభాస్ పెదనాన్న, రెబల్‌స్టార్ కృష్ణంరాజు పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రభాస్ వివాహం కచ్చితంగా అయిపోతుందని, అమ్మాయి ఎవరనే విషయాన్ని ‘బాహుబలి-2’ చిత్రం విడుదల తర్వాత చెబుతానని అన్నారు.

Pages