S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/22/2018 - 22:13

మాస్ రాజాగా తెలుగు ప్రేక్షకులచే క్రేజ్ తెచ్చుకున్న రవితేజ సినిమా అంటే ఒక్క మాస్‌కే కాదు.. అటు క్లాస్ ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇష్టం. అందుకే ఆయనకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఆయన సినిమాలంటే పిల్లలు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. రవితేజ తాజాగా ‘నేల టిక్కెట్టు’తో మరో విజయం కోసం సిద్ధం అయ్యాడు. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది.

05/22/2018 - 22:10

తెలుగులో హీరోయిన్‌గా వెలగాలని కలలుగన్న హాట్ భామ శ్రద్ధాదాస్ ఆశలు మాత్రం నెరవేరలేదు. ఎన్ని ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ పరంగా ఒక్కటి సరైన విజయాన్ని అందించలేదు. దాంతో ఐటెం గర్ల్‌గా, హాట్ హాట్ పాత్రల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు ఓ వేశ్య పాత్రలో నటించేందుకు రెడీ అయింది. పైగా ఈ పాత్రతో మళ్లీ తన కెరీర్ గాడిలో పడుతుందన్న నమ్మకంతో ఉంది మరి.

05/22/2018 - 21:50

దర్శకుడు మారుతి మళ్లీ మెగా కాంపౌండ్‌లో ఛాన్స్ పట్టేసాడు. ఇదివరకే అల్లు శిరీష్‌తో కొత్తజంట, గీతాఆర్ట్స్ బ్యానర్‌లో భలే భలే మగాడివోయ్ లాంటి హిట్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మళ్లీ మెగా హీరోతో ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈసారి ఆయన సినిమా చేసే మెగా హీరో ఎవరో తెలుసా? మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్.

05/22/2018 - 22:14

**నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తేనే ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఏర్పడుతుంది. చిన్ననాటి నుంచి నా కల.. నా ఆశయం.. సినిమానే. అదే నా ప్రపంచం. చిత్రసీమలో నిలదొక్కుకొని మంచి పాత్రలు పోషించి నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాల నుంది. నేను అనుకున్నది తప్పకుండా సాధిస్తానన్న నమ్మకం నాలో బలంగా వుంది. అదే దారిలో పయనిస్తున్న నాకు మంచి అవకాశాలు వస్తున్నాయ.

05/21/2018 - 22:04

సాహో.. ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం. బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం దుబాయ్‌లోని అబూదభిలో పలు కీలక ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నిబెట్స్ ఆధ్వర్యంలో యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఇంటర్నేషనల్ మీడియా పలు కథనాలను ప్రచురించింది.

05/21/2018 - 22:07

సమాజంలో ప్రతి మనిషికి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవించడం లేదంటే జరిగే మలుపులు ఎలా ఉంటాయి అనే కథాంశంతో రూపొందిన మూవీ ‘లా’.. ‘లవ్ అండ్ వార్’’ అనేది ఉప శీర్షిక. పూర్తిస్థాయి క్రైం మరియు సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లోఉంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగా... హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ..

05/21/2018 - 22:09

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈనెల 20న జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు జోరుగా బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు రామ్‌చరణ్ ఓ అరుదైన గిఫ్ట్‌ను అందించాడట. చరణ్-ఎన్టీఆర్‌లమధ్య మంచి స్నేహబంధం ఉంది. సమయం దొరికినపుడల్లా వీరిద్దరూ కలిసేందుకు సిద్ధమవుతారు. అలాగే తమ ఫ్యామిలీలతోపాటు పలు సెలబ్రేషన్స్ జరుపుకున్న విషయం తెలిసిందే.

05/21/2018 - 22:10

శ్రీకాంత్, శాలు చౌరశియా, మమతా చౌదరి, జెబా అస్రమ్ నాయకానాయికలుగా నటిస్తున్న ‘పెళ్ళంటే’...? చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో తరుణ్ క్లాప్‌నివ్వగా, రాజేంద్రకుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘మా’అధ్యక్షుడు శివాజీరాజా గౌరవ దర్శకత్వం వహించారు. ఏంజెల్ ప్రొడక్షన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ బ్యానర్స్‌పై అలీ భాయ్ నిర్మిస్తున్నారు.

05/21/2018 - 22:05

తెలుగు సినీ చరిత్రలో సుమారు ఏడువేలు చిత్రాలు రాగా వాటిల్లో నవలల ఆధారంగా రూపొందినవి సుమారు 75 చిత్రాలు. అంటే, ఒక శాతం అన్నమాట. మళ్లా ఈ నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో అగ్రతాంబూలం యద్దనపూడి సులోచనారాణికి దక్కుతుంది. సుమారు 15 చిత్రాలు ఆమె వ్రాసిన నవలల ఆధారంగా చిత్రాలు రూపొందాయి.
అన్నపూర్ణలో అక్షరాభ్యాసం..

05/21/2018 - 21:46

నరుడా ఓ నరుడా ఏమి కోరిక అంటూ అలనాటి అందాల ముద్దుగుమ్మ రంభ, నందమూరి బాలకృష్ణతో ఆడిపాడిన పాట తెలుగు సినిమా వున్నంతకాలం గుర్తుండిపోయేలా చిత్రీకరించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఏ విధమైన టెక్నాలజీ లేనప్పుడు మరుగుజ్జులుగా చూపించిన ఘనత ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్‌కే చెందుతుంది. నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో మొదటిస్థానంలో భైరవద్వీపం వుంటుంది.

Pages