S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 00:52

గుడివాడ, ఏప్రిల్ 28: స్థానిక 10వ వార్డుకు మంచినీరివ్వాలంటూ ఆ వార్డు మహిళలు గురువారం మున్సిపల్ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మద్దతు తెలపడంతో టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనలో భాగం పంచుకున్నారు. దీంతో కార్యాలయ ఉద్యోగులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

04/29/2016 - 00:51

మచిలీపట్నం, ఏప్రిల్ 28: మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మత్స్య పరిశ్రమ వృద్ధికి దోహదం చేసేలా జాతీయ సముద్ర మత్స్య విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. జాతీయ సముద్ర మత్స్య విధానం- 2016 ముసాయిదాపై చర్చా కార్యక్రమాన్ని గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు.

04/29/2016 - 00:50

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 28: సైడ్ డ్రైయిన్ల నిర్మాణం చేపట్టిన రోడ్లను డ్రైయిన్ టు డ్రైయిన్ నిర్మాణాలు చేపట్టాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాయకాపురం, న్యూ రాజరాజేశ్వరీపేట తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న సైడ్ డ్రైయిన్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

04/29/2016 - 00:50

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో మారుమూలలలోని అభ్యర్థుల ముంగిటకే ఉద్యోగావకాశాలను తీసుకెళ్లే ఎంప్లాయిమెంట్ బస్ ‘ఉద్యోగ రథాన్ని’ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం పిబి సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా టిఎమ్‌ఐ గ్రూప్ ఈ ప్రచార రధాన్ని సిద్ధం చేసింది.

04/29/2016 - 00:49

విజయవాడ, ఏప్రిల్ 28: అన్ని స్థాయిల్లోని పార్టీ సమావేశాలు సకాలంలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ప్రభుత్వ అతిథిగృహంలో గురువారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి గ్రామ, మండల, నియోజకర్గ సమన్వయ కమిటీ సమావేశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ స్థాయిల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరును నియోజకవర్గాల వారీగా సమీక్షించారు.

04/29/2016 - 00:45

మలికిపురం, ఏప్రిల్ 28: చాలాకాలం విరామం తరువాత సినీ రంగంలో పునఃప్రవేశం చేస్తున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ అన్నారు. ప్రతీ సినిమాకు ప్రారంభం ముందుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించి తన స్క్రిప్ట్‌కు స్వామివారి సన్నిధిలో పూజలు జరిపించుకుంటానన్నారు.

04/29/2016 - 00:44

కాకినాడ, ఏప్రిల్ 28: సుమారు రూ.100 కోట్ల అక్రమాస్తులతో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డిటిసి) ఆదిమూలం మోహన్ వ్యవహార శైలి ఆది నుండి వివాదాస్పదంగానే తయారయ్యింది. కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషర్‌గా గత ఏడాదిన్నరగా పనిచేస్తున్న మోహన్ పేరు చెబితే సంబంధిత కార్యాలయ సిబ్బందే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

04/29/2016 - 00:42

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: జిల్లాలో ఏటికేడాది వేసవిలో దాహార్తి పెరుగుతోంది. నీటిమట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో పలుచోట్ల నీటిలో ఐరన్ శాతం పెరుగుతోంది. ఇప్పటికే విలీన మండలాల్లో మూడుచోట్ల ఫ్లోరైడ్ గుర్తించడంతో ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రత్యేక మంచినీటి పథకాలను రూపొందిస్తున్నారు.

04/29/2016 - 00:42

కాకినాడ, ఏప్రిల్ 28: ఆదాయానికి మించి భారీ ఆస్తులతో అవినీతి నిరోధక శాఖ సోదాల్లో చిక్కిన కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డిటిసి) ఆదిమూలం మోహన్‌ను అరెస్ట్ చేసినట్టు ఎసిబి ఇన్‌స్పెక్టర్ సతీష్ గురువారం రాత్రి ధ్రువీకరించారు. విజయవాడ ఎసిబి కోర్టులో శుక్రవారం నిందితుడిని హాజరుపరచనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

04/29/2016 - 00:41

అమలాపురం, ఏప్రిల్ 28: అమలాపురంలో శుక్రవారం జరగనున్న ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రీజినల్ కో-ఆర్డినేటర్ పెచ్చెట్టి కృష్ణకిషోర్ ఆంధ్రభూమికి తెలిపారు. పరీక్షల కోసం కోనసీమలో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 3,126 మంది ఇంజనీరింగ్, 933 మంది మెడిసిన్ పరీక్ష రాయనున్నారన్నారు.

Pages