S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2018 - 20:51

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి ‘విజేత’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కళ్యాణ్ దేవ్ సరసన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదలచేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ..

05/28/2018 - 21:03

తమిళంతోపాటు తెలుగులోనూ అదే క్రేజ్ సంపాదించుకున్న విశాల్ తన ప్రతి సినిమాను తెలుగుతోపాటు తమిళంలో విడుదల చేస్తుంటాడు. తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

05/28/2018 - 21:01

కళ్యాణ్‌రామ్ తొలిసారి చేస్తున్న పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘నా నువ్వే’. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా నటించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈనెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో వాయిదాపడి జూన్ 14న విడుదలకానుంది.

05/28/2018 - 20:59

మైసూరు దత్తపీఠంలో సద్గురు గణపతి సచ్చిదానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా డా.రాజేంద్రప్రసాద్‌కు కళానిధి అవార్డుని అందించారు. నాలుగు దశాబ్దాలకు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు డా.రాజేంద్రప్రసాద్. ఈయనకు కళానిధి అవార్డును బహూకరించిన అనంతరం.. గణపతి సచ్చిదానందస్వామి మాట్లాడుతూ..

05/28/2018 - 20:57

సూపర్‌స్టార్ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కాలా’. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో పూర్తయిన నిర్మాతల మండలి నిరసన కారణంగా వాయిదాపడి చివరికి జూన్ 7వ తేదీన విడుదల కానుంది. ‘కబాలి’ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా రజనీ వెంటనే రంజిత్‌కు అవకాశమిస్తూ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలున్నాయి.

05/28/2018 - 20:55

సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. పారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది.

05/28/2018 - 20:54

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత... వీర రాఘవ’. మొదటిసారి తారక్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తుండటంతో ఈ చిత్రం గురించి పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోని కొంపల్లి ప్రాంతంలో జరుగుతోంది.

05/28/2018 - 20:52

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిషోర్ రచన, దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్‌కు సిద్ధమైంది. జూన్ రెండవ వారంలో ట్రైలర్, ఆడియో రిలీజ్ కార్యక్రమాలు జరగరనున్నాయి. దర్శకుడు రవికిషోర్ మాట్లాడుతూ- మనిషి చనిపోయినపుడు, నిద్రపోయినపుడు, కోమాలో ఉన్నపుడు అతని ఆత్మ ఎటువైపు వెళ్తుంది?

05/28/2018 - 20:50

సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా అలీ అబ్బాస్ జాఫర్ ‘భరత్’ అనే చిత్రానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లక ముందే బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భాయ్ ఇటీవలే ‘టైగర్ జిందా హై’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ‘రేస్ 3’లాంటి క్రేజీ మూవీలో నటిస్తూ వేడి పెంచాడు. ‘రేస్ 3’ ట్రైలర్ ఇటీవల విడుదలై యూత్‌లోకి దూసుకెళ్లిపోయింది.

05/28/2018 - 20:47

మహాదేవ్, మమతా మోహన్‌దాస్, సునయన హీరో హీరోయిన్లుగా రుషి కృష్ణ దర్శకత్వంలో అభిరామ్ నిర్మించిన చిత్రం ‘నివురు’. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. మా అధ్యక్షుడు శివాజీరాజా లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- మహాదేవ్‌కు చిన్నప్పటినుంచీ సినిమాలపై ఆసక్తి వుంది. అందరి హీరోల పేర్లను పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. సినిమా అంటే అతనికి అంత పిచ్చి.

Pages