S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/28/2016 - 23:53

బాలసముద్రం, ఏప్రిల్ 28: విధి నిర్వహణ కోసం శ్రమించే సిబ్బందికి శాఖపరమైన గుర్తింపు ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు.

04/28/2016 - 23:53

రాయపర్తి, ఏప్రిల్ 28: ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేందుకు ఇంకుడుగుంతలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఇంకుడుగుంతల పనులను ప్రతి ఒక్కరు ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ కోరారు. మండలంలోని తిర్మలాయపల్లి, గన్నారం గ్రామాలలోని ఈజిఎస్ పనుల ద్వారా చేపడుతున్న ఇంకుడుగుంతలు, ఉపాధిహామీ పథకాల పనులను గురువారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అకస్మికంగా పరిశీలించారు.

04/28/2016 - 23:52

తొర్రూరు, ఏప్రిల్ 28: ఆన్‌లైన్‌లో గొలుసుకట్టు వ్యాపారాలు నిర్వహిస్తూ.. అక్రమంగా వినియోగదారులను మోసం చేసి వారివద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను గురువారం అరెస్టు చేసి వారి వద్దనుంచి సుమారు ఏడు లక్షల రూపాయల నగదు, ఒక ల్యాప్‌ట్యాప్, రెండు కార్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తొర్రూరు సిఐ శ్రీధర్‌రావు తెలిపారు.

04/28/2016 - 23:52

నక్కలగుట్ట, ఏప్రిల్ 28: శ్రీరామచంద్రుడు పరిపూర్ణ మానవత్వాన్ని మనకు అందించిన ఆదర్శ పురుషుడని, ధర్మాన్ని ఆచరించి ఇతరులు ఆచరించేలా చేసిన మార్గదర్శి అని శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీ ఉద్బోధించారు. గురువారం వరంగల్ వికాస తరంగిణి అధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ధార్మిక సదస్సు, శ్రీరామ పాదుకా పట్ట్భాషేక కార్యక్రమాలు జరిగాయి.

04/28/2016 - 23:51

వరంగల్, ఏప్రిల్ 28: కాజీపేటను రైల్వేపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాదనలో ఉన్న కాజీపేటను డివిజన్ కేంద్రంగా మార్చేందుకు తమవంతు కృషి చేస్తామని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు సీతారాంనాయక్, వరంగల్ పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్ అన్నారు. గురువారం సాయంత్రం వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.

04/28/2016 - 23:50

నక్కలగుట్ట, ఏప్రిల్ 28: వరంగల్ వికాస తరంగిణి అధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వరకు గురువారం రామపాదుకల శోభాయాత్ర భక్తి ప్రపత్తుల మద్య జరిగింది. శోభాయాత్రకు ముందుభాగాన శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి నడిచారు. ఉదయమే వికాస తరంగిణి కార్యకర్తలు, భక్తులు పబ్లిక్ గార్డెన్ చేరుకున్నారు. అనంతరం భక్తుల భజనలు, కోలాటాలతో సందడిగా యాత్ర ప్రారంభమైనది.

04/28/2016 - 23:49

చిగురుమామిడి, ఏప్రిల్ 28: అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను విధిగా అందించేందుకు అహర్నిషలు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం సిఎం కెసిఆర్ దత్తత గ్రామమైన చిగురుమామిడి మండలం చిన ముల్కనూర్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

04/28/2016 - 23:48

కరీంనగర్, ఏప్రిల్ 28: అసలే వేసవికాలం.. అందులోనూ దంచికొడుతున్న ఎండలు. ఈ క్రమంలో కరెంట్ సరఫరా లేకపోతే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కావడం తప్ప ఇంకేముండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో రెండు రోజులుగా కరెంట్ సరఫరా నిలిచిపోతే, అందులో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఈ పరిస్థితులు చోటుచేసుకోవడం గమనార్హం.

04/28/2016 - 23:48

రామగుండం, ఏప్రిల్ 28: రామగుండం మున్సిపాలిటి నిధుల దుబారాకు నిదర్శనంగా నిలుస్తుంది. 2008వ సంవత్సరంలో గోదావరిఖనిలో పబ్లిక్ పార్క్ నిర్మాణం పేరిట అరకోటి రూపాయలను దుబారా చేసింది. ఆర్భాటంగా పనులను అయితే ప్రారంభించి తూతూ మంత్రంగా చేపట్టి అక్కడ పనులన్ని గాలికి వదిలేసారు. దీంతో ఆ ప్రదేశమంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది.

04/28/2016 - 23:47

కరీంనగర్, ఏప్రిల్ 28: జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై భద్రతను మరింత పెంపొందించనున్నామని జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఐదు ప్రత్యేక వాహనాలను రహదారుల భద్రత కోసం కేటాయించడం జరిగిందని చెప్పారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని దివంగత ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నేర సమీక్షాసమావేశం జరిగింది.

Pages