S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/27/2018 - 21:58

మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

05/27/2018 - 21:56

ప్రముఖ నటుడు మాదాల రంగారావు (70) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా మైనంపాడు స్వగ్రామంలో 1948 మే 25న జన్మించిన మాదాల రంగారావు ప్రజా నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు.

05/27/2018 - 21:54

ఆదిత్యఓం, స్వాతి టాండన్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న త్రిభాషా చిత్రం ‘యంగ్ స్టార్స్’. రాధ వైష్ణవ్ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై రాధ వైష్ణవ్ లక్ష్మీనారాయణ, ఔరంగజేబ్, వినోద్‌పార్వతి, మురళీకృష్ణ, మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో యంగ్‌స్టార్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ..

05/27/2018 - 21:52

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజరు భూపతి దర్శకత్వంలో కెసిడబ్ల్యూ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. ‘యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో కీలక పాత్ర పోషించిన రావు రమేష్ మాట్లాడుతూ- కథను నమ్మి తీసిన చిత్రమిది. సరైన కథ లేకుండా ఎన్ని కష్టాలు పడ్డా ప్రయోజనం శూన్యం. రాంకీ ఇందులో తండ్రి పాత్ర పోషించారు.

05/27/2018 - 21:48

నక్సలైట్లు ప్రభావం చూపుతున్న తరుణం అది. అడవిలో అన్నలు.. సమాజంలోని అంతరాలను ప్రశ్నిస్తున్న రోజులవి. చిత్రసీమలో ప్రేమకథలు, కుటుంబ కథలు రాజ్యమేలుతున్న కాలంలో విప్లవ భావాలతో ‘ఎర్ర’ సినిమాలను తెరకెక్కించేందుకు ఓ సూర్యుడు ఉదయించాడు. ఎరుపెక్కిన కళ్లతో.. జనం ముందుకు దూసుకొచ్చాడు. వారిలో చైతన్యం కలిగించి, ఉత్సాహంతో ఉరకలు వేయించాడు.

05/25/2018 - 22:15

లెక్కల మాస్టారు సుకుమార్ ప్రస్తుతం రంగస్థలం విజయంతో జోరుమీదున్నాడు. ఏకంగా 200 కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌లో టాప్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఆయన మహేష్‌బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మించే ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌వర్క్‌లో బిజీగా వున్నాడు సుకుమార్.

05/25/2018 - 22:14

నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేస్తున్న ఆయన తన తదుపరి చిత్రానికి ఓకె చెప్పినట్టు తెలిసింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సంచలన విజయం సాధించి బాలకృష్ణ కెరియర్‌లో నిలిచిపోయాయి.

05/25/2018 - 22:13

మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల మనసులు గెలుచుకుంది ఈ చిత్రం. ‘మహానటి’ విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా స్వప్నదత్ మాట్లాడుతూ- ‘‘మూడోవారం కూడా ‘మహానటి’ సినిమా విజయవంతంగా రన్ అవుతోంది.

05/25/2018 - 22:12

శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా మహాత్మా, ఆపరేషన్ దుర్యోధన వంటి పవర్‌ఫుల్ చిత్రాల తర్వాత మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటించిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. బివేర్ ఆఫ్ పబ్లిక్ అనేది ట్యాగ్‌లైన్. అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణం బాబ్జీ దర్శకత్వంలో అలివేలమ్మ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

05/25/2018 - 21:57

సీనియర్ నటుడు రహమాన్ నటించిన చిత్రం ‘ఒరుముగతిరై’. సెంథిలీ నాథన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి.వెంకటేశ్ తెలుగులో ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో విడుదల చేస్తున్నారు. సినిమా జూన్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పాటల బిగ్ సీడీని మీడియా మిత్రుల చేతుల మీదుగా విడుదలచేశారు.

Pages