S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 01:11

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి. అమిత్ షాను బిజెపి పూర్తి స్థాయి అధ్యక్షుడుగా ఎన్నుకున్న తరువాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని మోదీ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ శనివారం రాత్రి బిజెపి ప్రస్తుత కార్యవర్గ సభ్యులకు విందు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

01/23/2016 - 01:10

లక్నో, జనవరి 22: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత దేశాన్ని తీర్చిదిద్దాలన్నదే తన ప్రభుత్వ ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా తీర్చిదిద్దడమే కాకుండా పేదల జీవితాల్లో మార్పు తేవడం కూడా తమ ధ్యేయమని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో మార్పు తెస్తే వారికి ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని, తమ సొంతకాళ్లపై నిలబడగులుగుతారని మోదీ అన్నారు.

01/23/2016 - 01:02

విజయవాడ, జనవరి 22: ప్రతి ఏటా మూడు సీజన్లలో 120 రకాల పంటలు పండించే 33వేల ఎకరాల భూములను అదిరించి, బెదిరించి కైవసం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను విదేశీ కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తోందంటూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్త పండలనేని శ్రీమన్నారాయణ ధ్వజమెత్తారు.

01/23/2016 - 01:02

నల్లగొండ, జనవరి 22: దేశంలోనే నల్లగొండ జిల్లా యాదాద్రి దేవస్థానాన్ని దర్శనీయ దివ్య క్షేత్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో పెరుగనున్న భక్తుల సౌకర్యార్ధం ఎంఎంటిఎస్ రైల్ సర్వీస్ రెండో దశను ఘట్‌కేసర్ నుండి రాయగిరి(యాదాద్రి) రైల్వే స్టేషన్ వరకు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాశారు.

01/23/2016 - 01:01

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సెగలు అంతిమంగా శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కేంద్రమైన గాంధీ భవన్‌కు తాళం వేయడం వరకూ దారితీశాయి. టికెట్లు దక్కని నేతలు ఆత్మహత్యలు, ఆందోళనలు, ధర్నాలకు గాంధీ భవన్‌నే వేదికగా చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

01/23/2016 - 01:00

హైదరాబాద్, జనవరి 22: వర్శిటీ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై కేంద్రం అవాస్తవాలు చెబుతోందని జెడియు పార్లమెంట్ సభ్యులు త్యాగి, పవన్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం వర్శిటీ ప్రాంగణంలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.

01/23/2016 - 00:59

హిందూపురం, జనవరి 22: సెంట్రల్ వర్శిటీకి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. రోహిత్ విద్యాభ్యాసం చేసిన పాఠశాలలు, కళాశాలలనుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కొడిగెనహళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల కళాశాలలో శుక్రవారం ఇంటెలిజెన్స్ వర్గాలు రోహిత్ వివరాలు సేకరించాయి.

01/23/2016 - 00:59

హైదరాబాద్, జనవరి 22: ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్‌ది ఏ కులమనే విషయమై చర్చలు సాగుతున్న నేపథ్యంలో తమది వడ్డెర కులమేనని అతని తండ్రి తేల్చి చెప్పారు. రోహిత్ తండ్రి మణికుమార్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. తాను దళితుడిని కాదని, బిసి ‘ఏ’ గ్రూపునకు చెందిన వాడని ఓ టివి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

01/23/2016 - 00:58

విజయవాడ (క్రైం), జనవరి 22: కల్తీ మద్యం మరణాల కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ పత్రాలు సకాలంలో జిల్లా జైలుకు చేరనందున విష్ణు విడుదల శనివారానికి వాయిదా పడింది. దీంతో పెద్ద సంఖ్యలో జైలు వద్ద తరలివచ్చిన పార్టీ కార్యకర్తలకు నిరాశే ఎదురైంది.

01/23/2016 - 00:57

హైదరాబాద్, జనవరి 22: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అభియోగంపై పోలీసులు నిజాం కళాశాల ప్రొఫెసర్ ఖాసీంను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్‌కు చెందిన మావోయిస్టు కొరియర్ శ్యాంసుందర్‌రెడ్డిని అరెస్టు చేసిన మెదక్ జిల్లా గజ్వేల్ పోలీసులు అతని వద్దనున్న కాల్ డేటా ఆధారంగా ప్రొఫెసర్ ఖాసీంకు కూడా మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలున్నట్టు గుర్తించారు.

Pages