S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/11/2018 - 04:17

మెగా హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్యత్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఘాజీ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రానికి దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. కాగా చిత్ర ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

12/11/2018 - 04:15

కార్తీక్ సుబ్బరాజు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రజనీకాంత్ చిత్రం పేట. కలిసొచ్చిన అదృష్టంతో త్రిష, సిమ్రాన్‌లు రజనీ సరసన అవకాశాలు అందుకున్నారు. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆడియోను ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ఇప్పటికే పేట రెండు లుక్కులను విడుదల చేసిన యూనిట్, ఈసారి వేడుకకు ముందు రజనీ థర్డ్‌లుక్‌నీ విడదల చేసింది.

12/11/2018 - 04:13

అమాయకంగా కనిపించే హన్సికలో ఇంత పెడసరం పెర్ఫార్మెన్సా? అనిపిస్తోంది కదూ. నిజమే బబ్లీ బ్యూటీని ఇలా చూడ్డానికి మనసొప్పుకోకున్నా -మహా చిత్రంతో మెప్పిస్తానంటోంది హన్సిక. కెరీర్‌లో 50వ చిత్రం కోసం వైవిధ్యమైన కథను ఎంచుకున్న హన్సిక -ట్విట్టర్ వేదికగా ఫస్ట్‌లుక్‌లో ఇలా దర్శనమిస్తోంది.

12/09/2018 - 22:04

బెల్లంకొండ శ్రీనివాస్‌తో జోడీకట్టిన కాజల్ ‘కవచం’లో మంచి కెమిస్ట్రీని రుచి చూపించింది. త్వరలో దర్శకుడు తేజతో బెల్లంకొండ చేయబోయే ప్రాజెక్టులోనూ మరోసారి రొమాన్స్ చేయడానికి కాజల్ రెడీ అవుతోందట. కవచంలో శ్రీనివాస్, కాజల్ పెయిర్ ఆకట్టుకున్నా -సినిమా మాత్రం ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయలేకపోయింది.

12/09/2018 - 22:02

ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఫాంటసీ థ్రిల్లర్ -ఓడియన్. సెన్సార్ వద్ద ‘యు’ సర్ట్ఫికెట్ సాధించిన సినిమా డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఒక్క కేరళలోనే 400 స్క్రీన్స్‌పై విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేశారు. తమిళంలోకి అనువాదమైన తొలి మలయాళ చిత్రం ఇదే అయితే, ఇటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేస్తున్నారు.

12/09/2018 - 22:00

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం మహర్షి. కథాపరంగా సినిమాలోని కొంత భాగాన్ని విదేశాల్లోనూ, మరికొంత భాగం ఇండియాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్‌లో ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

12/09/2018 - 21:58

శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. అభిషేక్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది. సత్యదేవ్, నందితాశే్వత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్య కృష్ణన్, టెంపర్ వంశీ, దిల్మ్రేశ్ కీలక పాత్రధారులు. గోపీ గణేష్ పట్ట్భా దర్శకుడు. చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా శివలెంక మాట్లాడుతూ సెన్సార్ యు/ఎ వచ్చింది. డిసెంబర్ 28న సినిమా విడుదల చేస్తాం.

12/09/2018 - 21:56

కడై కుట్టి సింగం (చినబాబు), తీరన్ అదిగారం ఒండ్రు (ఖాకి) చిత్రాలతో వరుస విజయాలు అందుకొని ఫుల్ జోష్‌లో వున్నాడు హీరో కార్తి. ఆయన తాజాగా ‘దేవ్’ అనే అడ్వెంచరస్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తరువాత కార్తి ‘మానగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నాడట.

12/09/2018 - 21:54

‘సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్’ పతాకంపై బీరం సుధాకరరెడ్డి నిర్మించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషా రెబ్బ జంటగా నటించిన మూవీతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమయ్యాడు. విడుదలైన మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్‌కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. కొత్త దర్శకుడైనా సంతోష్ కథను చాలా గ్రిప్పింగ్‌గా నడిపాడు.

12/09/2018 - 21:53

ఒకే ఒక్క పెళ్లిచూపులు చిత్రంతో అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ వద్ద మంచి మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ రీతూ వర్మ. ఆధునిక తరంలోని గడుసుపిల్లగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన రీతు -ఆ తరువాత ‘కేశవ’ చేసినా ఆశించిన స్థాయిలో ఇమేజ్ రాలేదు. కేశవ చిత్రం సైతం ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవడంతో -రీతూవర్మ పెర్ఫార్మెన్స్‌కూ ఆదరణ దక్కలేదు. రెండో సినిమా నిరాశపర్చడంతో తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి.

Pages