S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/28/2019 - 03:48

గద్వాల, జనవరి 27: చెడ్డిగ్యాంగ్ పేరుతో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆదివారం గద్వాల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ షాకీర్ హుస్సేన్ వివరాలు వెల్లడించారు.

01/28/2019 - 03:46

కాల్వశ్రీరాంపూర్, జనవరి 27: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో ఆదివారం జింక కొమ్ములను ఎస్‌ఐ షేక్ మస్తాన్ వలీ పట్టుకున్నారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. పిక్కల కుమార్ ఇంటిలో జింక కొమ్ములు ఉన్నట్లు సమాచారం మేరకు సోదా చేయగా జింక కొమ్ములు లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే జింక కొమ్ములను స్వాధీనం చేసుకొని కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

01/28/2019 - 03:44

బొమ్మలరామారం, జనవరి 27: తూంకుంటకు చెందిన బావిని సత్తయ్య (58) రోజువారిలాగె కల్లు సేకరించేందుకు తాటిచెట్టుపైకి ఎక్కి ప్రమాదవశాత్తు జారి క్రింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా బొమ్మలరామారం ఎస్సై వెంకటేశం ఆదివారం తెలిపారు. మండలంలో కురుస్తున్న వర్షానికి తాటి చెట్టుపైనుండి జారి పడినట్లుగా స్థానికులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

01/28/2019 - 03:44

భువనగిరి, జనవరి 27: మండలంలోని రాయిగిరి, కూనూరు గ్రామాల మధ్య ఎదురెదురుగా వస్తున్న ఆటోను బైక్‌ఢీకొనడంతో బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తులు గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన బుర్ర ధశరథ (47), అనీల్ (25). వీరు భువనగిరి వైపుకు వస్తుండగా వేగంగా వస్తున్న అటో డీకొట్టడంతో అక్కడికక్కడే మృ తి చెందినట్లుగా స్థానికులు తెలిపారు.

01/28/2019 - 02:32

న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలోని హైకోర్టులు, దిగువ కోర్టుల్లో రోజురోజుకు పెండింగ్ కేసుల సంఖ్య కొండలా పేరుకుపోతున్నాయి.

01/28/2019 - 01:17

కాచిగూడ, జనవరి 27: అమాయక ప్రజలపై సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. పలు బహుమతుల పేరుతో ఆశ చూపించి రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ క్షణాల్లో మోసాలకు పాల్పడతున్నారు. మూడు నెలల వ్యవధిలో సైబర్ నేరగాళ్ల వలలో లక్షల్లో మోసపోయామని నగర సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు లందాయ. హైదారాబాద్, బెంగళూరు, చెనె్న నగరాలను లక్ష్యంగా నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

01/28/2019 - 01:15

ఉప్పల్, జనవరి 27: ఉప్పల్ పారిశ్రామికవాడలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రహదారిలో దారికి అడ్డంగా రాళ్లు పెట్టించి మూసివేయించారనే అభియోగంపై కేర్ టేకర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి వెంకటేశ్‌పై ఐపీసీ సెక్షన్లు 283, 447, 427 ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేయించారు. పోలీసుల కథనం ప్రకారం క్రికెట్ స్టేడియం గేట్ నెంబర్ 5 నుంచి 8 వరకు గతంలో దారి ఉండేది. పక్కనే ఇదే దారిలో లారీలు పార్కింగ్ చేస్తున్నారు.

01/28/2019 - 01:14

యాచారం, జనవరి 27: రోడ్డు ప్రమాదానికి గురై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి యాచారం సీఐ మధుకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యాచారం మండల పరిధిలోని తక్కళ్ళపల్లి గేటు వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఓ గుర్తు తెలియని వ్యక్తి (50)ని ఢీకొంది.

01/28/2019 - 00:36

న్యూఢిల్లీ: ముందు ప్రకటించినట్లుగా అయోధ్య రామజన్మభూమి వివాదం కేసు విచారణను ఈ నెల 29వ తేదీ మంగళవారం చేపట్టడం లేదని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే మంగళవారం అందుబాటులో ఉండనందు వల్ల 29న కేసు విచారణను రద్దు చేస్తున్నట్లు కోర్టు రిజిస్ట్రీలో ప్రకటించారు.

01/27/2019 - 01:38

విజయవాడ (క్రైం), జనవరి 26: ఒరిస్సా బరంపూర్ కేంద్రంగా వివిధ రకాల గుట్కా, పాన్‌మసాలాలను నగరానికి తరలించి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు ఎనిమిది లక్షలు విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు.

Pages