S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 00:25

సిద్దిపేట, ఏప్రిల్ 28: తెలంగాణ సర్కార్ నామినేటేడ్ పదవులను భర్తి చేస్తుండటంతో నియోజక వర్గంలోని పలువురు సీనియర్ నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఆశీస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్న పలువురు నేతలు సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై దృష్టి సారించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కేంద్ర బిందువుగా ఉండటంతో పలువురు నేతలు ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు.

04/29/2016 - 00:24

సిద్దిపేట, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ పార్టీలో పదవులన్ని అనుభవించి.. స్వార్థంతో పార్టీని వీడి కన్నతల్లి లాంటి పార్టీని ద్రోహం చేసిన ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ తన పదవికి రాజీనామా చేయాలని సిద్దిపేట నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జీ తాడూరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసి, భవిష్యత్తులో పార్టీలో చేర్చుకోవద్దన్నారు.

04/29/2016 - 00:23

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 28: జిల్లా మహిళా సమాఖ్య సభ్యులందరూ గ్రామాలను దత్తత తీసుకొని ఇంకుడు గుంతలపై ప్రజల్లో అవగాహాన పెంచి నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేయాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచించారు. గురువారం సంగారెడ్డిలోని జిల్లా సమాఖ్య కార్యాలయ ఆవరణలో నిర్మించనున్న ఇంకుడు గుంతల పనులను కలెక్టర్ ప్రారంభించారు.

04/29/2016 - 00:23

సంగారెడ్డి, ఏప్రిల్ 28: మాడే కడుపుకు కాలే గంజి మిన్న అన్న నానుడి నెలకొన్న కరువు ద్వారా స్పష్టమవుతోంది. కరువు జిల్లాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినా నివారణ చర్యలు శూన్యం కావడంతో కడుపు నిండక పస్తులతో కాలం వెళ్ల దీస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిపిఎం అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో జిల్లాలో 11 అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి పొట్టనింపే ప్రయత్నం చేస్తున్నారు.

04/29/2016 - 00:21

ఇందూర్, ఏప్రిల్ 28: గడిచిన 12రోజుల క్రితం జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ మృతి చెందిన ఎర్రోళ్ల బాబయ్య మృతి కారణమైన నిందితుడు శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు శవంతో రాస్తారోకో చేసిన సంఘటన గురువారం మధ్యాహ్నం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

04/29/2016 - 00:20

నిజామాబాద్, ఏప్రిల్ 28: ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏనుగు రవీందర్‌రెడ్డికి బుగ్గ కారు యోగం దక్కుతుందా? అనేది సందిగ్ధంగానే మారింది. తెరాస పార్టీ పరంగా చూస్తే జిల్లాలో ఏనుగు రవీందర్‌రెడ్డి అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

04/29/2016 - 00:20

కంఠేశ్వర్, ఏప్రిల్ 28: బీడీ కట్టలపై 85శాతం క్యాన్సర్ బొమ్మను కేంద్రం ప్రభుత్వం ముద్రించడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ ఎదుట భారీ బహిరంగ సభను నిర్వహించారు.

04/29/2016 - 00:19

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 28: తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా వేసవి ఎండలు ముదిరిన ప్రస్తుత తరుణంలో మూగజీవాలకు, ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడుతోందని, మునుపెన్నడు లేని విధంగా భూగర్భ జలాల స్థాయి అడుగంటుతున్నాయని, భూగర్భ జలాలను పెంపోందించుకోవడం కోసం ఇంటింటికి మ్యాజిక్ సోప్‌పిట్ ( ఇంకుడుగుంత) లను నిర్మించుకుని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ యో

04/29/2016 - 00:19

కంఠేశ్వర్, ఏప్రిల్ 28: తెలంగాణ వ్యాప్తంగా కరవు విలయతాండవం చేస్తుంటే, ముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలను అట్టహాసంగా నిర్వహించారని, ఇది సమంజసంగా లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ఆక్షేపించారు. గురువారం నగరంలోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో మొదటిసారిగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/28/2016 - 23:54

వరంగల్, ఏప్రిల్ 28: రైతు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో కరవు విలయతాండవం చేస్తుందని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

Pages