S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 00:57

హైదరాబాద్, జనవరి 22: దేశవ్యాప్తంగా రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ వర్శిటీ కార్యనిర్వాహక సంఘం శుక్రవారం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. రోహిత్ కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. అలాగే చర్చలకు రావలసిందిగా పరిపాలన బాధ్యతలనుంచి తప్పుకున్న అధ్యాపకులను ఆహ్వానించింది. అయితే వారు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

01/23/2016 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 22: తెలంగాణలో దాదాపు ఆరు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే పెట్టుబడులు, వస్తుతయారీ జోన్, ఫార్మానిమ్జ్,్ధన్యం ప్రాసెసింగ్ క్లస్టర్‌తో పాటు నాలుగు ఎస్‌ఇజడ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణకు మంచి రోజులు వచ్చాయంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

01/23/2016 - 00:48

హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్‌లో నెలకొల్పె ఫార్పాసిటీ పట్ల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతుండటంతో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం త్వరగా సమగ్రమైన నివేదిక తయారు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దాదాపు 12 వేల ఎకరాల్లో ఫార్మా పరిశ్రమతో పాటు ఫార్మాసిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

01/23/2016 - 00:47

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి ప్రపంచ ఆర్థిక వేదిక మద్దతు తెలిపింది. వ్యవసాయ రంగంలో ఉత్తమ సాగు విధానాల అధ్యయనం, అమలుకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు.

01/23/2016 - 00:46

హైదరాబాద్, జనవరి 22: ఎలాంటి న్యాయ వివాదాలు లేని 8,086 డిఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నో రోజుల నుంచి డిఎస్సీ కోసం అభ్యర్థులు వేచి చూస్తున్న తరుణంలో న్యాయవివాదాలకు అవకాశం లేకుండా ఫిబ్రవరి మొదటి వారంలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

01/23/2016 - 00:44

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పండ్ల పక్వానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఫిబ్రవరి 1వ తేదీన రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.

01/23/2016 - 00:43

న్యూఢిల్లీ/ బెంగళూరు/ హైదరాబాద్, జనవరి 22: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలన్న ఉగ్రవాదుల కుట్ర భగ్నమయింది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్‌ఐఎ శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపి 13మంది ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను అరెస్టు చేయడంతో పెద్ద ముప్పు తప్పింది.

01/23/2016 - 00:42

న్యూఢిల్లీ, జనవరి 22: హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం నిర్ణయించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు, వివక్షతను కఠినంగా అరికట్టేందుకు మనవ వనరుల శాఖ పలు నిర్ణయాలను ప్రకటించింది.

01/23/2016 - 20:03

ఆవేశకావేషాల ఉద్ధతిలో అసలు విషయం మరపున పడింది.

01/23/2016 - 00:08

ఖమ్మం, జనవరి 22: గ్రామజ్యోతి అనే దానికి అర్థం మారుతూ గ్రామచీకట్లుగా మారుతున్న పరిస్థితి జిల్లాలోనిది... అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం... రాజకీయాలకు అతీతంగా ఐక్యతతో ముందుకెళ్ధాం... ఇలా చెప్పారు కొందరు ప్రజాప్రతినిధులు... అధికారులు... తీరా చూస్తే మిగిలింది ప్రజల్లో నిరుత్సాహమే...!

Pages