S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 00:33

చాగల్లు, ఏప్రిల్ 28: చిరంజీవి 150వ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం జరుగుతుందని సినీ దర్శకుడు వివి వినాయక్ వెల్లడించారు. గురువారం చాగల్లులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చిరంజీవి తనపై ఎంతో నమ్మకం ఉంచి ఇచ్చిన దర్శకత్వ బాధ్యత అప్పగించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు.

04/29/2016 - 00:32

ద్వారకాతిరుమల, ఏప్రిల్ 28: రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు గ్రామీణ గోడౌన్ల నిర్మాణానికి డిసిసిబి ద్వారా రుణాలు ఇస్తున్నట్టు ఆ బ్యాంకు ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) తెలిపారు. మండలంలోని జి కొత్తపల్లిలో పిఎసిఎస్ నూతన భవనాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.

04/29/2016 - 00:31

ఏలూరు, ఏప్రిల్ 28: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వెయ్యి మంచినీటి చలివేంద్రాలను ప్రారంభిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ నుండి గురువారం ఉదయం మండల తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మంచినీటి చలివేంద్రాలు, భూ రికార్డులు తదితర అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు.

04/29/2016 - 00:31

ఉండి, ఏప్రిల్ 28: కాలువలకు నీరు కట్టెసినా కాలువలో నీటి పారుదల సాగుతోంది. ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 25న కాలువలు కట్టి వేస్తున్నట్టు ప్రకటించినా ఈ నెల 27 సాయంత్రం వరకు ఉండి సబ్‌డివిజన్ పరిధిలోని వెంకయ్య వయ్యేరు కాలువకు నీరు విడుదల చేశారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాగా, ఆ కాలువపై నీరు అవసరం ఉన్నందున మరో రెండురోజులు అదనంగా నీరు ఇచ్చినట్టు వారు చెప్పారు.

04/29/2016 - 00:30

ఏలూరు, ఏప్రిల్ 28: జిల్లాలో ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షను శుక్రవారం అధికారులు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు జిల్లాలోని ఏలూరు, భీమవరం పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ విద్యార్ధులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు మెడిసన్ విద్యార్ధులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 12440 మందికి జిల్లాలో 22 సెంటర్లను ఏర్పాటు చేశారు.

04/29/2016 - 00:30

భీమవరం, ఏప్రిల్ 28: జిల్లా రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఈ నెల 30న ఆవిష్కరించనున్నారు. వాస్తవంగా అజాత శత్రువనే పదం ఆయన కోసమే పుట్టిందోమోనని చాలా మంది వ్యాఖ్యానిస్తారు.

04/29/2016 - 00:29

ఏలూరు, ఏప్రిల్ 28: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఆస్తులను వెంటనే అప్పగించాలని తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన విద్యుత్తు బకాయిల సొమ్ము తక్షణమే చెల్లించాలని కోరుతూ జిల్లా ఎపిఎస్‌ఇబి ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఇ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించింది.

04/29/2016 - 00:28

బుట్టాయగూడెం, ఏప్రిల్ 28: మతం ముసుగులో ఒక మతబోధకుడు సహాయం చేసినట్లు నమ్మించి, మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. మండలంలోని రామన్నగూడెం గ్రామస్థుల వివరాల ప్రకారం గ్రామంలో ఒక యువకుడు సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఒక అద్దె ఇంట్లో చర్చి నిర్వహిస్తూ, చిన్నపిల్లలను సండే స్కూల్ పేరిట పాటలు, డాన్స్‌లు నేర్పించి ఆకట్టుకున్నాడు.

04/29/2016 - 00:27

ఏలూరు, ఏప్రిల్ 28 : ఆయన ప్రస్థానం తాత్కాలిక చిరుద్యోగిగా ప్రారంభమైంది. మూడు దశాబ్దాల్లో చిరుద్యోగి నుంచి అధికారిగా మారిపోయారు... ఈ క్రమంలోనే ఆయన ఆస్తుల విలువ కోట్ల రూపాయలకు చేరిపోయింది. కొద్దికాలంలోనే కోట్లకు పడగలెత్తి అదే స్థాయిలో వ్యవహారాలు నడిపిస్తున్న ఆయన వ్యవహారంపై ఎసిబి అధికారులకు ఫిర్యాదులు రావడం, వారు రంగంలోకి దిగి సోదాలు జరిపారు.

04/29/2016 - 00:25

మెదక్, ఏప్రిల్ 28: మెదక్ డివిజన్ నల్లవాగు ప్రాంగణంలో శుక్రవారం నాడు పశు సంరక్షణ కేంద్రంను ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభిస్తున్నట్లు మెదక్ జిల్లా పశు సంరక్షణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం నాడు ఆయన మెదక్ వెటర్నరీ ఆస్పత్రిలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పశు సంరక్షణ కేంద్రం జూన్ మాసం వరకు కొనసాగుతుందన్నారు.

Pages