S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/25/2018 - 22:18

సగటు ప్రేక్షకుడికి సినిమాయే పెద్ద వినోదం. సినిమాల్లో హీరోలు చేసే యాక్షన్‌లు, డ్యూయెట్లు.. గట్రా ఇష్టం. అలాగే హీరోయిన్ల విషయంలో మాత్రం గ్లామర్ అంటేనే ఆసక్తిని కనబరుస్తారు. అలాగని నటిగా తనని తను ప్రూవ్ చేసుకునే సినిమాలు వచ్చినా సరే చూస్తారు. కానీ సినిమా అంటే హీరోయిన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లామరే. ఒకప్పుడు హీరోయిన్ వేరు, ఇప్పటి హీరోయిన్ వేరు. అప్పట్లో హీరోయిన్ అంటే కథలోంచి పుట్టేది.

05/24/2018 - 21:16

మాస్ రాజా రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం నేల టిక్కెట్టు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా శుక్రవారం విడుదలవుతుంది. మాళవిక శర్మ హీరోయిన్. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర యూనిట్ మీడియా మీట్ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ..

05/24/2018 - 21:14

యంగ్ హీరో రాజ్‌తరుణ్ ‘రాజుగాడు’ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు, చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. ఈడోరకం ఆడోరకం, అంధగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి విజయవంతమైన చిత్రాలనందించిన ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం కావడంతో రాజుగాడుపై భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

05/24/2018 - 21:12

సంతోష్‌రాజ్, నెహాదేశ్ పాండే జంటగా సీనియర్ నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా అనువంశికత. కౌండిన్య మూవీస్ బ్యానర్‌పై తాళ్లపల్ల దామోదర్ గౌడ్ నిర్మించగా ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ ముక్కెర. ఈ చిత్ర ప్రిమియర్ షో ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి చిత్రాన్ని చూసి మేనరికం చేసుకోవటంవల్ల అనర్థాలు ఏమిటి సమస్యలపై రూపొందించిన ఈ అనువంశికత చాలా బాగుంది.

05/24/2018 - 21:09

మంచు లక్ష్మి ముఖ్యపాత్రలో ప్యూర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ టీజర్ విడుదలై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆమె పేరు దీక్ష. ఆమెకు ఒక సమస్య ఉందా లేక ఆమే ఒక సమస్యా! అనే పాయింట్‌తో ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుంది ఈ సినిమా. జూన్ 1న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాబోతోంది.

05/24/2018 - 21:07

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ బంధువు (బావ) సినిమాకు ఊహించని ఆటంకం ఎదురైంది. సినిమాను విడుదల చేస్తే మూల్యం చెల్లించక తప్పదని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. సల్మాన్ బావ ఆయుష్ శర్మ లవ్ రాత్రి అనే సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సల్మాన్ సొంత బ్యానర్‌లో తెరకెక్కుతోంది.

05/24/2018 - 21:06

శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌లో నాగశౌర్య, షామిలి జంటగా కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. మే 25న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ- ఈ సినిమాలో రావు రమేశ్ మన ఇంట్లో కనబడే క్యారెక్టర్‌లో కనిపిస్తారు. సుమిత్ర అమ్మమ్మగారి పాత్రకు అతికినట్లు సరిపోయారు.

05/24/2018 - 21:04

గ్రీన్ గోల్డ్ యానిమేషన్ నుండి మరో ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘హనుమాన్ వర్సెస్ మైరావణ’ ‘చోటా భీమ్’ సృష్టికర్తలు ఈ చిత్రం కోసం అహర్నిశలు శ్రమించారు. భారతీయులకు ఇష్టమైన కార్టూన్ షో చోటా భీమ్ ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. హనుమంతుడు రామాయణం నుండి చెప్పని కథ ఆధారంగా రూపొందించిన పౌరాణిక చిత్రం ఇది.

05/24/2018 - 21:02

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రస్థానం హిందీ రీమేక్‌లో నటించనున్నారు. ఒరిజినల్‌ను తెరకెక్కించిన దేవా కట్టానే హిందీలోనూ దర్శకుడు. అక్కడ సాయికుమార్ పాత్రను ఖల్‌నాయక్ సంజయ్‌దత్, శర్వానంద్ పాత్రలో అలీ ఫాజల్ నటించనున్నారు. 2010లో విడుదలైన ప్రస్థానంకు ఎన్నో అవార్డులు వచ్చాయి. శర్వానంద్, సాయికుమార్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

05/24/2018 - 21:00

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పరిచయం’. విరాట్ కొండూరు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సామ్రాట్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

Pages