S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/05/2016 - 21:35

ఈ సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ నటుడు శర్వానంద్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. రన్‌రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ నటుడు విభిన్నమైన కథా చిత్రాన్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్‌కు ఓకె చెప్పాడట.

02/05/2016 - 21:34

నవీన్ సంజయ్, వౌనిక జంటగా కావేరీ ట్రావెల్స్ పతాకంపై తమ్మినేడి సతీష్‌బాబు దర్శకత్వంలో ఎంపీనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘జానకిరాముడు’. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తికావస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

02/05/2016 - 21:34

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రం త్వరలో దక్షిణాది భాషల్లో రీమేక్ కానుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా పూర్తికావాలి. కానీ సరైన నటీనటులు దొరకకపోవడంతో ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సీనియర్ నటి, దర్శకురాలు రేవతి సన్నాహాలు చేస్తోంది.

02/05/2016 - 21:33

ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో లిప్‌లాక్‌లకు కొదవే లేకుండాపోయింది. ఏ సినిమాలో చూసినా అవసరం వున్నా లేకున్నా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ తరహా లిప్‌లాక్ సన్నివేశాలతో రక్తికట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ముద్దుసన్నివేశంతో సంచలనం సృష్టిస్తోంది నాటి గ్లామర్ తార కాజోల్. వెండితెరపై ఎవర్ గ్రీన్ లవ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్, షారూఖ్‌ల జంట అంటే అందరికీ క్రేజే.

02/05/2016 - 21:32

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘నాన్నకుప్రేమతో’ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 25నుండి ప్రారంభం కానుంది. సినిమా తర్వాత తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు ఎన్టీఆర్.

02/05/2016 - 21:32

అసద్‌షాన్, యాంబర్ రోజ్ జంటగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన ‘లండన్ లైఫ్’ చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ మేడారం చిత్ర వివరాలను చెప్పారు. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిదని, హాలీవుడ్‌లో దాదాపు 30 సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్‌లో పనిచేశానని, ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని రూపొందించానని అన్నారు.

02/05/2016 - 21:31

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్నాడు మహేష్‌బాబు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత మహేష్ నటించిన చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయట.

02/05/2016 - 21:29

తెలుగుచిత్రసీమలోఇప్పటివరకూ పోటీగా చెప్పుకున్న రెండు కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి
ఓ సినిమాలో నటిస్తున్నారన్న విషయం ఇప్పుడు సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్
సినిమాల హవా బాగానేవుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు మరో చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

02/05/2016 - 06:37

బాలీవుడ్‌లో రియల్ స్టోరీలు, బయోపిక్‌లకు మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ తరహా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా ఘనవిజయాన్ని నమోదు చేసుకున్నాయి. దాంతోపాటు మరికొన్ని సినిమాలు కూడా రూపొందిస్తున్నారు. ధోని, అజారుద్దీన్‌ల జీవిత కథల సినిమాలు సెట్స్‌పై వున్నాయి. తాజాగా మరో బయోపిక్ సెట్స్‌పైకి రానుంది.

02/05/2016 - 06:35

నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రల్లో ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ నిర్మిస్తున్న గుంటూర్ టాకీస్ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

Pages