S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/03/2019 - 23:13

పీలేరు, జనవరి 3: మండల పరిధిలోని వేపులబైలు గ్రామం వరంపాటివారిపల్లికి చెందిన శేషాద్రి భార్య వరలక్ష్మి (35) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

01/03/2019 - 23:12

పుత్తూరు, జనవరి 3: ఓ వివాహిత దారుణహత్యకు గురైన సంఘటన పుత్తూరు మండలం, వేపగుంట క్రాస్ రోడ్డు వద్ద గురువారం చోటు చేసుకుంది. ఈ హత్యకేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

01/03/2019 - 23:09

కలికిరి, జనవరి 3: కలికిరి పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన కేసులో అంతర్జాలం సహాయంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇటీవల పట్టణంలో ఒక యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన కేసులో విచారణ చేపట్టిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలు, కాల్‌డేటాను పరీక్షించి నిందితులను గురువారం ఉదయం సీఐ ఉలసయ్య ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాసులు పట్టుకున్నారు.

01/03/2019 - 23:06

నిజాంపట్నం, జనవరి 3: తమ భూములు తమకివ్వమన్నందుకు ఓ దళితుని అగ్రవర్ణాల వారు కళ్ళల్లో కారం చల్లి, రాడ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నంలో గురువారం పట్టపగలు జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం నిజాంపట్నం శివారు థామస్‌పేటకు చెందిన 186 దళిత కుటుంబాల వారికి 1973లో ఈదుళ్ళపర్రలో నాటి ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది.

01/03/2019 - 23:01

పెద్దవడుగూరు, జనవరి 3 : మండల పరిధిలోని భీమునిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (25) గురువారం తెల్లవారుజామున విద్యుదాఘతంతో మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు సుధాకర్ తన ఇంట్లో ఉన్న నీటా మోటార్ ప్లగ్‌కు కనెక్షన్ ఇస్తుండగా అప్పటికే గోడలో ప్రవహిస్తున్న విద్యుత్‌తో షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు.

01/03/2019 - 23:01

కంబదూరు, జనవరి 3 : మండల పరిధిలోని కదిరిదేవరపల్లి గ్రామానికి చెందిన గొల్ల ఈరన్న (65) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు తన వ్యవసాయ తోటలో పని చేసేందుకు కూలీల కోసం ద్విచక్ర వాహనంలో కళ్యాణదుర్గం-హిందుపురం రోడ్డుకు ఆనుకుని ఉన్న ఎస్సీ కాలనీలోకి వెళ్లి వస్తుండగా కళ్యాణదుర్గం నుంచి పావుగడకు వెళ్తున్న క్రూజర్ వాహనం ఢీకొంది.

01/03/2019 - 23:00

వజ్రకరూరు, జనవరి 3 : మండల పరిధిలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన రైతు నారాయణస్వామి (45) గురువారం ఎద్దుల బడి మీద నుంచి పడి మృతి చెందాడు. తెల్లవారుజామున పొలం పనులకు వెళ్లి వస్తుండగా ఉన్నట్టుండి ఎద్దులు బెదరడంతో నారాయణస్వామి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.

01/03/2019 - 04:21

విజయవాడ (క్రైం), జనవరి 2: దాదాపు పదేళ్ళ క్రితం రాష్టవ్య్రాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసుకు సంబంధించి కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో నందిగామ అనాసాగరంకు చెందిన పిడతల సత్యంబాబును దోషికి తేల్చి విజయవాడ కోర్టు 2010 శిక్ష వేసింది. అయితే ఆ తర్వాత అతడిని నిర్దోషిగా నిర్ధారిస్తూ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసింది.

01/03/2019 - 03:30

హైదరాబాద్, జనవరి 2: సినీ హీరో ప్రభాస్ గెస్టుహౌస్ రెవిన్యూ అధికారులు సీజ్ చేయడానికి సంబంధించిన కేసుపై బుధవారం హైకోర్టులో వాదనలు వాడివేడిగా జరిగాయి. గెస్టుహౌస్ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తు ఏ నిర్ణయాలు తీసుకున్నదీ తెలపాలని రెవిన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు రామసుబ్రహ్మణ్యం, కేశవరావుతో కూడిన ధర్మాసనం కేసును విచారించారు.

01/03/2019 - 02:44

చండీగఢ్, జనవరి 2: గోశాలలకు ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్ పథకాన్ని పరిశీలించి దానిని కొనసాగించాలో రద్దు చేసుకోవాలో నిర్ణయించాలని పంజాబ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి పంజాబ్- హర్యానా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టరయిన గోశాలలకు ఉచితంగా విద్యుత్‌ను అందించాలని, గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం 2017లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Pages