S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 22:45

మహబూబ్‌నగర్, జనవరి 22: ఈ నెల 25వ తేదిన జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్‌కు సూచించారు. శుక్రవారం సాధారణ పరిపాలన భవనం నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

01/22/2016 - 22:44

మహబూబ్‌నగర్, జనవరి 22: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) పథకంకు మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది తీరాన తొలిదశ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని అందించినప్పుడే వచ్చే ఎన్నికల్లో ఓట్ల అడిగేందు ప్రజల ముందుకు వస్తామని బహిరంగంగా సిఎం కెసిఆర్ ప్రకటించడం దాంతో వాటర్‌గ్రిడ్ పథకానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

01/22/2016 - 21:59

ముకరంపుర (కరీంనగర్), జనవరి 22: ప్రతీ సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ కలెక్టర్’, ప్రజావాణి కార్యక్రమాలు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ సోమవారం (25.1.2016)న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సోమవారం యదావిధిగా డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలు ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.

01/22/2016 - 21:59

ముకరంపుర (కరీంనగర్), జనవరి 22: ఈనెల 17న కిడ్నాప్‌కు గురైన నగరంలోని భగత్‌నగర్‌కు చెందిన వొరుసు లక్ష్మిప్రసాద్(7) అనే బాలుడు హత్యకు గురైనట్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు. కిడ్నాపైనట్లు భావిస్తున్న నాటినుంచి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, ఆచూకీ లభించలేదు. స్థానికులు ఉదయం వేళ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

01/22/2016 - 21:58

కోనరావుపేట, జనవరి 22: కోనరావుపేట మండలం కొలనూరు గ్రామ శివారులోని గొల్లపల్లికి చెందిన కొత్తకొండ కనుకరాజు(22) ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్ళగా అక్కడ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు నెలల తర్వాత శవపేటికలో ఇంటికి చేరుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన హన్మవ్వ, రామయ్యల ఏకైక కుమారుడు కనుకరాజు, ఉపాధి కోసం అప్పులు చేసి సౌదీకి వెళ్ళాడు.

01/22/2016 - 21:58

సిరిసిల్ల, జనవరి 22: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పోటీ చేసే అభ్యర్థులపై ఇంకా స్పష్టత రావడం లేదు. సిరిసిల్ల డివిజన్‌లోని తొమ్మిది మండలాలకు చెందిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండి ప్రతిష్టాత్మకంగా జరిగే సెస్ ఎన్నికల్లో ఈసారి రాజకీయ పార్టీల నుండి అంతగా వేడి పుంజుకోలేదు.

01/22/2016 - 21:57

పెద్దపల్లి, జనవరి 22: దేశంలో రైతులందరికి రానున్న రోజుల్లో భూ ఆరోగ్యకార్డులు అందజేస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహెర్ తెలిపారు. శుక్రవారం గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళుతున్న ఆయనను పెద్దపల్లిలో బిజెపి నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

01/22/2016 - 21:57

కరీంనగర్ టౌన్, జనవరి 22: ఎన్నికలకు ముందు కార్మిక,కర్షకులు, బడుగు,బలహీన వర్గాలకు ఇచ్చిన హామీల్లో భాగంగా కూలీ రేట్లు పెంచి, దళితులకు భూములు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యోడు విజయరాఘవన్ డిమాండ్ చేశారు. ఆసంఘం రాష్టమ్రహాసభల్లో భాగంగా శుక్రవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు.

01/22/2016 - 21:56

కోరుట్ల, జనవరి 22:ప్రజా ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రైవేట్‌కు ధీటుగా మెరుగైన వైద్యం అందించేందుకు కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌రావు తనయుడు సంజయ్‌కుమార్ వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ అన్నారు.

01/22/2016 - 21:56

కరీంనగర్ టౌన్, జనవరి 22: దేశంలో ప్రస్తుతం రైతులెదుర్కొంటున్న ఎరువుల కొరతకు కేంద్రం త్వరలోనే చరమగీతం పాడనుందని, ఇందులో భాగంగానే కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా మూతపడ్డ 8 ఎరువుల కర్మాగారాలను పునఃప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహెర్ స్పష్టంచేశారు.

Pages