S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/23/2018 - 05:53

న్యూఢిల్లీ, ఆగస్టు 22: వ్యవసాయ వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వినియోగిస్తే 2025 నాటికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 8 శాతం కాలుష్యాన్ని తగ్గించవచ్చునని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇనిస్టిట్యూట్, ఆటోమెటివ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 2025 నాటికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి పలు సూచనలు చేసింది.

08/23/2018 - 05:52

న్యూఢిల్లీ, ఆగస్టు 22: హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాశ్వత రక్షణ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ నాలుగు దేశాలకు చెందిన కొన్ని సంస్థలు సూచిస్తున్నాయి.

08/23/2018 - 21:34

శ్రీనగర్, ఆగస్టు 22: కాశ్మీర్ లోయ అంతటా ముస్లింలు బుధవారం ఈద్-ఉల్-అధా సంబరాలను జరుపుకున్నారు. తెల్లవారుజామునే ఈద్గా లు, మసీదులకు చేరుకున్న ముస్లిం సోదరులు ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా పురుషులు, మహిళలు తమ సంప్రదాయ దుస్తులతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాభినందనలు తెలుపుకున్నారు.

08/23/2018 - 04:36

న్యూఢిల్లీ, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్రానికి కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వినోద్ కుమార్ బుధవారం రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో సమావేశం అయ్యారు.

08/23/2018 - 06:40

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో 2016 ఫిబ్రవరిలో జరిగిన నిరసన ప్రదర్శనలపై చేసిన ప్రసారాలకు సంబంధించి మూడు వార్తా చానళ్లపై కేసులు ఏ ప్రాతిపదికన పెట్టారో వివరించాలని కేంద్ర సమాచార కమిషన్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసులో ఇంతకు ముందు కోరిన మేరకు 30 రోజుల్లో ఎందుకు సమాచారం ఇవ్వలేక పోయారో తెలియజేయాలంటూ ప్రభుత్వ అధికారులకు కమిషన్ షోకాజ్ నోటీసులను జారీచేసింది.

08/23/2018 - 05:27

న్యూఢిల్లీ: కేరళ వరద బాధితులకు దేశ రాజధానిలోని తెలుగు విద్యార్థిని అండగా నిలిచింది. ఢిల్లీలో 11వ తరగతి చదువుతున్న వై.సంస్కృతి ప్రధాన మంత్రి సహాయ నిధికి లక్షా యాభై ఆరు వేల రూపాయలను డిడి రూపంలో విరాళంగా అందజేసింది. తను దాచుకున్న పాకెట్‌మనీ, జన్మదినం నాడు వచ్చిన నగదు బహుమతులను కేరళ బాధితులకు ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది.
ఢిల్లీ తెలంగాణ జర్నలిస్టుల సాయం

08/23/2018 - 04:31

న్యూఢిల్లీ, ఆగస్టు 22: జన్యుపరమైన దోషాలను నివారించేందుకు గర్భవతులకు జన్యు స్క్రీనింగ్ పరీక్షలను తప్పనిసరి చేసే చట్టాన్ని తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఈ చట్టం అమలులోకి వస్తే ప్రతి గర్భవతి తప్పనిసరిగా జన్యు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. తలసేమియా ఇతర జన్యుపరమైన రోగాలను ప్రాథమిక దశలోనే కనుగొనవచ్చును. కేంద్రం ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించింది.

08/23/2018 - 04:30

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశరాజధాని ఢిల్లీలో ఉన్న ఐదు నక్షత్రాల హోటళ్ల వారు భూగర్భ జలాల వినియోగానికి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (సిజిడబ్ల్యుఎ) నుంచి అనుమతి పొందాలని, వారు ఎంత మొత్తంలో జలాలు వాడుతున్నారో, వారికి ఎంత నీరు అవసరమో తెలియజేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.

08/22/2018 - 17:16

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి ఐదుగురు చనిపోయారు. షమ్లి, కర్నాల్ జిల్లాల్లో ఈదారుణం జరిగింది. మరో 15మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.

08/22/2018 - 13:38

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్, ఐసీస్ జెండాలు కనిపించాయ. బ్రకీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం వీధుల్లో ఈ జెండాలు కనిపించాయ. ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

Pages