S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/28/2016 - 23:46

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 28: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం వెనుక మతలబేమిటని టిడిపి కరవుబృందం సభ్యుడు, ఆపార్టీ అధికారప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. కరవు పరిస్థితులు క్షేత్రస్థాయిలో పరిశీలించేక్రమంలో గురువారం జిల్లాలో పర్యటించిన అనంతరం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/28/2016 - 23:46

జగిత్యాలరూరల్, ఏప్రిల్ 28: వర్షాభావ పరిస్థితుల కారణంగా నిత్యవసర సరుకుల ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. నీటి సౌలభ్యం కలిగిన రైతులకే తక్కువ స్థాయి ఉత్పత్తులు చేతికి రావడంతో దినుసులను అధిక ధరకు విక్రయిస్తున్నారు. చింతపండు, పసుపు, ఎండుమిర్చి, వెల్లుల్లి కొనుగోలు జగిత్యాల వారసంత ప్రసిద్దిగాంచింది. అయితే పచ్చళ్ల సీజన్ కావడంతో గురువారం స్థానిక వారసంత వినియోగదారుల సందడి తీవ్రంగా కనిపించింది.

04/28/2016 - 23:45

గంభీరావుపేట, ఏప్రిల్ 28: మండల కేంద్రంలో జరిగిన మరుగుదొడ్ల నిర్మాణాలపై రీసర్వే జరుపుతున్నట్లు డిప్యూటీ సిఇవో గౌతంరెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో పూర్తయినవి, పూర్తికాని మరుగుదొడ్లను ఆయన పర్యవేక్షించారు. ఇంటింటా తిరిగి మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. 420 మరుగుదొడ్లు నిర్మించుకోవల్సిండగా, 120 నిర్మాణ దశలో వుండి, మరికొద్దిపాటి అసంపూర్తిగా ఉన్న వాటిని ఆయన పరిశీలించారు.

04/28/2016 - 23:43

ఆదిలాబాద్, ఏప్రిల్ 28: ఎండల తీవ్రత.. ఉక్కపోత, వడగాల్పుల తాకిడి జిల్లా ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. జిల్లాలో సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. గురువారం పగటి ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలు నమోదు కాగా సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం కాస్త చల్లబడింది.

04/28/2016 - 23:42

మందమర్రి రూరల్, ఏప్రిల్ 28: మందమర్రి ఏరియాలో సింగరేణి ఆద్వర్యంలో ఇంటింటా యోగా కార్యక్రమాన్ని గురవారం మందమర్రి ఏరియా ఇన్ చార్జి జిఎం జివి దేవికుమార్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వివేకానంద యోగా అనుసందాన సంస్థాన్ బెంగుళూర్ వారి ఆధ్వర్యంలో సింగరేణి సిఎండి ఆదేశాల మేరకు మీ ఆరోగ్యం కోసం ప్రతీ ఇంటా యోగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు.

04/28/2016 - 23:42

నిర్మల్, ఏప్రిల్ 28: లక్షలాది మంది బీడీ కార్మికుల పొట్టగొట్టే నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ ( ఐ ఏఫ్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజన్న డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ ఫంక్షన్‌హాల్ నుంచి ఆర్డీ ఓ కార్యాలయం వరకు వేలాది మంది బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసనకు దిగారు.

04/28/2016 - 23:41

ఆదిలాబాద్ , ఏప్రిల్ 28: జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో మగ్గుతున్న ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం (పిఎంకెఎస్‌వై) కింద రూ.1087 కోట్లు మంజూరయ్యాయని, కేంద్రం నిధులతోనే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అన్నారు.

04/28/2016 - 23:40

శ్రీరాంపూర్ రూరల్, ఏప్రిల్ 28: శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనుల వే బ్రిడ్జిలు, సీ ఎస్‌పి చెక్ పోస్టుల వద్ద జిపిఎస్ ద్వారా బొగ్గు రవాణా సౌకర్యం నిర్వహిస్తున్నట్లు శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎస్‌డి ఎం సుబాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ మేనేజర్ సాంబశివరావు తెలిపారు.

04/28/2016 - 23:40

శ్రీరాంపూర్ రూరల్ ఏప్రిల్ 28: సింగరేణి బొగ్గుబావుల ప్రైవేటీకరణను వేంటనే ఉపసంహరించుకోవాలని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సీతారామయ్య డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నల్ల బ్యాడ్జిలు దరించి నిరసన తెలిపారు.

04/28/2016 - 23:37

భారత్‌లో నిర్మించండి-అన్న స్ఫూర్తి మేధా సంపత్తి హక్కుల వ్యవస్థకు భంగం కారాదని అమెరికా ప్రభుత్వం ఉచిత సలహానిస్తోంది. మన అంతర్గత వ్యవహారాలలో అమెరికా ప్రభుత్వం వారు అక్రమ ప్రమేయం కల్పించుకొనడం దశాబ్దుల చరిత్ర. ఈ అక్రమమైన జోక్యానికి ఇప్పుడు అమెరికా విడుదల వార్షిక వాణిజ్య ప్రత్యేక నివేదికలో మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి.

Pages