S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/30/2018 - 03:43

కాకినాడ సిటీ, డిసెంబర్ 29: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సీపోర్టులో శనివారం ఉదయం రెండు భారీ క్రేన్లు కుప్పలకూలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం ఉదయం కార్మికులు విధుల్లో ఉండగా చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో పోర్టులో విధి నిర్వహణలో ఉన్న కొందరు కార్మికులు క్రేన్లు కుప్పకూలుతుండగా వీడియో చిత్రీకరించి ఆ వివరాలను మీడియోకు విడుదల చేశారు.

12/30/2018 - 03:40

తిరుపతి, డిసెంబర్ 29: తిరుమలలో మాధవ నిలయం వద్ద తల్లిదండ్రుల ఒడిలో నిద్రపోతూ శుక్రవారం కిడ్నాప్‌కు గురైన మహారాష్టక్రు చెందిన 16 నెలల వీరేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. నిందితుడికి సంబంధించి సమాచారం సేకరించడంలో పోలీసులు కొంత పురోగతి సాధించారు.

12/30/2018 - 01:46

ఉప్పల్, డిసెంబర్ 29: నిషేధ గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఉప్పల్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1.5 కిలోల డ్రై గంజాయితో పాటు హోండా ఆక్టివా, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

12/29/2018 - 01:37

మచిలీపట్నం, : అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఉన్న కృష్ణా జిల్లాలో నేరాలు తగ్గు ముఖం పడుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా చూస్తే ఈ సంవత్సరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫ్రెండ్లీ పోలీస్ నినాదంతో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేరాలను అదుపు చేయడంలో సఫలీకృతులయ్యారు.

12/29/2018 - 01:32

రాజేంద్రనగర్, డిసెంబర్ 28: రాజేంద్రనగర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని రోజులుగా తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు దట్టమైన మంచులో ప్రయాణించాలంటే ప్రజలకు కత్తిమీద సాములాగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మంచులో ప్రయాణం చేయడం కష్టంగా మారింది.

12/29/2018 - 01:06

విజయవాడ, డిసెంబర్ 28: రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అడ్డుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆర్థిక మోసాలపై రిజర్వు బ్యాంక్, బ్యాంక్‌ల ఉన్నతాధికారులు, సీఐడీ, హోం శాఖ అధికారులతో శుక్రవారం పునేఠా సమీక్షించారు.

12/29/2018 - 00:16

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనలో భాగంగా ఏపీలో హైకోర్టుకు సంబంధించిన కనీస వసతులు చేపట్టకుండా కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు తప్పుపట్టారు. దీనిని ఏకపక్ష నిర్ణయంగా అభివర్ణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 26న రాష్టప్రతి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు 31వ తేదీని గడువుగా ప్రకటించడం పట్ల న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు.

12/29/2018 - 00:01

తిరుపతి, డిసెంబర్ 28: తిరుమల పుణ్యక్షేత్రంలో మరోమారు కిడ్నాప్ కలకలం రేపింది. భక్తులు బసచేసే మాధవనిలయం సముదాయం వద్ద తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న 16 నెలల బిడ్డను అపరిచితుడు శుక్రవారం కిడ్నాప్‌చేసి తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు.

12/29/2018 - 00:00

తిరుపతి, డిసెంబర్ 28: చిత్తూరు జిల్లా తిరుపతి శివారు కరకంబాడి పై భాగాన ఉన్న శేషాచల కొండల్లో ఉన్న సీలు కోన వద్ద ఎర్రస్మగ్లర్లకు, టాస్క్ఫోర్స్ సిబ్బందికి మధ్య శుక్రవారం సాయంత్రం పోరు సాగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై పెద్ద సంఖ్యలో ఉన్న ఎర్రకూలీలు రాళ్లతో దాడికి తెగబడ్డారు.

12/28/2018 - 23:45

విజయవాడ (క్రైం), డిసెంబర్ 28: రాష్ట్రంలో నేరాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చుకుంటే.. 2018లో 3.49 శాతం తగ్గాయి. అదేవిధంగా మహిళా సంబంధ నేరాలు కూడా గత ఏడాది కంటే ఈ సంవత్సరం 4.23శాతం తగ్గింది. దీంతోపాటు రోడ్డు ప్రమాదాలు కూడా 11.76 శాతం తగ్గాయి. మొత్తం మీద ప్రధానమైన నేరాలు అదుపులోకి వచ్చినా.. ఆర్థికపరమైన, సైబర్ నేరాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

Pages