S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 00:41

రౌతులపూడి, ఏప్రిల్ 28: ఉప ప్రణాళిక ప్రాంత గ్రామాల రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్ట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. గురువారం ఉప ప్రణాళిక ప్రాంత గ్రామాలైన ఎస్ పైడిపాల, సత్యవరం గ్రామాలకు రూ.6.9 కోట్లు గిరిజన ఉప ప్రణాళిక నిధులతో బిటి రోడ్లు నిర్మాణాలకు హోం మంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు.

04/29/2016 - 00:40

రామచంద్రపురం, ఏప్రిల్ 28: రైతు పక్షపాతిగా అధికారులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఎనిమిది మండలాల తహసీల్దార్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, ఎంహెచ్‌వోలు తదితర సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు రికార్డులు సక్రమంగా ఉంచడంలేదన్నారు.

04/29/2016 - 00:40

శంఖవరం, ఏప్రిల్ 28: తెలుగుదేశంపార్టీలో పర్వత చిట్టిబాబు కుటుంబానికి సముచిత స్థానం ఎప్పుడూ ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

04/29/2016 - 00:39

తుని, ఏప్రిల్ 28: ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రూ.8.5 కోట్లతో నిర్మించనున్న ప్రసూతి, శిశు ఆరోగ్య కేంద్రానికి, ఇ-హెచ్‌ఎంఎస్‌పనులను మంత్రులు కామినేని, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు.

04/29/2016 - 00:38

అయినవిల్లి, ఏప్రిల్ 28: కోనసీమలో ప్రధాన పంట అయిన కొబ్బరి ధర ఒక్కసారిగా తగ్గడంతో కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితం కొబ్బరి కాయ ధర రూ. 6 నుండి రూ.8 ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే గత వారం రోజుల నుండి కొబ్బరి కాయ ధర రూ.3కు పడిపోవడంతో కొబ్బరి కాయలు రాశులుగా పోసి నిల్వ ఉంచామని పలువురు రైతులు చెబుతున్నారు.

04/29/2016 - 00:38

గోకవరం, ఏప్రిల్ 28: సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షించనున్న పెద్దపాత్రుని చెరువు పనులను మూఢం ముంచుకు వస్తుండడంతో గురువారం ప్రారంభించేశారు. వివరాలిలా ఉన్నాయి.

04/29/2016 - 00:37

కొత్తపేట, ఏప్రిల్ 28: విషాహారం కారణంగా కొత్తపేటలో మరో ఆవు మృతి చెందటంతో మృతి చెందిన ఆవుల సంఖ్య గురువారానికి మూడుకు చేరుకుంది. పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న అధికార్లు ఆవుల మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కొత్తపేటకు చెందిన చింతపల్లి శ్రీనివాస్‌కు చెందిన గోశాల ఆవులకు విషగుళికలు పెట్టిన విషయం పాఠకులకు తెలిసిందే.

04/29/2016 - 00:36

ఐ పోలవరం, ఏప్రిల్ 28: తెలుగుదేశం పార్టీ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అన్నారు. గురువారం ఐ పోలవరం మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. జి వేమవరం గ్రామంలో జడ్పీ నిధులు రూ. 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు సర్వశిక్షాభియన్ నిధులు రూ.

04/29/2016 - 00:34

ఏలూరు, ఏప్రిల్ 28: ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి ఈ నెల 29న ఎన్నిక నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ సాయి శ్రీకాంత్ తెలిపారు. డిప్యూటీ మేయర్‌గా వున్న చోడే వెంకటరత్నం రాజీనామా సమర్పించడంతో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాల్సి వుందన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏలూరు కార్పొరేషన్‌లోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నిక జరుగుతుందని కమిషనర్ వివరించారు.

04/29/2016 - 00:34

భీమవరం, ఏప్రిల్ 28: స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో వేంచేసియున్న శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామివారి పంచమ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 30వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు కంతేటి వెంకట్రాజు తెలిపారు. గురువారం దేవస్థానం ఆవరణలో శ్రీవారి బ్రహ్మోత్సవాల పోస్టర్లను పాలకవర్గం ఆవిష్కరించింది.

Pages