S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/23/2018 - 22:32

ప్రస్తుతం నేల టిక్కెట్టు సినిమాతో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన రవితేజ, ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే శ్రీను వైట్లతో అమర్ అక్బర్ ఆంటోనీ, తేరి రీమేక్‌లు చేస్తున్న ఆయన ఈనెల చివరి నుండి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లనున్నారు. దాదాపు రెండు నెలలపాటు అక్కడే ఉంటాడట.

05/23/2018 - 22:26

టాలీవుడ్ తెరకెక్కనున్న క్రేజీ మల్టీస్టారర్‌పై ఇప్పుడు అందరి దృష్టిపడింది. ఆర్‌ఆర్‌ఆర్ కాంబినేషన్‌లో సినిమా అంటూ వార్తలు వచ్చినప్పటినుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ జనాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత రాజవౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దానికితోడు మెగా ఫ్యామిలీ...

05/23/2018 - 22:16

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రానికి ‘విజేత’ టైటిల్ ఖరారుచేసారు. 1985లో చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు అల్లుడు కూడా ఇదే టైటిల్‌తో ఇండస్ట్రీకి వస్తున్నాడు. లైటింగ్ ఆఫ్ స్మైల్స్ ఆన్ అదర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ సక్సెస్ అనేది ట్యాగ్‌లైన్. అంటే ఇతరుల మొహాల్లో వెలుగు చూడటం కూడా విజయమే అని అర్థం.

05/23/2018 - 22:28

మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.సరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

05/23/2018 - 22:13

నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరోగా రాజ్ సత్య దర్శకత్వంలో సినిమా పీపుల్స్ పతాకంపై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణుగోపాల్ కొడుమగుళ్ల, ఎమ్.ఎల్ రాజు, ఆర్.ఎస్ కిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్రైవర్ రాముడు’. థర్డ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇటీవలే విడుదలైన మొదటి ప్రచార చిత్రం సినిమా అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన మొదటి టీజర్‌ను విడుదల చేసారు.

05/23/2018 - 22:27

ఇటీవల ‘మహానటి’ పేరుతో ఒక చలనచిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. అందుకుగల కారణాలను సినీ పరిశ్రమలోని పెద్దలు విశే్లషిస్తున్నారు. మెగాస్టార్లు లేకుండా ఒక సాదాసీదా బయోపిక్ అంతర్జాతీయ స్థాయిలో ఇంత డబ్బు ఎలా వసూలు చేసింది? అని సినీ పండితులు ఆశ్చర్యపడుతున్నారు. ఐతే ఇందులో కథానాయిక పేరు సావిత్రి. ఆమెను ఈ తరంవారు ఎరుగరు. కాంచనమాల, మీనాకుమారి, సావిత్రి వీరు లెజెండరీస్.

05/23/2018 - 22:30

సినిమా అంటే... గ్లామర్? అందుకే హీరోయిన్స్ గ్లామర్ విషయంలో కాస్త ఒక అడుగు ముందే ఉంటారు. నేను గ్లామర్‌కు దూరం ఎక్స్‌పోజ్ చేయను అన్న హీరోయిన్స్‌కు పెద్దగా అవకాశాలు రావు.. వచ్చిన ఆమె క్రేజ్ ఎక్కువ పెరగదన్న విషయం ఇప్పటికే ఎందరో రుజువుచేసారు కూడా. అందుకే ఈ అమ్మడు కూడా గ్లామర్ దారిలో వెళ్లేందుకు రెడీ అయినట్టు చెప్పకనే చెప్పింది. ఇంతకీ ఎవరా భామ.. ఏమా కథ అంటే...

05/22/2018 - 22:11

ఈమధ్య ఇండియన్ స్టార్స్‌కు హాలీవుడ్‌లో తారలుగా ఎదగాలనే ఆశలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనెలు అక్కడ క్రేజ్ తెచ్చుకున్నారో అప్పటినుండి పలువురు భామలు కూడా హాలీవుడ్ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇండియన్ స్టార్ అంటే అక్కడివాళ్లకు ఆసక్తి ఎక్కువ. అయితే అందరికీ భిన్నంగా తనకు హాలీవుడ్ సినిమాల్లో పనిచేయడం పెద్దగా ఇష్టం లేదని షాకిచ్చింది సొట్టబుగ్గల తాప్సీ?

05/22/2018 - 21:57

తెలుగులో మొదటి ప్రయత్నంగా రూపొందుతున్న స్పేస్ సినిమా ఇటీవల హైద్రాబాద్‌లో ప్రారంభం అయింది. ఇప్పటికే వేసిన భారీ స్పేస్ సెట్స్‌లో షూటింగ్ మొదలుపెట్టారు. ఘాజి సినిమాతో జాతీయ దర్శకుడిగా గుర్తింపుతెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి తన రెండో ప్రయత్నంగా స్పేస్ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నాడు.

05/22/2018 - 21:56

అర్జున్‌రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరవకొండ నటిస్తున్న చిత్రం టాక్సీవాలా. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌కి చాలా క్రిటికల్ అప్లాజ్ రావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటోంది. జూన్ రెండవ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Pages