S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/31/2018 - 03:33

తణుకు, డిసెంబర్ 30: గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్)లో అతడో చిరుద్యోగి... వయస్సు నాలుగు పదులు కూడా దాటలేదు... అయినా ఆదాయానికి మించిన ఆర్జనలో ఆరితేరిపోయాడు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు ఈ చిరుద్యోగి ఆర్జించాడు. 85.62 ఎకరాల వ్యవసాయ భూమి, 19ఇళ్ల స్థలాలు, మూడు ఫ్లాట్లు, నాలుగు భవనాలు, ఐదు కార్లు, 50 కాసుల బంగారం, ఐదు లక్షల నగదు...

12/31/2018 - 04:49

న్యూఢిల్లీ: హైకోర్టును విభజించి, ఆంధ్రాకు తరలించడాన్ని సవాలు చేస్తూ ఏపీ న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వౌలిక సదుపాయాలు కల్పించకుండా, ముందుగా ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా, హఠాత్తుగా హైకోర్టును అమరావతికి తరలించడాన్ని ఏపీ న్యాయవాదుల సంఘం తన పిటిషన్‌లో తప్పుపట్టింది. ఊహించని విధంగా వెలువడిన ఆదేశాలతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేసింది.

12/31/2018 - 03:00

మేడ్చల్, డిసెంబర్ 30: కారు ఢీకొని వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... పట్టణంలోని కిందిబస్తీకి చెందిన బీ. పోచమ్మ(70) మేడ్చల్ ఆర్టీసీ బస్సు డిపో వద్ద 44 జాతీయ రహదారి దాటుతుండగా అటుగా వస్తున్న మహీంద్రా జీపు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది.

12/31/2018 - 02:54

గచ్చిబౌలి, డిశంబర్ 30: వివాదాలకు కేంద్రమైన సన్ బర్న్ షో నిర్వాహకులపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి పాసులు జారీ చేయడంతో పాటు నిర్వాహకులు సరైన సదుపాయాలు కల్పించలేదు. నింబధనలను అతిక్రమించి 1 గంట వరకు షోను నిర్వహించడతో పాటు ఒకే డోర్ ఏర్పాటు చేయడం వలన తొక్కిసలాట జరింది. ఆలస్యంగా షో ముగించడతో పాటు ఒకే ద్వారం నుండి వచ్చిన వారిని బయటకు పంపిచడం వలన తొక్కిసలాట జరిగింది.

12/31/2018 - 02:51

గచ్చిబౌలి, డిశంబర్ 30: గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని కోకాపేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరువు నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్న రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం పడి ఉండడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

12/31/2018 - 02:21

లక్నో, డిసెంబర్ 30: యూపీలో ఒక పోలీసును చంపిన కేసులో 19 మందిని అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ ట్విటర్‌లో తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేష్ ప్రతాప్ సింగ్ వాట్స్ (48) ప్రధాని ఘజియాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభ బందోబస్తు ముగిసిన అనంతరం శనివారం రాత్రి పోలీసులు తిరిగి వస్తుండగా ఘజియాపూర్ జిల్లాలో కొందరు అల్లరి మూకలు ట్రాఫిక్‌కు నిలిపివేసి నిరసన తెలిపారు.

12/31/2018 - 02:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: భారతదేశంలో లింగ వివక్ష కొనసాగుతోందని, మహిళలకు చాలా రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఒక విమర్శ ఉంది. ఈ వివక్షతను రూపుమాపడానికి వివిధ రంగాల్లో అనేకమార్గాల్లో కృషి జరుగుతోంది. మహిళా సంఘాలు, రాజకీయ నేతలు, సామాజికవేత్తలు మహిళలకు జరుగుతున్న వివక్షపై నిత్యం ఎలుగెత్తుతూనే ఉన్నారు. మహిళల కోసం పలు చట్టాలున్నా అవి సక్రమంగా అమలు కావడం లేదని వీరు విమర్శిస్తున్నారు.

12/31/2018 - 00:36

తాడిపత్రి, డిసెంబర్ 30: అనంతపురం జిల్లా తాడిపత్రిలో నివాసం ఉంటున్న మట్కా డాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన కడప జిల్లా పోలీసులపై ఆదివారం దుండగులు మూకుమ్మడి దాడి చేశారు. పోలీసుల జీపుపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనలో కడప అర్బన్ సీఐ హమీద్ ఖాన్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. తాడిపత్రిలోని విజయ్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటున్న రషీద్ స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు.

12/31/2018 - 00:33

కె.కోటపాడు, డిసెంబర్ 30: పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా సంచలం సృష్టించింది. ఈ సంఘటనలో భర్త, కుమారుడు, కుమార్తె మృతి చెందగా, భార్య విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతోంది. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కె.సంతపాలెం శివారు చంద్రయ్యపేట వద్ద అదే గ్రామానికి చెందిన సబ్బవరపు కన్నంనాయుడు ఐదు నెలల నుండి కోళ్లఫారం నిర్వహిస్తున్నాడు.

12/30/2018 - 03:44

రాజమహేంద్రవరం, డిసెంబర్ 29: ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద నిర్మించుకుంటున్న ఇంటికి బిల్లు మంజూరు చేసేందుకు రూ. 10వేల లంచం స్వీకరిస్తూ గృహనిర్మాణ సంస్థ ఏఈ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సుధాకరరావు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో లబ్ధిదారుడి నుంచి రూ. 10వేల లంచం స్వీకరిస్తూ ఏఈ కెవి రమణ అవినీతి అధికారులకు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డారు.

Pages