S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/30/2017 - 03:56

న్యూఢిల్లీ, మార్చి 29: దాదాపు ఏడుగంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం చారిత్రక జిఎస్‌టి అమలుకు సంబంధించిన నాలుగు కీలక బిల్లులను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర జిఎస్‌టి, సమీకృత జిఎస్‌టి, రాష్ట్రాలకు పరిహార జిఎస్‌టి, కేంద్ర పాలిత ప్రాంతాల జిఎస్‌టి బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. అయితే ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన సవరణలను తిరస్కరించింది.

03/29/2017 - 02:54

శ్రీనగర్, మార్చి 28: కాశ్మీర్‌లో బుద్గాం జిల్లాలో భద్రతా దళాల చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో ముగ్గురు పౌరులు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. కాగా, భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు హతమైనారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీపంలో నిరసనలకు దిగిన ప్రజలపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఈ సంఘటన జరిగింది.

03/29/2017 - 02:48

న్యూఢిల్లీ/లక్నో, మార్చి 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చైత్ర నవరాత్రి ఉపవాస దీక్షలు చేపట్టారు. ఇద్దరు నేతలు దుర్గాదేవి భక్తులన్న సంగతి తెలిసిందే. దసరా నవరాత్రి సందర్భంగా కూడా ఇద్దరూ దీక్ష చేపట్టడమూ విదితమే. మంగళవారం నుంచి దీక్ష ప్రారంభం కావటంతో తదుపరి తొమ్మిది రోజులూ వేడినీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలను మాత్రమే మోదీ స్వీకరిస్తారు.

03/29/2017 - 02:46

కోల్‌కతా, మార్చి 28: మూడు దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్‌లో అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగిన సిపిఎం పార్టీకి ఇప్పుడు అధికారం దూరమవడం అటుంచి అసెంబ్లీలో బలం బాగా తగ్గిపోయి సొంతంగా ఒక రాజ్యసభ సభ్యుడిని గెలుపించుకోలేని వింత స్థితి ఎదురవుతోంది. పార్టీ వైఖరికి భిన్నంగా సైద్ధాంతక శత్రువైన కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరాల్సి రావడం దయనీయమే.

03/29/2017 - 02:44

న్యూఢిల్లీ, మార్చి 28: వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)పై ఏకపక్షంగా ముందుకు వెళ్లేది లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లులపై ఏకాభిప్రాయ ప్రాతిపదికనే ముందుకు వెళ్తామని మంగళవారం నాడిక్కడ జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జైట్లీ స్పష్టం చేసినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ వెల్లడించారు.

03/29/2017 - 02:42

న్యూఢిల్లీ, మార్చి 28: కొత్తగా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయటంద్వారా బీసీల ప్రయోజనాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లకు అధ్యక్షులు, ఇతర పదాధికారులను నియమించకుండా కుట్ర చేస్తోందంటూ మంగళవారం ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభను స్తంభింపజేశారు. విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలివ్వడంతో సభను బుధవారానికి వాయిదా వేయక తప్పలేదు.

03/29/2017 - 02:33

గ్రేటర్ నోయిడా/న్యూఢిల్లీ, మార్చి 28: గ్రేటర్ నోయిడాలో సోమవారం ఆఫ్రికన్లపై దాడి సంఘటనకు సంబంధించి అయిదుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దాడికి పాల్పడిన వారిపై కటిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

03/29/2017 - 02:04

న్యూఢిల్లీ, మార్చి 28: దురుసుగా, దౌర్జన్యంగా, అనాగరికంగా ప్రవర్తించే విమాన ప్రయాణికుల పేర్లతో ‘‘నో ఫ్లయర్స్’’ జాబితాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో పాటు ఇతరత్రా ఇలాంటి వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టి పెట్టింది.

03/29/2017 - 02:02

న్యూఢిల్లీ, మార్చి 28: మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వారసుడి ఎంపిక వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. ఈ పదవికి తమ సొంత అభ్యర్థిని బరిలోకి దింపుతామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. శివసేన ప్రతిపాదిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ అభ్యర్థిత్వాన్ని తాము బలపరచడం లేదని తేల్చిచెప్పింది.

03/29/2017 - 01:35

న్యూఢిల్లీ, మార్చి 28: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు విమానయాన కష్టాలు తీరడం లేదు. ముంబై నుంచి ఢిల్లీకి బుధవారం వచ్చేందుకు బుక్ చేసుకున్న విమాన టిక్కెట్‌ను ఎయిరిండియా రద్దు చేసింది. తనకు బిజినెస్ క్లాస్ సీట్ ఇచ్చేందుకు నిరాకరించిన ఎయిరిండియా మేనేజర్ ఆర్ సుకుమార్‌ను చెప్పుతో కొట్టిన ఘటనపై ఎయిరిండియా సహా ఐదు విమానయాన సంస్థలు ఏకమయ్యాయి.

Pages