S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 00:06

వరంగల్, జనవరి 22: వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో అఖిల భారత మహిళా ఉద్యోగుల సదస్సు శుక్రవారం జరుగనుంది. ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల నుండి వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.

01/23/2016 - 00:02

నిర్మల్, జనవరి 22: పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సులో శుక్రవారం సాయంత్రం మంటలు చెలరేగడం కలకలం సృష్టించింది. పాఠశాల ముగిసిన వెంటనే దాదాపు 25 మంది విద్యార్థులు వారి ఇళ్ల వద్ద దింపేందుకు బయలుదేరిన బస్సు ఈద్గాం చౌరస్తా వరకు చేరుకోగానే బస్సు ఇంజన్‌లో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ స్థానికుల సహకారంతో పిల్లలను బస్సు నుండి దింపేశాడు.

01/23/2016 - 00:00

నేరేడుచర్ల, జనవరి 22: లౌకికత్వానికి, మత సామరస్యానికి చిహ్నమయిన తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్దిచెందిన నేరేడుచర్ల మండలంలోని జాన్‌పహాడ్ సైదులుదర్గా ఉర్సు మహోత్సవం అశేష జనభక్తవాహనిలో అత్యంత వైభవంగా, సాంప్రదాయసిద్ధంగా కన్నుల పండువగా జరిగింది.

01/22/2016 - 23:58

సంగారెడ్డి, జనవరి 22: మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తి కాకముందే ప్రధాన పార్టీలు ప్రచార పర్వానికి తెరలేపాయి. అధికార టిఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి పార్టీలు తమ తమ మద్దతుదారులను కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

01/22/2016 - 23:56

కర్నూలు, జనవరి 22:కమీషన్ల కోసం ఇష్టానుసారంగా ఆరోగ్యశ్రీ నిధులు ఖర్చు చేసిన వైనం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో వెలుగులోకి వచ్చింది. పేరుకు పెద్దాసుపత్రి అయినా వసతులు మాత్రం ఆ స్థాయిలో లేవని చెప్పవచ్చు. ఆరోగ్యశ్రీ నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నా ఏడేళ్ల నుంచి ఆడిటింగ్ జరగకపోవడం ఉద్యోగులకు వరంగా మారింది. ఆసుపత్రిలోని ఓ ఉద్యోగి కాంట్రాక్టర్ అవతారమెత్తి దాదాపు రూ.

01/22/2016 - 23:54

కడప,జనవరి 22: 67వ గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లాలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ తెలిపారు. ఢిల్లీలో అనుమానిత ఉగ్రవాదులను ఇంటెలిజన్స్ అధికారులు అరెస్టు చేయడంతో దేశమంతా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కడప జిల్లాలోకూడా పోలీసు యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు.

01/22/2016 - 23:53

రైల్వేకోడూరు, జనవరి 22:వేలానికి 3 వేల టన్నుల ఎర్రచందనం అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు అటవీ శాఖ తిరుపతి కన్జర్వేటర్ చలపతిరావు అన్నారు. శుక్రవారం కోడూరు, బాలుపల్లె అటవీ శాఖ పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం స్థానిక అతిథిగృహంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిర్మూలన, అటవీ సంరక్షణ, విధులు, బాధ్యతలు తదితర అంశాలపై స్థానిక అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

01/22/2016 - 23:53

కడప (కలెక్టరేట్), జనవరి 22: వాహనాలు నడిపే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ కెవి రమణ కోరారు. శుక్రవారం స్థానిక జడ్‌పి సమావేశ మందిరంలో 27వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

01/22/2016 - 23:52

మైదుకూరు, జనవరి 22: మైదుకూరు పట్టణంలో నిర్వహించనున్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని నియోజకవర్గంలోని ప్రజలందరూ దపంతులతో పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనాలని టిటిడి పాలకమండలి సభ్యుడు, టిడిపి మైదుకూరు ఇన్‌చార్జ్ పుట్టా సుధాకర్‌యాదవ్ కోరారు.

01/22/2016 - 23:52

కడప,జనవరి 22: రాష్ట్రంలో అత్యంత దుర్భక్ష ప్రాంతమైన కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తుందో, లేదోనని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బ్రహ్మణి ఉక్కుపరిశ్రమ ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్మించేందుకు జమ్మలమడుగు నియోజకవర్గపరిధిలో శంకుస్థాపన జరిగింది. కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి పలు నిర్మాణాలు కూడా చేపట్టారు.

Pages