S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 23:50

కదిరిటౌన్,జనవరి 22: పట్టణ శివార్లలోని మూర్తిపల్లి పొలాల్లో అరుణ్‌కుమార్ (17) అనే యువకుడు శుక్రవారం అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందాడు. అరుణ్‌కుమార్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాడు. చిన్నతనం నుంచే పట్టణంలోని మారుతీ నగర్‌లో వున్న గణేష్ మిఠాయిల తయారీ కేంద్రంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నుంచి అరుణ్‌కుమార్ కనిపించలేదు.

01/22/2016 - 23:49

హిందూపురం, జనవరి 22: వెనుకబడిన తరగతుల వర్గాలకు బిసి కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేసేందుకు ఉన్నతాధికారులకు సూచించినట్లు సంస్థ రాష్ట్ర చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బిసి కార్పొరేషన్ కార్యాలయంలో ఎండి నవీన్‌కుమార్, రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

01/22/2016 - 23:48

రాయదుర్గం,జనవరి 22 : దివాళాతీస్తున్న ఆర్టీసీని సంరకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్‌ఆర్ ఆరీ టసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఆర్టీసీని తాకట్టు పెడితేగాని కార్మికుల కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

01/22/2016 - 23:48

అనంతపురం, జనవరి 22 : జిల్లాలోని ఉద్యానవన శాఖ, ఎపిఎంఐపిలకు నిర్దేశించిన మేరకు లక్ష్యాలు సాధించాలని లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. శుక్రవారం ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15,69 0 హెక్టార్లలోడ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలన్న లక్ష్యానికి 15,125 హెక్టార్లలోనే సాధించారన్నారు.

01/22/2016 - 23:48

రామగిరి, జనవరి 22: పరిటాల రవీంద్ర 11వ వర్ధంతి వేడుకల ఏర్పాట్లు వెంకటాపురంలో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆదివారం నిర్వహించే వర్ధంతికి అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. ప్రధానంగా అన్నదాన కార్యక్రమం సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకూడదని భోజనశాలను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనశాలలో బారికేడ్లు, కౌంటర్లపై మంత్రి చర్చించారు.

01/22/2016 - 23:47

బత్తలపల్లి, జనవరి 22: వ్యక్తిగత పనిపై ధర్మవరం వెళ్ళి తిరుగు ప్రయాణంలో స్వగ్రామామైన దాడితోటకు వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో మాజీ మంత్రి తనయుడుతో పాటు నాగిరెడ్డి అనుచరుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో అనుచరునికి తీవ్రగాయాలపాలైన సంఘటన శుక్రవారం బత్తలపల్లి మండలంలో చోటు చేసుకుంది.

01/22/2016 - 23:46

అనంతపురం, జనవరి 22 : ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ రాజశేఖర్‌బాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రాణాలు చాలా విలువైనవని అందుకే మోటారు వాహనాల చట్టాన్ని పాటిస్తూ మెలగాలన్నారు.

01/22/2016 - 23:46

హిందూపురం టౌన్, జనవరి 22: పట్టణాల్లో ఎల్‌ఇడి వెలుగులు విరజిమ్మేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో తొలి విడతగా అనంతపురం నగర పాలక సంస్థతోపాటు హిందూపురం మున్సిపాలిటీ ఎల్‌ఇడి బల్బులు అమర్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరితగతిన పూర్తి చేసి ఈ నెలాఖరుకెల్లా ఎల్‌ఇడి వెలుగులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇంజినీరింగ్ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.

01/22/2016 - 23:43

బోధన్ రూరల్, జనవరి 22: బోధన్ నిజాంసుగర్స్ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుణప్రసాద్, సిపిఎం నాయకుడు శంకర్‌గౌడ్‌లు సంఘీభావం ప్రకటించారు. చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

01/22/2016 - 23:42

ఆర్మూర్, జనవరి 22: ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగిస్తూ చైతన్యపర్చేందుకే రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నామని జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమీషనర్(జెటిసి) పాండురంగారావు అన్నారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 27వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని ఎంవిఐ అశ్వంత్‌కుమార్ ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించారు.

Pages