S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/23/2018 - 21:03

పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ, అర్జున్‌రెడ్డి సినిమాతో సంచలన స్టార్‌గా మారిపోయాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘టాక్సీవాలా’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్2, యువి క్రియేషన్స్ బ్యానర్లపై ఎస్‌కెఎన్ నిర్మిస్తున్న చిత్రమిది.

02/23/2018 - 21:01

అందాల భామ శృతిహాసన్ త్వరలో పెళ్లిచేసుకుంటుందంటూ కోలీవుడ్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆమె బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్‌తో ముంబైలో మకాం పెట్టిందని, ఇద్దరూ డేటింగ్‌లో కూడా ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. ఈమధ్యే తన బాయ్‌ఫ్రెండ్‌ను తల్లిదండ్రులకు పరిచయం చేసిన శృతిహాసన్, ప్రస్తుతం సినిమాలు చేసే ఆలోచనలో లేదట.

02/23/2018 - 20:58

జనని క్రియేషన్స్ పతాకంపై అనురాగ్‌ను హీరోగా పరిచయం చేస్తూ సాయిదేవ రామన్ దర్శకత్వంలో పోకూరి లక్ష్మణాచారి నిర్మిస్తున్న చిత్రం ‘ఈక్షణం’. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శే్వత హీరోయిన్. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్‌కొట్టగా జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ- మా బ్యానర్‌లో తెరకెక్కుతున్న మొదటి చిత్రమిది.

02/23/2018 - 20:57

లై భారీ పరాజయం తరువాత నితిన్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘చల్‌మోహనరంగ’. త్రివిక్రమ్ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రంతోపాటు నితిన్ దిల్‌రాజు బ్యానర్‌లో మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువహీరో మరో దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట.

02/23/2018 - 20:54

బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హృతిక్ రోషన్ అంటే ఇప్పటికీ అమ్మాయిల హృదయాల్లో స్థానం సుస్థిరం చేసుకున్న స్టార్. ఆయనకున్న చరిష్మా గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. క్రిష్, ధూమ్-2, ఏ జిందగీ మిలేంగీ దుబారా లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న హృతిక్ రోషన్ ఆకస్మికంగా జైపూర్ రోడ్లపై సైకిల్‌పై తిరుగుతూ అప్పడాలు అమ్ముకోవడం షాక్ కలిగిస్తోంది.

02/23/2018 - 20:52

మారుతి, శ్రావణి, ప్రియ హీరో హీరోయిన్లుగా జయరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్‌లపై విశ్వనాథ్ తన్నీరు, సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎం-6’. ఈ చిత్రం టైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ ఫిలించాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ టైలర్‌ను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ హారర్ అంశాలతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

02/23/2018 - 20:50

కోలీవుడ్ చిత్రం ‘మద రాసి పట్టణం’ అనే సినిమాతో దక్షిణాదిన హీరోయినగా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్, తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన ‘ఐ’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో ‘ఎవడు’ చిత్రంలో నటించిన ఈ భామ, అప్పుడప్పుడు ఘాటు ఘాటు ఫొటోలతో జనాలకు షాకులిస్తూనే వుంది. అసలే లండన్ భామ కావడంతో ఆమె వ్యవహార శైలి కూడా మోడరన్‌గానే వుంటోంది.

02/22/2018 - 21:35

టాలీవుడ్‌లో వున్న హీరోల్లో శ్రీకాంత్ అంటే ప్రత్యేక గుర్తింపు. ఎందుకంటే స్టార్ ఇమేజ్ కోసం కాకుండా కెరీర్ ప్రారంభంనుంచీ విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన మొదటిసారి హారర్ చిత్రంలో నటించాడు. ‘రారా’ అంటూ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (నేడు) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ చెప్పిన విశేషాలు...

02/22/2018 - 21:34

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఓ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న అందాల చందమామ కాజల్‌కు ఈమధ్య కాస్త క్రేజ్ తగ్గినట్టుంది. కారణం- చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పరాజయాలు పలకరిస్తుండడంతో కొత్త అవకాశాలు రావడంలేదు. దానికితోడు వేరే కుర్ర హీరోయిన్లు గట్టి పోటీనిస్తుండడంతో కాజల్‌కు క్రేజ్ తగ్గింది.

02/22/2018 - 21:32

ప్రస్తుతం విభిన్నమైన కథ, కథనంతో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 1985 నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం తరువాత బోయపాటితో సినిమా చేస్తున్నాడు చరణ్. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి అప్పుడే బిజినెస్ పరంగా భారీ ఆఫర్లు వస్తున్నాయట.

Pages